క్రైస్తవుడగుట ఎట్లు?

క్రైస్తవుడగుట ఎట్లు?

నీవెలా క్రైస్తవు డవగలవు? యేసును వెంబడించి ఆయన యందు విశ్వాసముంచువాడే క్రైస్తవుడు. దీనిని బైబిలు బహు సరళముగా తెలియజేయుచున్నది, కనుక నీవు క్రైస్తవుడవని తెలుసుకో గలవు.

నిత్యా జీవము పొందుటకు నేనేమి చేయాలని ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు యేసు, "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" (యోహాను 3:16) అని జవాబిచ్చెను. యేసు నందు విశ్వాసముంచిన వారికి నిత్యజీవము ఉంటుంది.

యేసు నందు విశ్వాసముంచుట ఎట్లు?

బైబిలు దీనికి సరైన జవాబిస్తున్నది: "అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు". (రోమా 10:9).

విశ్వసించుటలో రెండు భాగములున్నవి.మొదటిది, యేసు నీ ప్రభువు మరియు దేవుడని ఒప్పుకోవాలి. ఆయన సిలువలో మరణించుటకే పరలోకము నుండి భూలోకమునకు దిగివచ్చె ననియు మరియు మనము పరలోకమునకు వెళ్ళుటకు ఆయన మార్గమును చూపుచున్నాడనియూ నమ్మాలి.

రెండవది, ఆయన మరణము నుండి తిరిగి లేచనని నీవు విశ్వసించాలి. ఆయన సిలువలో మరణించాడు, ఆయన అలా మరణమై యుండిపోక, తిరిగిలేచియున్నాడు, అనేకులకు కనబడినాడు మరియు పరలోకమునకు ఆరోహణమైనాడు.

క్రీస్తునందు విశ్వాసిగా ఉండుటకు ఇప్పుడే నీవు ప్రార్ధించవచ్చును.

నీవు ఈ క్రింది విధముగా ప్రార్ధన చేసి నిత్యజీవము పొందుకోవచ్చును:

"ప్రియ ప్రభువైన యేసు, నేను పాపినని ఒప్పుకోనుచున్నాను. నన్ను నేను రక్షించుకోలేనని నాకు తెలుసు. నా పాపములకొరకు సిలువలో మరణించినందుకు వందనములు. నీ మరణము నా నిమిత్తమేనని మరియు నీ బలియాగము నకొరకేనని నమ్ముచున్నాను. నేను చేయగలిగినంతగా నా నమ్మకమును నాపైనుండి నీపైకి ఇప్పుడే మార్చుకొనుచున్నాను. నా జీవితపు తలుపులను నీకొరకు తెరుచుచున్నాను. విశ్వాసముతో నిన్ను నా ప్రభువుగా రక్షకునిగా అంగీకరించుచున్నాను. నా పాపములు క్షమించి నిత్యజీవమును అనుగ్రహించినందుకు వందనములు. ఆమెన్."

నీవు క్రైస్తవుడగునట్లు ఇప్పుడీ ప్రార్ధన చేసావా?

నీవు నిత్యజీవము కలవాడవని తెలుసుకొనునట్లు అని బైబిలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నది: "ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను అయన మన మనవి ఆలకించుననునదియే". (1 యోహాను 5:13).

నీవు ఈ రోజే క్రైస్తవునిగా మారినావని మేము తెలుసుకొను నట్లు క్రిందనున్న బటనును నొక్కుము.