డా. రవి జకర్యా గారు నాస్తికులకు జవాబు లిస్తున్నాడు సిరిస్ 2 . ప్రోగ్రాం 2

డా. రవి జకర్యా గారు నాస్తికులకు జవాబు లిస్తున్నాడు

 

సిరిస్ 2 . ప్రోగ్రాం 2

ఈ రోజు  జాన్ యాంకర్ బర్గ్ షో లో  డాక్టర్.  రవి జకరయాస్ నాస్తికులకు జవాబు చెపుతాడు.

ఇండియాలో పుట్టి పెరిగిన ఇతడి పూర్వికులు , ఉన్నత హైందవ కులంలో పూజారులుగా ఉండేవారు. ఐతే ఒక  రోజు న ఇతడు యేసు వాక్యాన్ని విని క్రైస్తవునిగా మారిపోయాడు. ఆ తరువాత ప్రపంచము లో ఒకరిగా ఎదిగి 70 కి మించిన దేశాలలో పర్యటించి, ఆనేక ఉన్నత స్తాయి యూనివర్సిటిల లో   Harvard యూనివర్సిటిల లో   ,Princeton,  Dartmouth, Johns Hopkins,  Oxford వంటి యూనివర్సిటిల లో   ప్రసంగించారు. శాంతి ఒప్పందాన్ని వ్రాసిన రచయితల ఎదుట దక్షిణ ఆప్రికాలో   ప్రసంగించారు.  Lenin సైనిక అకాడమి లోను, మాస్కోలోని  Geopolitical Strategy కేంద్రం లోని సైనికాధికారూల ఎదుటను మాట్లాడారు.

 

New York  United Nations సంవత్సరిక ప్రార్దన ఉదయాహారపు కూడికలలో ఇతడు మూడుసార్లు భోదించాడు.   Ottawa, Canada, London, England, లలో జరిగే జాతీయ, అల్పాహార ప్రార్దన కూడికలలో  కూడా ఇతడు పలుమార్లు ప్రసంగించాడు.  Washington, DC.లోని CIA లో కూడా మాట్లడాడు. ఈ జాన్ యాంకర్ బర్గ్ ప్రోగ్రాంలో మాతో కలుసుకోండి

————-

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మా కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. నా పేరు జాన్ ఆంకెర్ బర్గ్. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నందుకు వందనములు. నేటి మన అతిధి ప్రఖ్యాత వేదాంతి, తత్వవేత్త, క్రైస్తవ సమర్ధన వాది. డా. రవి జకర్యా గారు. ఈయన 70 యూనివర్సిటీలలో ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసిన ప్రసంగీకులందరి కంటే ఎక్కువ విధ్యార్ధులతో మాట్లాడారు. యూరపులో విద్యార్ధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నేడు, ఈ కార్యక్రమంలో జవాబులు చెప్పబతున్నారు. యూరపులోని దేశాలలో  చూస్తున్న ప్రజలు – రవి, కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని విధ్యార్ధులతోటి మాట్లాడారు వారికీ సంగతి తెలుసు. మీలో  అక్కడ కలుసుకున్నారు. మనకు మొదటి ప్రశ్నగా,  రవి, ఆధునికతకు తర్వాతి పరిస్థితిని గురించి వివరించమని ఒక విద్యార్ధి యూనివర్సిటీలో అడిగాడు. ఈ మాటకు అర్ధం ఏమిటో చెప్పండి.

డాక్టర్. రవి జకరయాస్:    జాన్, ముఖ్యంగా, పశ్చిమ దేశాలలో చూస్తే వేదాంత సిద్ధాంతాలమొత్తం యూరపులోనే మనకు కనిపిస్తుంది. చూడండి, రెనె డెస్కార్టేస్ కాలంలోని కారణ విదానాలను గమనించండి, దాని తర్వాత జ్ఞాన వృద్ధి పొందటమనేది వచ్చింది. తర్వాత స్వామభావ శాస్త్రం వచ్చింది. దానిలో నుండి స్వయం నిర్ణయాధికార సూత్రం వచ్చింది. దాని తర్వాత ఆధునికతకు తర్వాతి కాలం ప్రారంభం. ఇది అద్భుతం. ఎందుకంటే మీరు కారణ వాదాన్ని గమనిస్తే, దీనికొక కారణ ముంటుంది. స్వానుభావాన్ని గమనిస్తే, దీనిలో మన సొంత అనుభవాలు, హేతుబద్ధమైన అనుకూలత ఇమిడి ఉన్నాయి.

తర్వాత 60 దశకంలో జీన్ పౌలు సార్త్రే, ఆల్బర్ట్  కేమస్ లు స్వయం నిర్ణయ వాదాన్ని ప్రారంభించారు. వారు ఎంతో గొప్ప రచయితలు. ముఖ్యంగా వారు ఈ సిద్ధాంతంలో  ప్రజలకు చెబుతున్నదేమంటే. “ఒక్క క్షణం ఆగండి. ఈ జ్ఞానయుక్తమైన వాదం, ఈ ప్రయోగశాల వివరాలన్ని వినేందుకు బాగానే ఉన్నాయి. ఐతే న మనసులో కోరికలు, భావాలు, ఆలోచనలు ఉన్నాయి. మీరు చెప్పే సూత్రానికవి సరిపోతాయా?” అని వారంటున్నారు. కనుక స్వయం నిర్ణయ వాడమంటే, సమస్యల్లో కూడా సొంతంగా నిర్ణయం తీసుకుని, జీవితాని కోక అర్ధాన్ని వెతకడం.

ఈ పనిలో వారు ఎంతో తెలివిగా ప్రవర్తించారు. సిద్ధాంతపు లోకంలో విద్యారంగం నుండ వైదొలగి. కథలను చెప్పడంలో సాహిత్యరంగంలోకి అడుగుపెట్టారు. కనుక, సార్త్రే, కేమస్ లాంటివారు అనేకా పుస్తకాలను రాశారు. దారిలేదు, వికారం, గోడలాంటి అనేక ప్రఖ్యాత పుస్తకాలను రాశారు. ఈ పుస్తకాలలో కొన్ని చాలా చిన్న పుస్తకాలు. ఐతే ఇవి కథలు గనుక, యూనివర్సిటీ విద్యార్ధులకు ఇవి చాలా బాగా నచ్చాయి. వీటిలో తమలాంటి వ్యక్తులే ఉన్నట్లనిపించింది.

కారణ వాదం నుండి, స్వానుభవ వాదానికి మారిన తర్వాత, స్వయం నిర్ణయ వాదం, తర్వాత ఆధునికతకు తర్వాతి కాలం, ఇది, వాటన్నిటిని తోసివేయ్యాలని చెప్పినది. అవన్నీ అధిక పరిపూర్ణతను కోరుతూ ఎల్లలను నిర్ణయిస్తున్నాయి. కనుక ఆధునికత తర్వాతి కాలాన్ని మూడు మాటల్లో నిర్వచించ గళం: అసత్యం, అర్ధరాహిత్యం, అనిశ్చితి. అసత్యం, అర్ధరాహిత్యం, అనిశ్చితి. ఈ సిద్దాంతాని లేవదీసిన వ్యక్తుల్లో ఫ్రాన్సు దేశీయుడు జాక్వ డెర్రిడా అనే వేదాంతి ప్రపంచ ప్రసిద్ధి పొందాడు. దీనిని యునైటెడ్ స్టేట్స్ మొత్తం ప్రకటించాడు. దీని వలన ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఆ కథకూడా యిప్పుడు గతించింది. అ వాదనయే కాకుండా, ఆ కథకూడా నిరాకరించబడింది.

దీనిలో వివరణ అధికారం రచయిత వద్ద నుండి పాఠకుని వద్దకు మారింది. పాఠకుడు మరలా వ్రాయగలడు, మరొక వివరణ ఇవ్వగలడు. మరొక విధంగా చెప్పగలడు. ఉన్నట్లుండి లక్షల ప్రజలు సత్యాన్ని వివరించడం ప్రారంభించారు.

ఇప్పుడొక సంగతి చెబుతున్నాను. వీటన్నిటిలో ఒక చక్కని సత్యం దాగి ఉన్నది. కారణానికి ఒక స్థలం, స్వానుభావానికి ఒక స్థలం, అనుభవ సారానికి ఒక స్థలం. ఇప్పుడు ఒక ప్రశ్న, దీన్నంతా చూసినప్పుడు, నాకు ఏ అధికార మున్నది? కనుక ఒక దాని వ్రేలును పట్టుకున్నప్పుడు, వారు వాస్తవపు పిడికిలినే పట్టుకుంటున్నట్లుగా అనుకుంటున్నారు.

సువార్తను గురించిన అధ్బుత మేమిటంటే, కారణానికోక స్థలముంది. అనుభవానికి ఒక స్థల మున్నది. స్వానుభావాన్ని పరిశీలించందుకు ఒక స్థాలమున్నది. మనిషికి ఒక ప్రత్యెక స్థాలమున్నది. దేవుడు మీకు ఒక ప్రత్యేకతను ఇచ్చి, ఆ ప్రత్యేకత ద్వారా జీవిత సమస్యలనెదుర్కొనే ధైర్యాన్నిస్తాడు. ఐతే ఆధునికతతర్వాతి కాలంలో వచ్చిన మార్పుల వలన లోకంలో సత్యానికి బలమైన విఘాతం కలిగింది. సత్యంలేదు, అర్ధంలేదు, ఆశ్చయత లేదు. ఆధునికత తర్వాతి కాలంలో ప్రజలందరూ ఈ అభిప్రాయాన్నే అనుసరించారు.

ఇప్పుడొక ప్రశ్న ఉన్నది. విమానంలో వెళ్తుండగా ఇంజనులో ఏదో సమస్య వచ్చింది. “ఇప్పుడు మనం పదివేల అడుగుల ఎత్తులో ఉన్నామని యంత్రం చూపిస్తున్నది. ఐతే దీనిలో ఎలాంటి సత్యం, అర్ధం, నిశ్చయత లేదని నేనమ్ముతున్నాను. ఎంత ఎత్తులో ఉన్నానని నేను నిశ్చయించుకుంటాను?” అని పైలట్ అన్నాడు. సత్యంపైన ఆధారపాడినప్పుడు మనం ఇలాంటి మాటను చెప్పము. మనం ఎంపిక చేసుకున్నేప్పుడు కూడా సత్యం అనేది ఒకటి ఉన్నది. అర్ధం నేది ఒకటున్నది, నిశ్చయత అనేది ఒకటున్నది.

కనుక, తమను దేవునిగా చూపించుకునే ప్రయత్నమే దీనిలో కనబడుతున్నది. మొదట్నుంచి ఆదికాండంలో ఇలాంటి వ్యక్తి మనకు కనబడుతున్నాడు. దేవుడు నిజంగా చెప్పాడా? దేవుడు చెప్పాడా? అసత్యం, అర్ధరాహిత్యం, అనిశ్చితి. ఆదికాండంలోనే ఉన్నాయి. ఆధునికతకు ముందే, కనుక ఇది దేనికీ ముందు లేదు. ఇది పతనమైన మనవుని స్థితి.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఔను, ఆధునికత తర్వాతి స్థితిలో ఎర్ర దీపాలన్నీ పచ్చగా ఉంటాయి. అల జరిగితే, రోడ్లలో గందరగోళం, విపత్తులు ప్రమాదాలు జరుగుతాయి. ఇదే అంశంలోనే నేను మరొక ప్రశ్నను అడగబోతున్నాను. యూరపులో మరొక విద్యార్ధి అడిగిన ప్రశ్న, “ఒక నైతిక నిబంధన ఉన్నట్లయితే, ఆ నిబంధనలను విధించే వ్యక్తికూడా తప్పకుండా ఉండాలా?”

డాక్టర్. రవి జకరయాస్:    ఇది చాలా మంచి ప్రశ్న. దీన్ని గురించి నేను చాల కాలం దీర్ఘంగా ఆలోచించాను. జాన్, నైతిక నిబంధనకు, దాన్ని విధించిన వ్యక్తికీ మధ్య ఎలాంటి సంబంధమున్నది? ఇదంతా పాపం లోకంలోకి రావడంతో మొదలయింది. పాపం ఉన్నాడని చెబితే మంచి ఉన్నదనుకోవాలి. మంచి ఉన్నాడని చెప్పినట్లయితే, నైతిక నిబంధన ఉన్నదనాలి. నైతిక నిబంధన ఉన్నదంటే, దానిని విధించిన వ్యక్తి ఉంటాడు. ఎందుకు అనేదే ప్రశ్న.

దీనికి జవాబు చెబుతున్నాను. ఎందుకంటే, పాపపు సమస్య గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, ఒక వ్యక్తిగాని, వ్యక్తిని గురించి గాని ప్రశ్నిస్తే అప్పుడు పాపాన్ని గురించి అడగబడిన అ ప్రశ్న, ప్రత్యేకంగా ఒక వ్యక్తికి చెందినదిగా మారుతుంది. ఆ వ్యక్తికి ఇక్కడ ఎలాంటి విలువ లేకపోతే, అడిగిన ప్రశ్న దానికదే నశించి పోతుంది. కనుక ప్రశ్న చెల్లుబడి అవ్వాలంటే మనిషికి వ్యక్తిత్వం అవసరం. కనుక ప్రత్యేకమైన విలువ కలిగిన వ్యక్తి, అనగా దేవుడు సృష్టించినప్పుడే ఆ సిద్ధాంతాన్ని మనం అంగీకరించగలం. అందుకే నీతి ఆజ్ఞాలనిచ్చే వ్యక్తి అంటున్నాం. వ్యక్తిత్వంలో విలువ లేకుంటే ఆ ప్రశ్న తనంతట తానే నశిస్తుంది.

ఇక్కడ తప్పక దూకాల్సిందే. ఇది చాలా ముఖ్యమైనది. ఈ అంశంగురించి నాస్తికులతో మాట్లాడినప్పుడు వారు తటపటాయిస్తుంటారు. జవాబు చెప్పలేరు. తర్వాత మాటను మార్చి మారో అంశంలోకి వెళతారు. పాపాన్ని గురించిన ప్రశ్న సరియైనదిగా ఉండాలంటే మన జీవితాలకు కొంత విలువ ఉండాలి. మన దేవుని సృష్టి ఐనప్పుడు మాత్రమే ఆ సహజ విలువ లభిస్తుంది. కాలాన్ని, అవకాశాన్నిబట్టి సృష్టించబడినప్పుడు కాదు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    రవి, మరొక విద్యార్ధి రిచార్డ్ దౌకిన్స్ గురించి అడిగాడు. ఈ ప్రపంచ ప్రఖ్యాత నాస్థికుని గురించి లోకంలో అందరికీ తెలుసు. తన వేదాంత చట్రంలో నింపబడవలసిన నలుగు రంద్రాలున్నాయని దౌకిన్స్ చెప్పాడు. అవి ఏమిటి? లేని జీవితంలోంచి జీవమెలా వచ్చింది? నీతి యెక్క రంద్రం, స్పృహ యొక్క రంద్రం, లైంగికపరమైన పగలు, అ విద్యార్ధికి మీరు జవాబు చెప్పాలి.

డాక్టర్. రవి జకరయాస్:    సరే, ఇవి చాలా పెద్ద పగుళ్ళని ఎప్పుడూ చెబుతుంటాను. మింగలేనంత చెడు మాత్ర. మన వేదాంత చట్రంలో ఇలాంటి పగుళ్లున్నట్లైతే, గేళిచేసి బైటికి పంపిస్తారు.

దౌకిన్స్ గురించిన చక్కని కథ చెబుతున్నాను. గతంలో ఇతడు పరిశుద్ధ పౌలు ఆల్యముకు డీనుగా పనిచేసిన గిలెస్ ఫ్రాజెర్ తో మాట్లాడాడు. దౌకిన్స్ కు క్రైస్తవులను గేలిచేస్తూ మాట్లాడటము  చాలా ఇష్టము. పలువురు క్రైస్తవులకు బైబిలు సువార్తల పేర్లుకూడా తెలియవని హేళనగా అన్నాడు. అతనితో గిలెస్ ఫ్రాజెర్, మీకు “జీవముల ఆరంభ శాస్త్రము” బైబిలు లాంటిది కదా? అని అడిగాడు.  దానికి దౌకిన్స్ “ఔను, నిజమే నా కాడి బైబిలే” అన్నాడు “పుస్తకం పూర్తి పేరు చెప్పండి?”  దౌకిన్స్ ఆలోచిస్తున్నాడు “అది చాలా పెద్ద పేరు” అన్నాడు. గిలెస్, “పరవాలేదు, రిచార్డ్, చెప్పండి, పూర్తిపేరు చెప్పండి” అన్నాడు. అతడు చెప్పిన మాటలని లాగే వల్లిస్తున్నాను. ఇలా చెప్పినందుకు ప్రజలు క్షమించాలి. ఐతే అతడిలా చెప్పాడు “జీవముల ఆరంభ శాస్త్రము,  ఊ…  జీవముల ఆరంభ శాస్త్రము, ఓ, దేవా,  దానిపెరులో మిగిలినది గుర్తుకు రావడము లేదు”. అన్నాడు.

నిజంగా అది చాలా పెద్ద పేరు.  అవిశ్వాసాన్ని పెంచడానికి సహాయపడిన పుస్తకం పేరును గుర్తు తెచ్చుకోడానికి దేవుడినే వేడుకోవడం ఆయన ఔనత్యాన్ని గుర్తుచేస్తున్నదని  ఆ సమయంలో నేను చెప్పిన సంగతి గుర్తు ఉన్నది. మరుసటి రోజు వార్తా పత్రికల్లో పుస్తకం పేరును కూడా చెప్పలేని నాస్తికునికి ఇది దుర్దినమని పెద్దక్షరాల్లో రాశారు.

చూడండి, అతడు గేళి చేస్తుంటాడు. నిజానికి, “దేవుణ్ణి విశ్వసించే వారితో మీరెలా వ్యవహరిస్తారని” అడిగినప్పుడు “వీరిని గేళి చేస్తానని” చెప్పాడు.  ఇస్లామీయ ప్రపంచానికి చెబుతున్నాను. క్రైస్తవ విశ్వాసాన్ని మాత్రమే కాదు, దేవునిపైని మొత్తం విశ్వాసాన్ని వెక్కిరిస్తున్నాడు. దాన్ని తెలుసుకోండి మత వ్యతిరేకి, దేవునికి వ్యతిరేకి. అతడొక పిరికివాడు, అతడు దైర్యంగా వెలుపలికి వచ్చి దీనిలోని అంతరార్ధాన్ని చెప్పలేడు.

పగుళ్ళను చూడండి. ఉదాహరణకు జీవిత ప్రారంభం. ఆ జీవంలోంచి జీవమెలా వస్తుంది? అచేతనత్వంలోనుండి చేతనత్వం ఎలా వస్తుంది? అనైతిక ప్రారంభం, పాపపు ప్రారంభంలోనుండి నైతిక ప్రారంభమేలా వస్తుంది? లైంగిక భావాల సంగతి? ఇలాంటి అనేక సమస్యలున్నాయి. పగుళ్ళు పెద్దవి.  ఆ తప్పులు విశ్వసి పైన మోపబడటం లేదు. ఇప్పుడా తప్పులు అవిశ్వాసుల భుజాలపై మోపబడుతున్నాయి. వాటి పగుళ్లనెలా పూడ్చడం? వీటిని సర్వోన్నత దేవుడొక్కడే పూడ్చగలడు.

అందుకే  ఫేరడే, న్యూటను వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు దేవుని విశ్వాసులుగా ఉన్నారు. దేవుడున్నాడనే సిద్దాంతంలోంచి చూడకపోతే ఈ విశాల గ్రహమండలపు కదలికలను వివరించడం అసాధ్యమని చెప్పారు. నీ యవ్వనకాలంలోనే ప్రభువును విశ్వసించాలని లేకపోతే లోకంలోని సమస్తం అర్ధరాహిత్యమైపోతుందని సోలోమోను రాజు హెచ్చరిస్తున్నాడు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    రవి, యూరపులో ఒక విద్యార్ధి ఆసక్తికరమైన ప్రశ్నను అడిగాడు. ఒక సారి దలైలామా దివంగత పోపుతో మాట్లాడుతున్నప్పుడు, విశ్వాసం కేవలం దేవునిపైన నమ్మకం మాత్రమే కాదని. అది జీవిత విధాన మని పోపు చెప్పాడు. తర్వాత విద్యార్ధి అన్నాడు, “క్రీస్తు పుట్టుక గురించి, పునరుత్థానం గురించీ ప్రకటిస్తూ క్రిస్తవునిగా ఉన్న వ్యక్తి క్రైస్తవేత్తరునివాలే ప్రవర్తిస్తుండగా, క్రీస్తును అంగీకరించని వ్యక్తి మంచి క్రైస్తవునివలె ప్రవర్తించే అవకాశమున్నదని జి. కె. చెస్టర్తోన్ తన పుస్తకంలో వ్రాసాడు కదా?” అని ఆ విద్యార్ధి అన్నాడు. దీనికి మీరేమని చెబుతారు?

డాక్టర్. రవి జకరయాస్:    ఇది నిజంగా చాల మంచి ప్రశ్న. జాన్, దీన్ని కొంచం లోతుగా పరిశీలిస్తే, ఇది కఠినమైన ప్రశ్న అనేది అర్ధమౌతుంది. ఐతే జవాబును దీనితో ప్రారంభించాలి. యేసు క్రీస్తును నిజంగా విశ్వసిస్తే ఆ విశ్వాసాన్ని మధ్యలోనే సగానికి తుంచివేసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. యేసు దీన్ని గురించి పలుమార్లు గుర్తుచేశాడు. “మనుష్యలు మీ సత్క్రియలను చూచి పరమందున్న మా తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి”.

ఐతే సత్క్రియలు చేసినంత మాత్రాన మీరు క్రీస్తు విశ్వాసులు కాలేరు. యేసు, ప్రభువుని నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయనను లేపెనని విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. తర్వాత మన క్రియలు కూడా విశ్వాసంలోనే సాగాలి. సత్క్రియలను చేసి భక్తిగా జీవిస్తున్నట్లయితే, తప్పకుండా పరలోకానికి వెళతామని పూర్తిగా నమ్మేవ్యక్తులు, దీన్ని గురించి యేసు చెప్పిన బోధను సరిగా అర్ధంచేసుకోలేదన్నమాట.

క్రియలు లేని విశ్వాసము వ్యర్ధమని యాకోబు గ్రంధం మొత్తం చెబుతున్నది. యాకోబు యేమని చెబుతున్నాడంటే, విశ్వాసమన్నదని చెబుతూ ఆవిధంగా జీవించకపోతే, ఆ విశ్వాసం మీలో లేదన్నమాట. ఇది కేవలం నామకార్ధమైన విశ్వాసమే. మంచి క్రైస్తవుడు విశ్వాసాన్ని, క్రియలను కలపాలి. భోదనూ, జీవితాన్ని కలుపుకొమ్మని పౌలు, తిమోతికి చెప్పాడు. రెండిటిని మనం కాపాడుకోవాలి దుర్వినియోగాన్ని బట్టి వేదాంతాన్ని గణించకూడదు.

“దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదు” అని వాక్యం చెబుతున్నది. నేను నా భార్యను ప్రేమిస్తున్నానని చెబుతూ చక్కని కార్డులను ఆమెకు బహుమతిగా ఇస్తున్నా, ప్రేమను ప్రదర్శించకపోతే, నిజంగా ప్రేమిస్తున్నానా లేదా అని ఆమెకు తప్పక సందేహం వస్తుంది. నామాటలు, చేతలు రెండూ ఒకే విధంగా కలవాలి. మాటలు వాస్తవాన్ని చూపిస్తుంటాయి. అవి శిరస్సు నుండి హృదయానికి సందేశాన్నందిస్తుంటాయి.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    బౌద్ధ మతాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని కొంచం పోల్చి చూడాలని కోరుతున్నాను. పోపుతోటి దలైలామా తన ఆలోచనలను పంచుకోవడం ఆసక్తికరమైనది. ఇక్కడ రెండు వేర్వేరు అభిప్రాయాలు డీకొన్నాయి, నేనెందుకు బౌద్ధమతాన్ని చర్చలోకి తీసుకోచ్చానంటే, ఇక్కడే కాకుండా యూరపులోనూ దీన్ని మా వెబ్ సైటులో పలువురు అడుగుతుంటారు. అనేకులకు ఇది ఆసక్తికరమైన అంశం. కొందరు హాలీవుడ్ సినిమా తారలు బౌద్ధమతాన్ని పుచ్చుకున్నారు. దీన్ని గురించిన ప్రజాభిప్రాయాలను పోల్చి చూస్తే బాగుంటుంది.

డాక్టర్. రవి జకరయాస్:    మీరు చెప్పినది నిజమే. నేను ప్రయాణాలు చేస్తున్నప్పుడే కాక నాకు వచ్చే జాబులలోనూ పలువురు బౌద్ధమతాన్ని గురించి ప్రశ్నలడుగుతుంటారు. బౌద్ధమతం వివరాలు? బౌద్ధమతం ఎంతో మృదువుగా మనల్ని మోసగిస్తున్నదని ప్రజలు ఏమాత్రం గుర్తించడం లేదు. దేవుడు లేకుండానే మంచివారంగా ఉండగలమని బోధిస్తుంది. బౌద్ధమతంలో దేవుడు లేడు. బౌద్ధమతం దేవుని గురించి ఏమీ బోధించడంలేదు.

తాయిలాండులో నేను గతంలో ఒక సుప్రసిద్ధ సన్యాసితోటి చర్చలు జరిపాను. ఆమె అభిషేకం పొందిన మొదటి సన్యాసిని కెనడా యూనివర్సిటీలో P. hd  ముగించి, తాయిలాండుకు తిరిగివచ్చి, శ్రీలంకలో అభిషేకం పొందింది. ఆమెతో మాట్లాడే సదవకాశం కోసం సంప్రదించాను. మా మధ్య చక్కని సంభాషణ జరిగింది. మీరు మీ విశ్వాసాన్ని ముఖ్యంగా యెవరిపైన నిలుపుకుంటున్నారని” ఆమెను మొదట ప్రశ్నించాను. “దలైలామాపై” అన్నది. “మీరు కోరికలన్నిటినీ పరిత్యజించారు, ఔనా? మీరు దేనిని కోరడంలేదు. ఆమె ఔనన్నది”. దలైలామా టిబెట్కు స్వాతంత్ర్యాన్నివ్వలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? మీరు దికంగా ఆరాధించి గౌరవిస్తున్న వ్యక్తి మీ విశ్వాసానికి వ్యతిరేకంగా ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఏ విదంగా స్పందిస్తారు? ఆమె మౌనంవహించింది. అతడికి అది ఇష్టమన్నది. ఆమెకు కొంచం కోపం వస్తున్నట్లనిపించి. నేను వెనక్కి తగ్గాను.

మిమ్మల్ని యింకొక ప్రశ్న అడుగుతున్నాను, మేడం, చాబుతున్నాను వినండి. ప్రతి జన్మకు ముందు మరొక జన్మ ఉంటుందని బౌద్ధులంటారు. ఆమె ఔనన్నది. “మీరు ఇప్పట్నుంచి ప్రారంభించి వెనక్కి, వెనక్కి వెళితే, మీరు ఈ జన్మనుండి ప్రారంభించి వెనక్కెళితే, మీకు అనంతమైన జన్మలున్నాయనుకోవాలి. నిజమేనా?” ఆమె నిజమే నన్నది. ప్రతి జన్మ ఒక మర్మ జన్మ అని చాబుతున్నారు. ప్రతి జన్మలున్నాయని చెబుతున్నారు. అంటే మొదట జన్మ తప్పక ఉంటుంది. నిజమే కదా? ఆమె అలోచించి, “ఔను, నిజమే చెప్పింది”. మొదటి జన్మలో ఏ పాపానికి పరిహారం చెల్లించారు? ఆమెనీ ప్రశ్న ఎంతో కలవరపరిచింది. “మేమీలాంటి ప్రశ్నలకు జవాబులు యియ్యము” అన్నది.

బుద్ధునివలెనే ఆమెకూడా కుటుంభాన్ని పరిత్యజించింది. తన పిల్లలను తన భర్తను వదలి సన్యాసాన్ని స్వీకరించింది. బిడ్డల్ని చూడాలని ఆశలేదా అని అడిగితే ఆమె కనులలోంచి కన్నీరు కారింది. ప్రతీరోజూ పిల్లల్ని స్కూలుకు తీసుకువెళ్ళి, మళ్ళీ ఇంటికి తెచ్చి వదులుతున్నాని చెప్పింది. బౌద్ధ సన్యాసినిగా కారు తోలుతున్నది. బౌద్ధసన్యాసిని గనుక పురుషుడు ప్రక్కనే  కూర్చుని కారు తోలకూడదు. కనుక తనే కారు తోలుతూ పిల్లలను తెస్తున్నది. ఇక్కడ నిబంధనలు తప్పుతున్నట్లు గ్రహించింది.

క్రీస్తు నంగీకరించిన నా హిందూ స్నేహితుడొక సంగతి చెప్పాడు. “చూడు రవీ, ఒక రోజు ఉదయాన్నే మన సంభాషణ గురించి ఆలోచించాను. నేను బెంకుకు ఎంత అప్పు ఉన్నానో, వటిని ఎన్ని రోజుల్లో తీర్చాలో నాకే తెలియదు. ఇదంతా గందర గోళమన్నాడు”. తర్వాత క్రీస్తుకు సమర్పించుకున్నాడు.

ఈ న్యాయసూత్రాల ప్రకారం. జీవించే వారలారా! భక్తిగా జీవించాలనుకుంటున్నందుకు మెచ్చుకుంటున్నాను. మీ గురించి ఇది తెలుపుతున్నది. మీరేవర్నీ నొప్పించరు. ఎవర్నీ బాధించరు. ఒక సంగతి గుర్తుచేస్తున్నాను. మంచితనం మీ లోపల నుండి రాదు. లోకంలోని పెద్ద సమష్య మీకు వెలుపల లేదు, మీ లోపలనే ఉన్నది. మారిపోయిన మానవ హృదయం, యేసు ప్రభువు యొక్క కృప ఆయన సన్నిధి, సరియైన ఆశాభావాన్ని కలిగించి మనుష్యులోక్కసారే మరనిస్తారాని, తర్వాత సృష్టికర్తను కలుసుకుంటామని తెలుపుతుంది.

మతాచారాలను నిష్టగా పాటించే దేశాలను పరిశీలించినత్లైతే, నేడు అ ఆచారాలన్నీ నశించిపోయాయని గుర్తిస్తారు. ఎందుకంటే నీతి సూత్రాలలో జీవితానికి కావలసినవన్నీ లేవు. అవి మనమెలా జీవించాలని మాత్రం చెబుతాయి. మంచి పనులు చేసేందుకు కావాల్సిన బలాన్ని దేవుడు మత్రమే ఇస్తాడు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఇప్పుడు దేశాన్ని మారిస్తున్నాను. యునైటెడు నషనులలో అల్పాహార ప్రాధనా సమావేశముల ప్రారంభ సభలో నాయకుల ముందు మాట్లాడమని మీకు ఆహ్వానం వచ్చినప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు. వారితో ఏంమాట్లాడారో చెప్పండి. ఆసమావేశం చివరలో మీరు చెప్పిన ఉపమాన కథను మీరిప్పుడు మా ప్రేక్షకులతో పంచుకోవాలి.

డాక్టర్. రవి జకరయాస్:    దేవుని కృప వలన వారు నన్ను మూడోసారి ఆహ్వానించగా వారి ముందు మాట్లాడ దానికి ఆ దేశానికి వెళ్లాను. అది నాకు నిజంగా ఘనత. పండితుల తోటి మాట్లాడాలి. దాదాపు పదిహేను నిమిషాలిచ్చారు వారినేమాత్రం నొప్పించకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

పరిపూర్ణత నెలా పొందాలో వివరించాను. వారు మొత్తం ప్రసంగం ఎంతో శ్రద్ధగా, జాగ్రత్తగా విన్నారు. ప్రసంగం ముగిసిన తర్వాత రాయబారులు నావద్దకు వచ్చి తమ వ్యక్తిగత విషయాలను కూడా చెప్పారు. వారిలో ఒకరు- అతడి పేరును ఇక్కడ చెప్పను – తన ఆఫీసుకు వచ్చి ఉద్యోగులతో ప్రార్ధించమని కోరాడు. నాస్తికుడొకాయన “నేనిక్కడికెందుకు వచ్చానో నాకే సరిగా తెలియదన్నాడు” ఆ కూడిక ఎలా ముగిసిందో మీకు చెబుతున్నాను.

నేనొక ఉపమాన కథ చెప్పాను. ధనికుడొకనికి ఒక కుమారుడున్నాడు. కుమారునికి జాలి గుండె. ప్రతిరోజు వీధుల్లోని ఒక భిక్షగానితో ప్రేమగా మాట్లాడేవాడు. భిక్షగాడు ఇతన్ని ప్రేమించాడు. భిక్షగానికి కొంచం డబ్బులిస్తుండేవాడు. ఒక రోజు కుమారుడు రాలేదు. భిక్షగాడు, భవనం వద్దకెళ్ళి కాపలావానితో, “రోజూనా వద్దకు వచ్చే యువకుడు రావడము లేదేమని” అడిగాడు. అతడు హటాత్తుగా చనిపోయాడన్నారు . భిక్షగాడు, “అతడు తన తండ్రికున్న కళా వస్తువుల సముదాయము గురించి మాట్లడుతుండే వాడు, తడి తండ్రికి కళలంటే ప్రేమ. నేనూ ఒక బొమ్మ గీస్తానన్నాడు”. భిక్షగాడు వెనక్కెళ్ళి కుమారుని బొమ్మ గీసి దానిని తీసుకు వచ్చి కాపలా వానికి ఇచ్చి, “దీనిని తండ్రికి ఇవ్వు కుమారుణ్ణి నేనెంతో ప్రేమించానన్నాడు”.

కొన్నాళ్ళ తర్వాత, ఆ తండ్రి మరణించగా, మొత్తం కళా వస్తు సముదాయము నంతటినీ వేలం వేయబోతున్నారని తెలిసింది. వేలానికి వెళ్ళాలను కున్నాడు. కొంచం మంచి దుస్తులు ధరించి ఎలగోలా లోనికి వెళ్ళాడు. తాను గీసిన చిత్రం అ కళా ఖండాల్లో ఉన్నదో లేదో చూడాలని ఆశించాడు. ఆశించినట్లుగానే అతని చిత్రం వాటి మధ్యలో ఉన్నది. దాన్ని చూసి అతడి మనస్సు చెలించిపోయింది. తండ్రి కూడా కుమారుణ్ణి ప్రేమించాడని తెలుసు. వేలంపాట మొదలయింది. వేలం అధికారి కుమారుని బొమ్మ వద్దకెళ్ళి దీన్ని మొదట అమ్మాలని వీలునామాలో రాశారన్నాడు. ఎవ్వరూ దాన్ని కొనుక్కోవడం లేదు. వేలం పాటలేదు. భిక్షగాడు నాకున్నదాంతో దాన్ని కొంటానన్నాడు. దాన్ని కొనుకున్నాడు.

వేలం అధికారి “మిగతా చిత్రాలను చూద్దామన్నాడు”. వేలం సుత్తిని బల్లపై కొట్టగా, అందరూ మంచి చిత్రాలను ఇప్పుడైనా వేలం వెయ్యమని అడుగుతున్నారు. వేలం అధికారి అన్నాడు. “ఊ హు, కుమారుని చిత్రాన్ని కొన్నవ్యక్తికే మొత్తం కళా వస్తువుల సముదాయమంతా చెందుతుందని చనిపోయే ముందు తండ్రి తన వీలునామాలో రాశాడు”.

తూర్పు దేశాల ప్రజలకు కథలంటే చాలా ఇష్టము. U. N. రాయబారులు స్పందించడం నేను చూడగలిగాను. “ladies and gentle men, మీకు కుమారుడు దొరికితే యేసు క్రీస్తులో సత్యం దొరికుతుంది” అని చెప్పి సువార్తను బోధించాను.

అందరూ వరుసలో వచ్చారు. ముందే చెప్పినట్లుగా, నాస్తిక దేశంనుండి వచ్చిన ఒక రాయబారి, “జకర్యా గారు, నాకీ సభ నచ్చలేదు. ఎందుకొచ్చానో నాకే తెలియదు. ఎప్పుడూ అ సందేహముండేది. ఈరోజు జవాబు దొరికింది. దేవుణ్ణి కనుగొనేందుకు ఇక్కడికొచ్చాను”. కథ ఎంత అద్భుతంగా ముగిసిందో చూడండి. మీకు చెబుతున్నాను. మీరు క్రీస్తు నంగీకరిస్తే కుమారుడు లభిస్తాడు, పరలోకపు తండ్రి యొక్క ఆస్తి మొత్తం మీకు లభిస్తుంది. ఆయన్ను నమ్మండి.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    యేసు క్రీస్తు గురించి ఇప్పుడు కొత్తగా వింటూ ఆయన రక్షణ గురించి తెలుసుకుంటున్న వారికి చెబుతున్నాను. కొందరు వీటిని పలుమార్లు విని యుండవచ్చు. లేదా క్రీస్తును గురించి కొందరు మొదటి సారి వింటున్నారేమో. యేసు క్రీస్తు ప్రజలకు బోధించిన సువార్త వివరాలేమిటి? ప్రజలు యేసు క్రీస్తుతో సంభందంలోకి వచ్చి అ శక్తిని సొంత జీవితాల్లో ఎలా అనుభవించగలరు?

డాక్టర్. రవి జకరయాస్:    ఇక్కడే పరిస్థితి మారుతుంది. మనుష్యులపై నుండి దృష్టిని తిప్పండి. వేశాదారుల నుండి మీ దృష్టిని వేరుగా మరల్చుకొండి. అబద్ద బోధలతో మీ మనస్సులో అనుమానాన్ని సృష్టించారు. నా వద్దకు వచ్చువానిని నేను త్రోసివేయనని యేసు చెప్పెను. సిలువ వేయబడిన క్రీస్తును గురించి బోధించానని పౌలు చెప్పాడు. నేను చెబుతున్నాను. మీరెక్కడున్నాసరే, తలలు వంచి క్రీస్తు నాహ్వానించండి. మీ బిడ్డ “నాన్నా నీ ఒళ్లో కూర్చోనా? కౌగలించుకోనా? అని అడిగితే, మీరు వెంటనే అతణ్ణి కౌగలించుకుంటారు. క్రీస్తుకు మరింత ప్రేమ ఉంటుందికదా?” నీవు నా రక్షకుడవు అని ఆయనతో చెప్పండి. అలా ప్రార్ధించండి.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఈ విధంగా ప్రార్ధించి క్రీస్తును అంగీకరించే ప్రజల కొరకు మీరు చిన్న ప్రార్ధన చెయ్యాలని కోరుతున్నాను. వారు ఆ ప్రార్ధనను జీవితమంతా వాడుకోవాలి.

డాక్టర్. రవి జకరయాస్:    తప్పకుండా ప్రార్ధిస్తాను. దీనిని చూస్తున్న ప్రజలు, మీరెక్కడ ఉన్నా, ఇటూ అటూ చూడకండి. తలలు వంచి, అందరూ నేను చేస్తున్న ప్రార్ధనను నాతోపటు చెప్పండి. తేలిక ప్రార్ధన, ఐతే గంభీరమైన ప్రార్ధన యేసు ప్రభువా! లోక రక్షణకు నిన్ను నీవే అర్పించుకున్నావు. నా కొరకు నిన్ను అర్పించుకున్నావు. నిన్నంగీకరించాను. నమ్మాను నీకు సమర్పించుకున్నాను. నిన్ను అనుసరిస్తాను. మీ వాక్యాన్ని ధ్యానించడానికి సహాయం చెయ్యండి. యేసు ప్రభువా! నిన్ను రక్షకునిగా అంగీకరించి, నీతో సంభందానికి అడ్డుపడే ఇతర విశ్వాసాల నన్నిటినీ తొలగిస్తాను. యేసు నామమున ప్రార్ధిస్తున్నాను. ఆమెన్!.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ప్రజలారా! మీరీ విధంగా ప్రార్ధించారని నమ్ముతున్నాను. యేసు క్రీస్తు మీ జీవితంలోకి ఎలా ఆహ్వానించాలనే అంశం గురించి మీరు. ఇంకా ఆలోచిస్తున్నట్లైతే దీన్ని గురించిన పూర్తి వివరాలను మా వెబ్ సైటులో చూడండి. దానిలో ఉన్న విధంగా ప్రార్ధించండి. దీనిని జాగ్రత్తగా ఆలోచించండి. మీ జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలలో ఇది ఒకటి. వచ్చేవారం కూడా డా. రవి జకర్యా గారు మాట్లాడుతారు. ఇక్కడ అమెరికాలో విద్యార్ధులు అడిగిన కొన్ని కఠిన ప్రశ్నలను గురించి వచ్చే వారం చర్చించబోతున్నాము. మన దేశంలో ఈయన హార్వార్డు, ప్రిన్స్ట న్, డార్ట్ మౌత్, ఇంకా అనేక యూనివర్సిటీలలో మాట్లాడారు. విద్యార్ధులు అడిగిన కొన్ని కఠినమైన ప్రశ్నలు ఏమిటి? వచ్చే వారం తప్పక చూడండి.

 

 

 

 

 

 

మరిన్ని టీవీ ప్రోగ్రామల్ని చుచెందుకు ఉచిత

FREE John Ankerberg Show App download చెసుకొండి

“Pray to Accept Jesus Christ as Your Savior” @  JAshow.org

కాపీరైట్ 2015 ATRI.

 

జీసస్ సినిమా

క్రైస్తవుడగుట ఎట్లు?

నీవెలా క్రైస్తవు డవగలవు? యేసును వెంబడించి ఆయన యందు విశ్వాసముంచువాడే క్రైస్తవుడు. దీనిని బైబిలు బహు సరళముగా తెలియజేయుచున్నది, కనుక నీవు క్రైస్తవుడవని తెలుసుకో గలవు. , ఇక్కడ నొక్కండి .

ఆడియో బైబిలు