డా. రవి జకర్యా గారు నాస్తికులకు జవాబు లిస్తున్నాడు సిరిస్ 2 . ప్రోగ్రాం 3

డా. రవి జకర్యా గారు నాస్తికులకు జవాబు లిస్తున్నాడు

 

సిరిస్ 2 . ప్రోగ్రాం 3

ఈ రోజు  జాన్ యాంకర్ బర్గ్ షో లో  డాక్టర్.  రవి జకరయాస్ నాస్తికులకు జవాబు చెపుతాడు.

ఇండియాలో పుట్టి పెరిగిన ఇతడి పూర్వికులు , ఉన్నత హైందవ కులంలో పూజారులుగా ఉండేవారు. ఐతే ఒక  రోజున ఇతడు యేసు వాక్యాన్ని విని క్రైస్తవునిగా మారిపోయాడు. ఆ తరువాత ప్రపంచములోని జ్ఞానవంతులలో ఒకరిగా ఎదిగి 70 కి మించిన దేశాలలో పర్యటించి, ఆనేక ఉన్నత స్తాయి యూనివర్సిటిలలో   Harvard యూనివర్సిటిలో ,Princeton,  Dartmouth, Johns Hopkins,  Oxford వంటి యూనివర్సిటిలలో ప్రసంగించారు. శాంతి ఒప్పందాన్ని వ్రాసిన రచయితల ఎదుట దక్షిణ ఆప్రికాలో ప్రసంగించారు. Lenin సైనిక అకాడమి లోను, మాస్కోలోని  Geopolitical Strategy కేంద్రం లోని సైనికాధికారూల ఎదుటను మాట్లాడారు.

 

New York  United Nations సంవత్సరిక ప్రార్దన  ఉదయాహారపు కూడికలలో ఇతడు మూడుసార్లు భోదించాడు.   Ottawa, Canada, London, England, లలో జరిగే జాతీయ, అల్పాహార ప్రార్దన కూడికలలో  కూడా ఇతడు పలుమార్లు ప్రసంగించాడు.  Washington, DC.లోని CIA లో కూడా మాట్లడాడు. ఈ జాన్ యాంకర్ బర్గ్ ప్రోగ్రాంలో మాతో కలుసుకోండి

 

___________

 

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మా కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. నా పేరు జాన్ ఆంకేర్ బర్గ్. మా కార్యక్రమాన్ని చూస్తున్నందుకు వందనములు. నేటి మన అతిధిగా ప్రఖ్యాత వేదాంతి, తత్వవేత్త, క్రైస్తవ సమర్ధన వాది డా. రవి జకర్యా గారు మన మధ్యకు వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా, అనేక యూనివర్సిటీలలో విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు ఈయన జవాబులను నేడు చర్చించబోతున్నాము. గతంలో  తూర్పు, మధ్య ఆసియా, గత వారంలో యూరపు దేశాలవారి ప్రశ్నలను చర్చించాం. ఈ రోజు హార్వార్డు, డార్తుమౌతు, ప్రిన్సిటను వంటి యూనివర్సిటీలలో విద్యార్ధులు దేవుని గురించి అడిగిన ప్రశ్నలకు, రవి జకర్యా ఇక్కడ జవాబులను చప్పబోతున్నారు. రవి, మీరు రావడం మాకెంతో సంతోషం.

మొదటగా, అమెరికాలో ఒక విద్యార్ధి అడిగిన ప్రశ్న. అధిక శక్తిమంతుడు ప్రేమా మయుడైన దేవుడు, లోకంలో అనేక ఘోరాలు, వ్యాధులు, సమస్యలు వస్తాయని తెలిసి కూడా, మరల ఈ లోకాన్ని ఎందుకు సృష్టించాడు? అని అడిగాడు.

డాక్టర్. రవి జకరయాస్:    జాన్, ఇది నిజంగా కఠినమైన ప్రశ్న దీనిని పలువురు విద్యార్ధులు అడుగుతుంటారు. “సమస్యల్లో సద్గుణశీలత, విజయంలో దుర్మార్గం లోకంలోకి నాస్తికులు వచ్చారని” మునుపు ఒక రన్నారు.లేదా  ఆల్ఫ్రెడ్, లార్డ్ టెన్నిసను ఒకప్పుడు ఏమన్నాడంటే, “ఉదయం నుండి సాయంత్రంలోపున ఎవరో ఒకరి గుండె పగిలిపోతుందన్నాడు”. ఇది నిజంగానే బాధాకరమైన ప్రశ్న ఇది బాధతో వ్యవహరిస్తున్నది. బాధ వాస్తవమైనది. అదొక ఊహకాదు.

మనం అనేక విధాలుగా ఒక ప్రశ్నకు జవాబు చెప్పొచ్చు. ఐతే ప్రశ్నలోని అంతరార్ధాన్ని మొదట పరిశీలించాలని సి. ఎస్. లెవిస్ ప్రజలను గట్టిగా హెచ్చరించాడు. నేను చాలాఏళ్ళక్రితం నాటింగ్హాం యూనివర్సిటీలో ప్రసంగిస్తున్నప్పుడు శ్రోతలలోంచి ఒక విద్యార్ధిలేచి నిలువబడి ఈ లోకంలో ఎక్కడ చూసినా అవినీతి వేదనలే ఉన్నాయి. ఈ లోకంలో దేవుడున్నాడంటే నమ్మలేను. లోకంలో ఎటు చూసినా దుర్మర్గాలే అని అరిచిన సందర్భంనాకు గుర్తుంది. దీన్లో విచిత్రమేమంటే, తూర్పు దేశాలలోంచి వచ్చిన నేను ఇప్పుడు పడమట ఉంటున్నాను. తూర్పు దేశాలలో నన్ను ఎవరూ ఇలాంటి ప్రశ్నను మునుపు అడగలేదు. ఇప్పుడు సమస్తాభిప్రాయాలు కలిసిపోమన్నందున నన్నిల్ అడిగారు. ఐతే దీన్ని ఎవరూ చర్చించరు. ఈ అంశాన్ని గురించి చర్చించే పుస్తకం మహమ్మదీయ మతంలోనే లేదు. అది ఇన్శా అల్లా – అంతా అల్లా చిత్తమంటారు. అద్వైత మతంలో కర్మ సిద్ధాంతాన్ని హరిస్తూ, పూర్వ జన్మ పాప ఫలితమన్నారు. పశ్చిమ దేశాల్లో సుఖభోగాల్లో నివసిస్తున్న మనం మాత్రం ఈ లోకంలో దుర్మార్గాలు, బాధలు, సమస్యలు ఎందుకు రావాలని ప్రశ్నలు వేస్తున్నాం.

ఆ ఆంగ్లేయుడు అడిగినప్పుడు, మీరీ ప్రశ్నను ఎందుకు అడుగుతున్నారో దానిలోని అంతరార్ధమేమిటో మొదట చబుతానని అన్నాను. “దుర్మార్గంగా ఉన్నదన్నాడంటే మంచి కూడా ఉన్నదని తలుస్తున్నారు కదా?. అతను ఔనని చెప్పాడు. లోకంలో మంచి ఉన్నదని మీరు చెబుతున్నారంటే మంచినీ చెడునూ వేరు చేసి చూపించ డానికి, లోకంలో నైతిక నిబంధనలనేవి తప్పక ఉండాలికదా అని అడిగాను. అతడు వెంటనే జవాబు చెప్పలేక చాలసేపు అలోచించి, “నిజమే, మంచినీ, చెడునూ వేరు చేసి చూపించడానికి నీతి సంబంధమైన కొలమానం లోకంలో తప్పక ఉండాలన్నాడు”. నీతి సంబంధిత చట్టాలున్నాయంటే, ఆ చట్టాన్ని తెచ్చే వ్యక్తి ఉండలి. ఆయన లేడని నిరూపించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. నీతి చట్టానిచ్చే వ్యక్తి లేకపోతే, నీతి చట్టం లేదు. నీతి చట్టం లేకపోతే, మంచి ఉండదు. మంచిలేకపోతే, చెడు ఉండదు. మీకు ప్రశ్నయే ఉండదు”.

అతడు నా వైపు సూటిగా చూసి “మరి నేనడుగుతున్న ప్రశ్న ఏమిటి?” అన్నాడు. ఇది చాలా పాత కద. “నువ్వే మడుగుతున్నవో తెలుసు. నేను నిన్ను తికమక పెట్టడం లేదు. స్వయనిర్ణయాధికారానికి సంబంధించిన ఈ ప్రశ్న, దీనిలో ఉన్న హేతువాదపు అంశాలను పరిశీలించడం లేదు. ప్రశ్న వాస్తవంగా ఉండాలంటే దేవుడు ఈ నమూనాలో ఉండాలి. కనుక దేవుడు ప్రతిపాదించిన దానిలో నుండే దీని జవాబు రావాలి. దేవుడు చేసేవన్నీ సత్యానికి సంబంధించినవే”.

ఆక్ష్ఫొర్డ్ లో నా సహొద్యోగి విన్సు విటాలితో కలిసి నేను ఇటీవల రచించిన పుస్తకంపేరు “బాధలు ఎందుకు?” మొదటి అధ్యాయానికి మూడు సందేహాలని పేరు పెట్టారు. దేవుడు సర్వ శక్తిమంతుడు, ప్రేమామయుడు. ఐనా లోకంలో పాపం. ఇవే మూడు సందేహాలు. ఈ మూడు సత్యాలు పరస్పర వ్యతిరేకాలని ఆస్ట్రేలియా వేదాంతి జె. ఎల్. మేకీ వ్రాసాడు. దేవుడు శక్తి మంతుడు, ప్రేమామయుడు ఐతే చెడు ఉన్నది. ఇది పరస్పర వ్యతిరేకం. ఇవి నాలుగు భాగాలుగా, ఇదు భాగాలుగా ఉండకుండా ఎందుకున్నాయి? మరొక అంశం చేర్చండి. దేవుని కన్నీ తెలుసు. దీనిని మనం నమ్ముతున్నాం. ఇక ఐదవది, దేవుడు నిత్యుడు. దేవుడు మనకు తక్షణమే తీర్పు తీర్చడు. నిత్యత్వం ఉన్నది. కనుక దీనిలో మనం మూడు సందేహాలను మాత్రమే చర్చించడం లేదు. దేవునికి అన్నీ తెలుసు నిత్యత్వంకూడా ఇక్కడ వాస్తవమే. ఈ వివరనలన్నీ నిత్యత్వంలో చేర్చబడతాయేమో.

మరొక రెండు జవాబులను పరిశీలిద్దాం. నేనున్నజార్జియా ప్రాంతములో ఒక యువతి ఉన్నది. నేను అట్లాంటాలో ఉన్నాను ఆ యువతి పేరు ఆశ్లిన్. ఆమె తల్లి ఒక రోజు T. V. కార్యక్రమంలో తన శరీరాన్ని Cipa అనే విచిత్ర వ్యాధి ఎంతో బాధిస్తున్నదని చెప్పింది. ఈ వ్యాధిగ్రస్తులకు దెబ్బతగిలిన నొప్పి తెలియదు. దానితో పాటు స్వేద గ్రంధులు కూడా పనిచేయడం లేదు. ఈ సమస్యబాగునట్లనిపించవచ్చు. నొప్పి తెలియదు కదా! ఐతే నిజానికి, ఆట మైదానంలో పొరపాటున మేకుపై కాలు పెడితే, మేకు లోతుగా దిగ పడితే, చీము పట్టి వాచిపోయినా ఆమెకు చీల గుచ్చుకున్న సంగతే తెలియదు. ఈ వ్యాధి వలన జీవితంలో ఏర్పడిన సమస్యలను గురించి అ తల్లి టెలివిజను కార్యక్రమంలో  చెప్పింది. నా కుమార్తెకు నొప్పి తెలిసేలా చెయ్యమని ప్రతిరాత్రీ ప్రార్ధించే దానినని చెప్పింది. బర్నర్ మీద పెట్టిన చెయ్యి కాలిపోతున్నా ఆమెకు అ నొప్పి తెలియదు.

ఇప్పుడొక ప్రశ్న ఉన్నది. మర్త్యమానవులమైన మనమే నొప్పినిబట్టి ఏదో తప్పు జరుగుతున్నదని గ్రహిస్తుంటే, దాన్ని గ్రహించడానికి నొప్పిని మన జీవితాలలో అనుమతించడం అనంత జ్ఞానియైన దేవునికి అసాధ్యమా? మానవ చట్రంలో నొప్పి అనేది నీతికి సంభందించిన అర్ధాన్నిస్తుంది. ఎందుకంటే మనం నీతిని పాటించే వ్యక్తులం. కనుక, దీనికి జవాబు నీతికి సంబంధించిన ఆత్మీయ చట్రంలో నుండే రావాలి. ప్రశ్న నైతిక హేతువులకు దారి తీస్తుంది. దేవుడు ఈ నమూనా లోపల ఉన్నప్పుడే ఇది జరుగుతుంది వెలుపల ఉన్నప్పుడు కాదు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఊ. మన ఉనికిని ఊహించేందుకు మూడు, నాలుగు ఎంపికలే ఉన్నాయని మీరు ముందే చెప్పారు. మన ప్రేక్షకులు వినేలా ఆ నాలుగు అంశాలను వివరించండి.

డాక్టర్. రవి జకరయాస్:    సరే. మనం ఈ విధంగా చెప్పవచ్చు. మొదటిది, దేవుడు దేన్నీ సృష్టించకుండా ఉండవచ్చు. అంటే ఈ నాలుగు రకాలైన లోకాలను – సృష్టించకుండా ఉండి ఉండవచ్చు. దేన్నీ సృష్టించకుండా ఉండవచ్చు. అప్పుడు ఆయన్ను నిందించేందుకు మనం ఉండం. లోకంలో ఆయనొక్కడే ఉండేవాడు. రెండవది. దేవుడు తలచుకుంటే మంచిగాని చెడుగాని  ఒక  సృష్టించగలడు. మంచీ చేడులు లేని లోకం. ఇక మూడవది. మనం కేవలం మంచిని మాత్రమే ఎంచుకుని మంచి పనుల్ని మాత్రమే చేసేలా, లోకాన్ని ఆయన సృష్టించి ఉండవచ్చు. లేదా నాలుగవది. దేవుడు మంచితోపాటు చేడుకూడా ఉండేలా ఈ లోకాన్ని సృష్టించి, మన మేలు కోసం మనం మంచినే ఎంపిక చేసుకునేలా ఉండవచ్చు.

ఐతే జాన్, నాలుగో ప్రపంచంలో మాత్రమే ప్రేమ ఉంటుంది. మిగతా మూడు నమూనాలలో ప్రేమ ఉండేందుకు అవకాశంలేదు. మనలాంటి హద్దులుగల మానవులకు ఒక క్రమంలేదు. పరిమితిగల జీవులేలా ప్రేమిస్తారు? మంచి చెడులు లేని ప్రపంచంలో, మంచిగాని, చెడుగాని లేకపోతే, ప్రేమకు అలంటి పరిస్థితిలో ప్రాధాన్యత ఇవ్వబడదు. ప్రేమను మత్రమే మనం ఎంచుకో వలసి ఉంటే, మనకు నిర్ణయాధికారం ఉండదుకనుక యంత్రాలుగా మారిపోతాం. లేదా లోకంలో మంచీ చెడులు రెండూ ఉన్నట్లయితే ప్రేమను ఎంపిక చేసుకోగలం. ప్రేమ నేది ఉత్తమ నీతి గనుక, విధింపబడిన దానికంటే హెచ్చుగా ప్రేమిస్తే, మన ప్రాణాలకు తెగించి అయినా, అపరిచితుడని కాపాడడానికి ప్రయత్నిస్తాం. విధింప బడినాదానికంటే ఎక్కువగా ప్రేమించడం, అన్నిటి కంటే ఉత్తమమైన ప్రేమ. ఇలాంటి సత్యాలన్నీ ఈ లోకంలోనే సాధ్యమౌతున్నాయి.

తర్వాత నేనిక్కడ మరొక సంగతి చెప్పాలి జాన్! ఇతరుల అభిప్రాయాలను చదివితే, … “ఎందుకు భాదలు?” అనేనా పుస్తకంలో – ఇతర రచయితలు చెప్పిన అభిప్రాయాల్ని గురించి రాశాను. యూదా క్రైస్తవ అభిప్రాయమే దీనికి సరిపోతుంది- పాపం వలన వేదన, దేవుడిచ్చే ఆదరణ వలన తగ్గిపోతుంది. అన్నీ జాన్సన్ ఫ్లింట్ వ్రాసిన తన జీవిత చరిత్రను నేను చదివాను. కీళ్ళ నొప్పులు, కాన్సరు, అంధత్వం, మలమూత్రాలను అదుపు చేసుకోలేక జీవితమంతా కష్టపడింది. కరువుల శరీరాన్ని మంచంపైన చుట్టూ దిండ్లు పెట్టి కూర్చోపెట్టాలి. అనేక కీర్తనల్ని వ్రాసింది. వాటిల్లో ఒకటి.

భారం అధికమైతే అయన మరింత కృపనిస్తాడు.

శ్రమలు ఎక్కువైపోతే ఆయన మరింత శక్తినిస్తాడు.

తీవ్ర అనారోగ్యానికి కృపను జోడిస్తాడు.

రెట్టింపు కష్టాలకు రెట్టింపు సమాధానం.

మనమిక భరించలేమనుకుంటున్న సమయంలో

మన బలం తగ్గిపోయి, సగం దినం గడిచిపోయినప్పుడు,

దాచుకున్న వనరులన్నీ తరిగిపోయినప్పుడు;

తండ్రి దీవెనలప్పుడు మొదలౌతాయి.

అ ప్రేమకు పరిమితి, కృపకు కొలమానం లేదు.

ఆయన శక్తికి ఎల్లలు మనుష్యులకు తెలియవు

యేసులో అనంతమైన ఐశ్వర్యాలను

ఆయన నిరంతరం ఇస్తూనే ఉంటాడు.

దేవుడు బాధల్లో మనలను ఆడుకుంటాడు. నా వీపుకు దెబ్బ తగలగా, భరించలేని నొప్పితో నేను జీవించవలసి వచ్చింది. కొన్ని సార్లు కారులొ స్టీరింగు వీలుపై తలపెట్టి, నొప్పి భరించలేక ఏడుస్తూ ప్రభువుకు ప్రార్ధన చేసిన సమయాలున్నాయి. అప్పుడిక ఏంచెయ్యాలో నాకెంతమాత్రం తోచేదికాదు. ఓకే సంగతి చెబుతున్నాను. దేవుని కృప నాకు చాలును అని అప్పుడు గ్రహించి యన పైన ఆధారపడ్డాను. ఈ నొప్పి జీవించేందుకు దేవుడిచ్చిన ఆహ్వానం.

మరొక సంగతి. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమల యందు నిలువుడి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈ మూడింటిని జీవితంలో నిలుపుకోవాలి. శ్రమలు లేకుండా ఈ మూడు ఉండవు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    రవి చాలాబాగా చెప్పారు. ఇక్కడ మీరు, మీలానే బాధలుపడుతున్న ప్రజలతో కొంచం మాట్లాడాలని కోరుతున్నాను. కొందరి జీవితం చక్రాల కుర్చీకే పరిమితమైపోయింది. కొందరు మంచము దిగలేరు. వారికెలా ప్రోత్సాహానిస్తారు?

డాక్టర్. రవి జకరయాస్:    బాధ అనేది వాస్తవం. జాన్! పలువురు ప్రఖ్యాత తత్వవేత్తలు పుట్టిన దేశంలోంచి నేను వచ్చాను. ఇండియాలోంచి పలువురు వేదాంత పండితులొచ్చారు. ఇలాంటి ప్రశ్నలడిగే స్వాతంత్ర్యమున్న దేశంలో నేను పెరిగినందుకు సంతోషిస్తున్నాను. ఐతే ఇక్కడ ప్రజలకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలున్నాయి. మా అమ్మ తన అక్క వంట చేస్తున్నప్పుడు, ఆ మంటలకు ఆమె చీర కాలిపోయి చనిపోవడం మా అమ్మ తన బాల్యంలో తన కాళ్ళ ఎదుట చూసింది. మంటల బాధితుల ఆశ్రమానికి వెళ్ళాను. వింటున్న ప్రజలారా! మీకు కష్టాలుండొచ్చు, బాధలు ఉండొచ్చు, శారీరక మానసిక బాధలు. ఇంటిలొ కలతలుండవచ్చు వేదింపులకు గురి అయ్యుండవచ్చు. మీరాశిస్తున్నంత ఉన్నత స్థాయి దొరక్కపోవచ్చు. మనసు లోపల మండిపడుచున్నారేమో.

మీకు, శక్తి సామర్ధ్యాల నివ్వమని ప్రార్ధించండి. యేసు క్రీస్తు జీవించాడు. బాదలనే సమస్యవలన కాదు. ఆయన బాధలనే జయించాడు. శ్రమల గుండా విజయం పొందాడు. యేసు క్రీస్తు సిలువ కథ ఇదే. నీ శ్రమల లోంచి దేవుడు నీ హృదయాన్ని జయించడం కనుగొన గలవు. రక్షకుడు మాత్రమే కాదు. ఆయన నీ ఆదరణ కర్త, స్వస్థపరిచే దేవుడు. యేసు క్రీస్తును గురించిన సత్యం ఇదే. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత.

ప్రజలారా! ఇవి నిజంగా ఎంతో విలువైన మాటలు వీటి ప్రకారం మీరు జీవించాలి. త్రిత్వమనేది ఒక వ్యతిరేక సిద్ధాంతమా? అనే అంశాన్ని చెప్పండి.

ఇక్కడ అమెరికాలో ఈయనను విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు మనం చర్చిస్తున్నాము. ఈయన ఈ ప్రశ్నకు జవాబునిస్తే వినాలని మీరు ఎదురు చూస్తుండవచ్చు. రవి, ప్రాశ్నను చెబుతున్నాను. వ్యతిరేక వాధాన్ని దిక్కరించే సిద్ధాంతం సంగతేమిటి? ఈ సిద్ధాంతాన్ని క్రైస్తవ మతం పూర్తిగా దిక్కరిస్తున్నదని నేను తలుస్తున్నాను. త్రియేక దేవుడంటున్న క్రైస్తవ్యం దేవుడు ఒక్కడే మరియు ముగ్గురు అని చెబుతున్నది. ఈ వాదం సరిగా ఉన్నదా? అని ఒక విద్యార్ధి అడిగాడు.

మంచి ప్రశ్న. క్రైస్తవులు దీన్ని గురించి లోతుగా ఆలోచిస్తుంటారు. ముఖ్యంగా మీరు మధ్యఆసియాలో ఉంటే మనం అనేక దేవుళ్లను నమ్ముతున్నమనుకుంటూ ముస్లీములు ఆశ్చర్యపడుతుంటారు. ఇక్కడ పశ్చిమంలో, ఇది వ్యతిరేక వాదాన్ని దిక్కరించే సిద్ధాంతమనే ప్రశ్న వస్తుంది. ఐతే, శ్రోతలు అర్ధంచేసుకునేందుకు దీని వెనుక నున్న రెండు, మూడు సంగతుల్ని చెబుతున్నాను. జాన్, మొదటి సంగతి ఇది. దేవుని గురించి మాట్లాడుతూ ఎలాంటి భాషను ఉపయోగించాలో థొమసు అక్వినసు చాల వివరంగా చెప్పాడు. బాషను మూడు విదాలుగా ఉపయోగించవచ్చు నన్నాడు – ఏకార్ధంగా, సందిగ్ధంగా లేదా సాదృశ్యంగా.

ఏకార్ధంగా అనగా ఒకే పదాన్ని రెండు వేర్వేరు వాక్యాలలో ఒకే అర్ధం వచ్చేలా వాడటం. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నీ స్నేహితులు ప్రేమిస్తున్నారని చెబితే మీరు ఒకే అర్ధం తీసుకుంటారు. అది ఒకే పదం.

తర్వాత సందిగ్ధపు పదం వస్తుంది. “నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దేవుడు కూడా ప్రేమిస్తున్నాడు”. ఒకే పదాన్ని వాడాను. ఐతే నా మాటల్లో వ్యత్యాసమున్నదనే సంగతి వెంటనే గ్రహిస్తారు. ఎందుకంటే, దేవుడు ప్రేమించే విధం నా ప్రేమకంటే వ్యత్యాసం. ఇక్కడ పదంలో ఏదో సందిగ్ధత ఉన్నట్లైతే, అదే పదాన్ని వాడుతున్నారని తెలుసుకుంటే నాకు ఏమి లాభం?

అక్వినసు దీన్లో సాదృశ్యాలంకారమున్నదన్నాడు. దేవుని గురించి సాదృశ్యంగా చెబుతున్నాం. నేను నిన్ను ప్రేమిస్తూ, నువ్వు నన్ను ప్రేమించాకపోతే, నాకు బాధ. దేన్నో పోగొట్టుకున్నందున నాకు బాధ. దేవుడు ప్రేమిస్తున్నా నువ్వు ప్రేమించకుంటే దేవునికి బాధ. ఐతే దేవునికి వేరొక కారణము బట్టి బాధ. దేన్నో పోగొట్టుకున్నందున నాకు బాధ. నువ్వు దేన్నో పోగొట్టుకున్నదాన్ని బట్టి దేవునికి బాధ. సాదృశ్యాన్ని వాడటంలో దేవుని గురించిన ప్రశ్న వస్తున్నది. అందుకే దేవుణ్ణి అర్ధం చేసుకోవడం, సాధారణంగా ప్రశ్నార్ధకంగా మారుతున్నదని అక్వినసు మనకు తెలిపాడు.

నేనిప్పుడు చెబుతున్నాను. మనం త్రిత్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒకరకంగా ఒక్కడు, మరొక రకంగా ముగ్గురు. ఒకేరకంగా ఒక్కరూ, ముగ్గురు కాదు. ఎందుకలా చెప్పాను? దేవుడొక శరీరంకాదు లేక అస్తిత్వం కాదు. నువ్వు నేనూ శరీరదారులం శరీరప్రకారం ఏకత్వంలో త్రిత్వం అన్నాం. దేవుడు ఆత్మ ప్రకారమైన వ్యక్తి.

కనుక, మనం తండ్రి, కుమార పరిశుద్ధాత్మలనడాన్ని సి. ఎస్. లెవీస్ ఇలా వివరించాడు. మీకు ఒకే కొలత ఉన్నట్లైతే ఒకే గీతే ఉంటుంది. రెండు కొలతలున్నట్లైతే ఆకాశ ముంటుంది. మూడు కొలతలున్నాట్లైతే ఒక వస్తువుంటుంది. కొలతలలో మీరు పెరుగుతున్న కొలది, ప్రాధమిక సమాచారం అదేగాని, ఒక్కొక్క కొలతలో మరింత పైకి లేస్తారని చెప్పాడు.

దేవుడు మనవలె కొన్ని పరిమితులున్న వ్యక్తి కాదు. ఆయన అనంతమైన వాడు. ఆయన శిష్యులు జాలరులు. ఒక్క చేప, ఒక్కచేప మూడు చేపలు  ఒక్కటే కాదని వారికి తెలుసు. ఏ సంఖ్య ఎక్కువ అనే సంగతి వీరికి బాగా తెలుసు. ఐతే త్రిత్వంలోని సత్యం వద్దకు వచ్చి నప్పుడు, – తండ్రి, కుమార, పరిశుద్దాత్మలు- కుమారుణ్ణి పంపిన తండ్రి, పరిశుద్ధాత్మను పంపిన తండ్రీ, కుమారులు – ఈ సత్య మెంత సంక్లిష్టమైనదో శిష్యులు తెలుసుకున్నారు. దేవుడు సంభందంలోపల ఉన్నాడు. ఇదే ఇక్కడ కీలకం. ఆయన సంభందంలో ఉన్నాడు.

ఇప్పుడు త్రిత్వమనే ప్రతేక సిద్ధాంతాన్ని గమనిద్దాం. గ్రీకు తత్వవేత్తలు భినత్వంలో ఏకత్వాన్ని కనుగొనడానికి ప్రయత్నించారు. ఏకత్వం, అన్వేషణ, భినత్వం ఒక వాస్తవమన్నారు. అందుకే యూనివర్సిటీలను సృష్టించారు. భినత్వంలో ఏకత్వాన్ని నిర్వచించడం. అందుకే అమెరికా సృష్టించబడింది. E Pluribus Unum- అనేకంలో ఏకత్వం. ఐతే విద్యలో వారు కనుగొనలేని అంశం. మనం ఏకత్వాన్ని భినత్వాన్ని అన్వేషిస్తున్నాం. ఎందుకంటే మొదటికారణంలో భినత్వంలో ఏకత్వమున్నది. త్రిత్వంయొక్క సహవాసపు భినత్వంలో ఏకత్వం ఉన్నది.

దేవుడు సంభంధాలను ఆశిస్తాడు. అందుకే మనం సంబంధాలను కోరతాం. ఆ కోరిక మనలో నాటబడింది. కుటుంబంలో భర్త ఐనా, భార్య, స్నేహితుడు, తల్లిదండ్రులైనా సంబంధాలు వాస్తవాలే. దేవుడు సంబధాలను కోరే వ్యక్తికాకపోయినట్లైతే దేవుడు ప్రేమయైయున్నాడనవచ్చునా? దేవుడు మాట్లాడాడన్నారు ఎవర్తో మాట్లాడాడు. ఎవర్ని ప్రేమిస్తాడు? ఆయన ఇతరులతో మాట్లాడి, తన ప్రేమను తెలియ జేయడానికి ఒక పద్ధతిని ఏర్పాటు చెయ్యాల్సి వస్తుంది.

మొర్టినర్ అడ్లర్ చెప్పినట్లు మనమా అంశాన్ని త్రిత్వపు ఘనతలో మర్మంలో వదిలివేస్తేనే మంచిది. ఆయన సంభందాలను కోరుతూ మనల్ని ప్రేమిస్తున్నాడని దీనిలో ఆయన ఆధిపత్యమున్నదనే సత్యాన్ని నమ్మాలి. త్రిత్వం మనకు అందమైన జవాబు మాత్రమే కాక, తత్వవేత్తల చిరకాల అన్వేషణలకు కూడా ఇది సరియైన జవాబులనిస్తున్నది.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఊ. మంచి జవాబు. దీనితో పాటు, మీరు అనేక స్థలాలలో బోధించి, వివరించిన ఉపమాన కదను కూడా ఇక్కడ మన ప్రేక్షకులకు బాధించి సారాంశాన్ని చెప్పాలని కోరుతున్నాను. ఇది ఎడారి పేటె కథ. పేటె అనే వ్యక్తి యొక్క కథ.

డాక్టర్. రవి జకరయాస్:    ఔను. దీంతో పత జ్ఞాపకాలు వస్తాయి. అరవైయవ దశకంలో నా సంగీతపు రోజులన్నీ నశించిపోయాయని నా భార్య చెబుతుంటుంది. నిజనికి ఇండియా దేశంలో కూడా – ఇండియాలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రజలు కూడా ఆకాలంలో ప్రజాదరణ పొందిన పాటలు, ఆ పాత రోజులలో మహమ్మదు రఫీ, మన్నా డె, లేదా లతా మంగేష్కర్, వీరు ఆ పాత రోజుల్లో సంగీతంలో ప్రసిద్ధి పొందారు. ఇక్కడ కూడా ప్రెస్లె లాంటి వాళ్ళు సంగీతంలో గొప్ప పేరును పొందారు.

యవ్వనంలో డిల్లీలో కింగ్స్టన్ ట్రియో పాడిన ఓకే చక్కని పాటను విన్నాను. పాత పేరు ‘Desert Pete’, ఎడారిలో నడుస్తున్న ఒక వ్యక్తి గురించిన చక్కని పాట. భుజాలకు తగిలించుకున్న సీసాలలోని నీళ్ళు మొత్తం తాగేశాడు. ఇప్పుడు తాగేందుకు నీళ్ళు లేవు. నాలుక ఎండి చచ్చిపోయేలాగున్నాడు. దూరంగా ఒక నీళ్ళ పంపును చూసి, పరుగెత్తాడు. ఈ పాటలలోని అంతరార్ధాన్ని నేను గమనించేందుకు ప్రయత్నించాను.

కొళాయి కడ్డీని కొడితే నీళ్ళు వస్తాయని దాన్ని పైకీ కిందికీ ఊపాడు. ఇనుము మీద ఇనుము శబ్దం. నీళ్ళు రాలేదు. కుళాయిపైన చిన్న డబ్బా కట్టబడి ఉన్నది. డబ్బాలోపల చిన్న కాగితం, కాగితంపై ఏదో రాసి ఉంది. “బాటసారీ నిరాశపడవద్దు. లోపల సమృద్ధిగా నీళ్లున్నాయి. దీన్లో రాసినట్లు చెయ్యి. కొళాయి. ముక్కు క్రింద కొంచం లోతుకు తవ్వు ఇసుకలో నీళ్ళ సీసా ఉన్నది. సీసా నిండా నీళ్ళు. నీళ్ళు తాగకు, నీళ్ళను కొద్దికొద్దిగా కుళాయి గొట్టంలోకి పోస్తూ రెండో చేత్తో పంపు కొట్టాలి. భూమిలోని నీళ్ళు పైకిలాగబడతాయి. కొళాయి లోంచి నీళ్ళు బైటకొస్తాయి. కావాల్సినన్ని నీళ్ళు తాగు. నీ సీసా లన్నిటినీ నింపుకో మొదటి సీసాను మళ్ళీ నింపు నీ తర్వాతి వ్యక్తికోసం భూమిలో పాతిపెట్టు.

హెచ్చరిక: ఈ మాటల్ని నమ్మకుండా సీసాలోని నీళ్ళు వెంటనే తాగేద్దామనే కోరిక మనసులో పుట్టవచ్చు, కళ్ళెదుట నీళ్ళు కనిపిస్తున్నాయి కదా. మళ్ళీ నీకు దాహం వేస్తుంది, నీ తర్వాత వచ్చేవాళ్లకు కూడా దాహం వేస్తుంది. సీసా నీళ్ళను మొదట కొళాయి గొట్టంలో పొయ్యి, నీ దాహం తీరుతుంది, తారవాత వచ్చే వారి దాహం కూడా తీరుతుంది. ఇట్లు, Desert Pete”.

ఇది మనం అర్ధం, నిరీక్షణ, రక్షణలకోసం దాహంతో ఉన్నప్పుడు, దేవుడు రాసి, సంతకం చేసిన కాగితంలా ఉన్నది. మనకొక ఎంపిక ఉన్నది. మన బ్రతుకుల్ని మనమే నిర్ణయించుకోవాలి. తర్వాతేం జరుగుతుంది? చూడండి లోకంలో ఒంటరి వ్యక్తి శ్రమను చూసి భయపడేవాడు కాదు. ఆనందమంటే భయపడేవాడు వెళ్లేందుకు ఏ స్థలమూ లేదు. శూన్యంలోకెల్తున్నాం. “మా జీవితాన్ని నాకు సమర్పించండి. మీకు జీవ జలాన్నిస్తాను మీరే దానిని తాగివేశారంటే, మరల దప్పిగొంటారు. మీ జీవితానికి అర్ధం ఉండదని” యేసు చెప్పాడు. భావి వద్ద స్త్రీతో  యేసు చెప్పిన మాటలివి. “నీనిచ్చు జీవ జలము తాగువాడు మరెన్నటికినీ దప్పిగొనడు”.

శ్రోతలతో చెబుతున్నాను. మీరు జీవితాన్వేషణలోని అర్ధాన్ని సంకల్పాన్ని వదిలివేస్తున్నారని నిజాయితీగా ఒప్పుకుంటున్నారా? మీకున్న అధిక ఐశ్వర్యం, సంపాదించుకున్న విద్యాధికత మిమ్మల్నెక్కడికి చేర్చింది? మనసులోతుల్లో అర్ధవంతమైన సంబంధంకోసం తాపత్రయపడుతున్నారు. యేసు క్రీస్తుతోనే అలాంటి సంబంధం మీకు లభిస్తుంది. ఆయనకు లోబడి, జీవితాన్ని సమర్పించుకోండి. ఎడారి యాత్రికుని కథలోని నీతి ఇదే, జాన్, క్రీస్తు తోటి మన జీవిత కథ కూడా ఇదే.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఇది చాలా బాగుంది. మనకు మిగిలిన కొద్ది నిమిషాలలో ఇండియాలో దీన్ని చూస్తున్న ప్రజల్ని గురించి తలంచండి. యూరపు దేశాలలోను, ఆఫ్రికాలోను దీన్ని చూస్తున్న ప్రజలను గురించి తలంచండి. ఈ అంశం అర్ధంకాని వారికి మీరు కొంచం దీనిని వివరించాలి. యేసు చరిత్రలో నిజంగానే పుట్టాడని వారికి తెలుసు. వారికి తెలిసినది అంతమాత్రమే. అది వారినెలా ప్రభావితం చేస్తుందని తెలుసుకోవాలి. మీ ప్రారంభ జీవితాన్ని గురించి, మీరు క్రీస్తు నంగీకరించిన సంగతిని గురించి ప్రజలకు చెబితే మంచిదనుకుంటాను. వీరిని క్రీస్తు వద్దకు నడిపించి వారు క్రీస్తును అంగీకరించేలా వారి కొరకు మీరు ప్రార్ధించాలని కోరుతున్నాను.

డాక్టర్. రవి జకరయాస్:    చూడండి, కొన్నేళ్ళ క్రితం అమెరికాలో భయంకరమైన ఒక చెరసాలకు వెళ్లాను. దానిపేరు అంగోలా చెరసాల. ఐదు వేల మంది ఖైదీలు, ఎక్కువ మందికి యావజ్జీవ కారాగారం. నేను ఆ ఖైదీలతో మాట్లాడినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన కదలను విన్నాను. జైలు శిక్షవలన క్రీస్తును గురించి తెలుసుకుని, ఇప్పుడెంతో సంతోషంగా జీవిస్తున్నానని ఆ ఖైదీలలో ఒకడు చెప్పాడు. పాపం మన శరీరంలో బాధ, అవిటితనం వంటివేకాక మనసులో జ్ఞానవివేచనలు తగ్గిపోయి ఆత్మను బానిసత్వంలోకి త్రోసివేసే ఆలోచనలు కూడా కలుగుతాయని ఆ సమయంలో గ్రహించాను.

ఆత్మలో బానిసలుగా ఉన్నాము. గతంలో అదేనా స్థితి. పదిహేడేళ్ళ వయసులో  యేసు క్రీస్తును అంగీకరించాను. చాల ఏళ్ళ తర్వాత మా నాన్న రక్షణ పొందాడు. ఇండియాలో ఉన్నత స్థితిలో ఉన్న మా నాన్న చర్చిలో వేదిక వద్ద మొకాళ్ళూని క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడు. అతడి ఫోటోలని చూసి అతడు రక్షణ పొందాడని గ్రహించానని నా భార్య అన్నది. సదా కోపంగా ఉండే వ్యక్తి ఎంతో ప్రేమగల వ్యక్తిగా మారాడు.

మీరు ఈ కార్యక్రమాన్ని చూడటం దేవుని సంకల్పం. మీ మనస్సులో బానిసత్వముంది. మనందరి మనసుల్లో బానిసత్వముంది. ఇప్పుడొక ప్రశ్న. మీకు విడుదల కావాలా? దేవుడు మీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్వేచ్చను అందుకోవాలని కోరుకుంటున్నారా? అలాగైతే, అందరూ తలలు వంచి నేను చెబుతున్నట్లుగా ప్రార్ధించండి. ఆయన విమోచకుడు. విడుదలనిస్తాడు. మీ మనసులోని బానిసత్వపు ఆలోచనల నుండి మిమ్మల్ని ఆయన విడిపిస్తాడు. తలలు వంచి నాతో ప్రార్ధించండి.

పరమందున్న తండ్రీ, నేనీ ప్రసంగాన్ని వినడం మీ చిత్తాను సారమే. ఇది యాదృచ్చికం కాదు. మీ సంకల్పాన్ని బట్టియే నేనీ రోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాను. నేడు ప్రార్ధిస్తున్నాను. నాలో బానిసత్వపు సంకెళ్ళు, పాపం నుండి విడిపించి నన్ను క్షమించండి. నా చిత్తాన్ని మీ చిత్తంగా మార్చండి. నన్నొక నూతన వ్యక్తిగా మార్చి ముందుకు నడిపించండి. నీవు కావాలి. నీవు కావాలి. నీకు సమర్పించుకుంటున్నాను. నా రక్షకునిగా ఉండండి. ప్రార్ధనకు జవాబిచ్చినందుకు వందనాలు. నీ ఘననామమున ప్రార్దిస్తున్నాం. ఆమెన్.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    అద్భుతం. రవి, ప్రజలారా, ఇలా ప్రార్దించారని నమ్ముతున్నాను. మీరింకా నిర్ణయం తీసుకోకపోతే పరవాలేదు. మా వెబ్ సైట్ JAshow.org లో, యేసు క్రీస్తునంగీకరించడం లేదా క్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించడం అనే అంశాన్ని గమనించండి. యేసు క్రీస్తును గురించి మీకు దీన్లో మరింత సమాచారం లభిస్తుంది – ఎలా ప్రార్దించాలో తెలిపే నమూనా ప్రార్ధన కూడా ఉన్నది. మీరు ఆవిదంగా ప్రార్ధించినట్లైతే, యేసుతో కలిసి జీవించడానికి, దీనిలో కొంత ప్రోత్సాహం, కొన్ని వాగ్దానాలు మీకు లభిస్తాయి. మీకు సమస్తం తెలియదు. దేవుని శక్తిని మీరు పూర్తిగా అనుభవించలేదు. కొద్దికొద్దిగా నేర్చుకోండి దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు సహాయపడగలడు.

రవి మీకు తీరిక లేక పోయినా వచ్చి ఈ ఆరు కార్యక్రమాలలో మా ప్రేక్షకులకు లోతైన సత్యాలను బోధించినందుకు వందనాలు. మీరు గొప్ప పాండిత్యంతో, ప్రపంచవ్యాప్తంగా అనేక యూనివర్సిటీలలో విద్యార్ధులడిగిన ప్రశ్నలకు, ఎంతో వివరంగా ధైర్యంగా జవాబులు చెప్పినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. మీరు మళ్ళీ మా కార్యక్రమానికి వస్తారని ఆశిస్తున్నాను.

ప్రజలారా, ఈ ఆరు కార్యక్రమాలలో రవి వివరించిన సమాచారాన్నెలా తెప్పించుకోవాలో, ఆ వివరాలన్నిటినీ తెలుసుకోవాలని ఆశిస్తే చూస్తూనే ఉండండి.

ఆ సంగతులను చెబుతాం.

 

 

మరిన్ని టీవీ ప్రోగ్రామల్ని చుచెందుకు ఉచిత

FREE John Ankerberg Show App download చెసుకొండి

“Pray to Accept Jesus Christ as Your Savior” @  JAshow.org

కాపీరైట్ 2015 ATRI.

 

 

జీసస్ సినిమా

క్రైస్తవుడగుట ఎట్లు?

నీవెలా క్రైస్తవు డవగలవు? యేసును వెంబడించి ఆయన యందు విశ్వాసముంచువాడే క్రైస్తవుడు. దీనిని బైబిలు బహు సరళముగా తెలియజేయుచున్నది, కనుక నీవు క్రైస్తవుడవని తెలుసుకో గలవు. , ఇక్కడ నొక్కండి .

ఆడియో బైబిలు