డా. రవి జకర్యా గారు నాస్తికులకు జవాబు లిస్తున్నాడు సిరిస్ 2 . ప్రోగ్రాం 1

డా. రవి జకర్యా గారు నాస్తికులకు జవాబు లిస్తున్నాడు

 

సిరిస్ 2 . ప్రోగ్రాం 1

ఈ రోజు  జాన్ యాంకర్ బర్గ్ షో లో  డాక్టర్.  రవి జకరయాస్ నాస్తికులకు జవాబు చెపుతాడు. ఇండియాలో పుట్టి పెరిగిన ఇతడి పూర్వికులు , ఉన్నత హైందవ కులంలో పూజారులుగా ఉండేవారు. ఐతే ఒక రోజు న ఇతడు యేసు వాక్యాన్ని విని క్రైస్తవునిగా మారిపోయాడు. ఆ తరువాత ప్రపంచము లో ఒకరిగా ఎదిగి 70 కి మించిన దేశాలలో పర్యటించి, ఆనేక ఉన్నత స్తాయి యూనివర్సిటిల లో   Harvard యూనివర్సిటిల లో   ,Princeton,  Dartmouth, Johns Hopkins,  Oxford వంటి యూనివర్సిటిల లో   ప్రసంగించారు. శాంతి ఒప్పందాన్ని వ్రాసిన రచయితల ఎదుట దక్షిణ ఆప్రికాలో   ప్రసంగించారు. Lenin సైనిక అకాడమి లోను, మాస్కోలోని  Geopolitical Strategy కేంద్రం లోని సైనికాధికారూల ఎదుటను మాట్లాడారు.  New York  United Nations సంవత్సరిక ప్రార్దన ఉదయాహారపు కూడికలలో ఇతడు మూడుసార్లు భోదించాడు.   Ottawa, Canada, London, England, లలో జరిగే జాతీయ, అల్పాహార ప్రార్దన కూడికలలో  కూడా ఇతడు పలుమార్లు ప్రసంగించాడు.  Washington, DC.లోని CIA లో కూడా మాట్లడాడు. ఈ జాన్ యాంకర్ బర్గ్ ప్రోగ్రాంలో మాతో కలుసుకోండి

—————-

 

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మా కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. నా పేరు జాన్ ఆంకర్ బర్గ్. నేటి కార్యక్రమాన్ని చూస్తుంనందుకు వందనములు. మన మధ్య ప్రత్యెక అతిధి డా. రవి జకర్యా గారు ఉన్నారు. ఈయన నాకు తెలిసిన వారందరికంటే ఎక్కువ సార్లు యూనివర్సిటీ విద్యార్ధులముందు ప్రసంగించారు. దూరపు తూర్పుదేశాల విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు జవాబులను మనం గత వారంలో చర్చించాము. ఈ రోజు మధ్య ఆసియాలోని విద్యార్ధు లడిగిన ప్రశ్నలకు జవాబులను చర్చించ బోతున్నాం. వచ్చేవారం యూరపు లోని విద్యార్ధులు అడిగే ప్రశ్నలను చర్చించబోతున్నాము. చివరగా అమెరికా విద్యార్ధులు. రవి, ఈ విద్యార్ధులు దేవుని గురించి ఎంతో నిజాయితీగా ప్రశ్నిస్తున్నారు. మధ్య ఆసియా దేశాలలోని అనేక యూనివర్సిటీ విద్యార్ధుల ఎదుట మీకు ప్రసంగించే అవకాశం దొరికింది. మనం ఈ ప్రశ్నలకు జవాబులిస్తుండగా, ఆయా యూనివర్సిటీల విద్యార్ధుల గురించి మీరు ఆలోచించాలి. కనుక, మేము జవాబులను చెబుతుండగా ఆయా విద్యార్ధుల సంస్కృతిని, ఆలోచనల్ని మనసులో ఉంచుకుని జవాబులనిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మీరు ఈ అంశాల్ని అర్ధం చేసుకోగలరు.

మధ్య ఆసియాలో చదువుతున్న ఒక విద్యార్ధి నన్ను మొదటి ప్రశ్న అడిగాడు. “నేను క్రైస్తవుణ్ణి కాను. మహామ్మదీయుడను అడిగినందుకు క్షమించండి. మీరు చెప్పిన పది ఆజ్ఞలు మలాంటి ప్రజలకు ఎంతో అద్బుతమైన ఆత్మసంబంధమైన గైడుగా ఉపయోగపడుతున్నాయి. మనం చేయవలసిన అన్ని పనులను గురించి కచ్చితంగా చబుతున్న మోషే ధర్మశాస్త్రముతో పోలిస్తే, యేసు విధించిన ఆజ్ఞలు సమాజంలోని అన్ని అంశాలకు సరిపోవడంలేదు. మీరు అడుగుతున్న పరిపూర్ణ చట్టం క్రైస్తవ్యంలోనే లేనపుడు, క్రైస్తవ్యం ఈ లోకాన్నే మార్చివేయ గలదని మీరు ఎలా చప్పగలరు?” మీరు ఏక కాలంలో మీ సోదరుణ్ణి, దేవుణ్ణి ప్రేమించలేరు. దీనికి మీరేమంటారు?

డాక్టర్. రవి జకరయాస్:    ఇది అద్భుతం. ఆ ప్రశ్న అడిగిన సందర్భంగుర్తున్నది జాన్. నిజమే. నేను పలుమార్లు మధ్య ఆసియాలో ప్రసంగించాను. ఆ ప్రాంతం నాకు ఎంతో నచ్చింది. సిరియా, లెబనాను, యోర్దాను లాంటివి మరియు ఐగుప్తు ఇలాంటి అనేక దేశాలు. జకార్తా, ఇండోనేషియా లలో చర్చలు, మలేషియాలో ఇస్లామికు యూనివర్సిటీలో విధ్యార్ధులతో చర్చలు. మేమెంతో వివాదాస్పదమైన అంశాలను చర్చిస్తున్నాం అక్కడి విద్యార్ధులు మాతో ఎంతో మర్యాదగా ప్రవర్తించారు. కనుక నన్ను అక్కడికి ఆహ్వానించి ఎంతో ప్రేమగా ఇస్లామీయ లోకానికి వందనాలు చెబుతున్నాను. ఐతే, మా అభిప్రాయలు పూర్తిగా వ్యతిరేకమైనవి. ఈ ప్రశ్నను కూడా అక్కడి విద్యార్ధులు అడిగారు.

నిజానికి ఈ ప్రశ్నలోనే పెద్ద తప్పు కనిపిస్తున్నది. మహమ్మదీయ మతములోనే రకరకాల వివరణలు ఇస్తున్నారు. అంతెందుకు, ఇస్లాం మత స్థాపకుడు, వారి ప్రవక్తయే మత నిబంధనలను కొన్నింటిని రద్దు చేస్తున్నానని చెప్పాడు. కనుక దీన్లో కూడా పరిపూర్ణత లేదు. లేదా, ఇస్లాంలోని అనేక శాఖలను చూడండి. సూఫీ శాఖను, లేదా ఆహ్మదియాస్ను, లేదా ‘ఏడు అంశాలు”పన్నెండు అంశాలు’- పెద్ద శాఖలు ‘సున్ని’, ‘షియా’ లను తీసుకున్నా – వారి ముఖ్యమైన సిద్ధాంతాలలో అనేక బేదాభిప్రాయాలను చూడగలం. ఇస్లాంలోని ‘షియా’లోనే ఆచారాన్ని బలంగా పాటిస్తున్నారా? లేదు. ‘సున్ని’లోనే ఆచారాల్ని గట్టిగా పాటిస్తున్నారు. కనుక దీనిలోనే ఉన్న రకరకాల బేదాభిప్రాయాలను గురించి ప్రశ్నలో ప్రస్తావించలేదు.

ఐతే నేనిప్పుడు చర్చిస్తున్న అంశంలో, ముఖ్యంగా మధ్య ఆసియాలో మనం తెలుసుకోవలసిన దేమిటంటే, ధర్మశాస్త్రాన్ని గురించి ప్రపంచానికున్న అభిప్రాయానికి, యూదా – క్రైస్తవ అభిప్రాయానికి మధ్యనున్న విపరీతమైన వ్యత్యాసాలను మనం గమనించుకోవాలి. అందుకే, ఉపాద్యాయుడు చెప్పినట్లుగా, అద్దంలో చూస్తున్నట్లుగా మనం ధర్మశాస్త్రాన్ని చూస్తున్నామని యేసు చెప్పాడు. ఐతే ముఖాన్ని కడుక్కోవాలను కుంటే, అద్దం వద్దకు వెళ్లరు. అద్దం మురికిగా ఉన్నదని మాత్రం చెబుతుంది. మురికిని కడిగివేయాలంటే మీరు నీళ్ళవద్దకు వెళ్ళాల్సిందే. చట్టం సమాచారాన్ని మాత్రం తెలుపగలదు. మన హృదయాన్ని ఎన్నడూ మార్చలేదు.

ఐతే మరికొన్ని సంగతులను గుర్తించండి. మోషే 613 కట్టడాలను ఇచ్చాడు. ఏమయ్యింది? మరింత గందరగోలమయింది. దావీదు వాటిని 15కు కుదించాడు. యెషయా వాటిని ఎనిమిదికి కుదించాడు. మీకా దాన్ని మూడుగా కుదించాడు. ‘న్యాయ ప్రవర్తన, కనికరం, దీన మనసుతో దేవుని ముందు నడవటం’. యేసు దీనిని ఒకటి కాదు రెండుగా కుదించాడు. “నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను నీ ప్రభువును ప్రేమించాలి. నిన్నువాలే నీ పోరుగువానిని ప్రేమించాలి. వీటిపై ధర్మశాస్త్రం, ప్రవక్తలు ఆధారపడి యున్నవి” అన్నాడు. ఎందుకని? పది ఆజ్ఞలకు ముందరి సంగటన దీనికి జవాబుగా ఇవ్వబడింది దీనిని మీరు జాగ్రత్తగా వినాలి. దేవుడు పది ఆజ్ఞలను ఇవ్వడమే కాదు. “నీ దేవుడైన యెహోవానగు నేనే నిన్ను ఐగుప్తు నుండి వెలుపలికి రాప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు” అన్నాడు.

నేటి యూదా క్రైస్తవ అభిప్రాయంలో నీతికంటే, విమోచనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతున్నది. దీన్ని విన్నారనుకుంటాను. నీతికంటే, విమోచనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతున్నది. ఆతర్వాత ఆరాధన వస్తుంది. విమోచన నీతి ఆరాధన. విమోచన పొందితేనేకాని నీవు నీతిమంతుడవు కాలేవు. మొదట విమోచన పొంది నీతిమంతుడవైతేనే గని అరాధించలేవు. “యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే”. ఈ రెండిటికీ మధ్య ముఖ్యమైన వ్యత్యాసం ఇదే. దేవుని రాజ్య ప్రవేశానికి నీతి నాకు ప్రత్యేకాదికారాన్నివ్వదు.  ఐతే, దేవుడు దయచేసే క్షమాపణ నా హృదయాన్ని మార్చి దైవాజ్ఞను ప్రేమించేలా సహాయపడుతుంది.

నిబంధనలు లక్షణాలను మాత్రం సరిదిద్ధగలవు. మనసు మారినప్పుడు మనం దైవాజ్ఞలను పాటించగలము, కృతజ్ఞతతో, ఆరాధనాభావంతో నిరంతరం భక్తిగా జీవించగలము. కనుక, ధర్మశాస్త్రం ఏమిచెబుతున్నదో దాన్ని గురించి ఈ రెండిటి మధ్య అధికమైన బెదాభిప్రయాలున్నాయి.

మరొక సంగతి చెబుతున్నాను. కొండమీది ప్రసంగంలో యేసు దీన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాడు. “వ్యభిచారం చెయ్యొద్దని చెప్పిన మాట మీరు విన్నారుకధా, ఐతే నేను మీతో చెబుతున్నదేమనగా” – చూడండి వ్యభిచారం చెయ్యడం మాత్రమే కాదు మీరొక స్త్రీని మోహపు చూపుతో చూచినా అది వ్యభిచారమేనని యేసు చెబుతున్నాడు. కనుక క్రైస్తవ సందేశంతో ప్రపంచాన్ని మార్చెయ్యగలం. ఐతే మీ హృదయం నా హృదయం మారినప్పుడే, ఈ లోకాన్ని మార్చడమనే పని సాధ్యమౌతుంది. దేవుడొక్కడే దానికి సమర్ధుడు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఊ. మంచి జవాబు. ప్రజలారా! ఇప్పుడు కొంచం త్వర త్వరగా ముందుకు వెళ్ళాలి. అధిక సమాచారమున్నది. మీరు రవి జకర్యా గారి వెబ్సైటులోకి వెళ్లి గూగులులో యూట్యూబులోకి వెళ్తే, ప్రపంచ వ్యాప్తంగా విద్యార్ధులు అడిగిన అనేక ప్రశ్నలనూ ఇంకా అనేక సంగతులను దానిలో తెలుసుకోగలరు. ఐతే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సంగతులను మాత్రం ఇక్కడ చర్చించబుతున్నాము. బైబిలు పుస్తకాల్ని గురించిన ప్రశ్న చెబుతున్నాను. సరేనా? రవి, యేసు క్రీస్తు మరణించిన తర్వాత వ్రాయబడిన మత్తయి, మార్కు లూకా, యోహాను సువార్తలలోని అంశాలను వాస్తవాలని మీరు ఎలా చెప్పగలరు? ఈ సంగతులను యేసు అంగీకరిస్తాడని ఎలా చప్పగలరు?

డాక్టర్. రవి జకరయాస్:    సరే, లేఖనం దైవావేశము వలన కలిగిందనే సిద్ధాంతం ఇస్లాం సిద్ధాంతాలకు చాలా వ్యతిరకంగా ఉన్నట్లున్నది. నావల్నే మీరు కూడా బక్తిగల ముస్లింతో చర్చిస్తే, దీనికి జవాబు ఒకే పవిత్ర గ్రంధం ఖురాన్లో, ఒకే రచయిత ప్రవక్త మహమ్మదు వ్రాసిన ఖురాను గ్రంధంలో ఉన్నాడని వారు చెబుతున్నారు. వారి అభిప్రాయాల పరిధిలో ఆ గ్రంధాన్ని విమర్శించడం కూడా చాల కష్టమైన పని. ఇరానియ్యుడైన అలీ దస్తి ఈ విషయంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పండితుడు. “ఇరవైమూడు సంవత్సరాలనే పుస్తకాన్ని వ్రాసాడు”. ఇది మహమ్మదు ప్రవక్త జీవిత చరిత్ర. దస్తి అద్భుతమైన రచయిత. ఆ బాషలో అద్భుతనైపుణ్యం గలవాడు.

ముస్లిం పండితులందరికీ అలీ దస్తి ఎవరో తెలుసు. ఖురాను ఒక పరిపూర్ణ గ్రంధమనే మాటను అతడు పరిశీలిస్తున్నప్పుడు ఒక విషాదం జరిగింది. ఏం జరిగింది? తాడు మాయమయ్యాడు, కనపడలేదు. ఖురానును ఒక పరిపూర్ణ గ్రంధంగా ప్రజల ముందు చూపించాలంటే వ్యాకరణ సూత్రాలను మార్చవలసి ఉంటుందని రాశాడు. దీనిని సరాసరి ముస్లిం ఒప్పుకోవలసిన అవసరం ఉన్నది, ఇది చాలా ముఖ్యాంశం. అందరం బల్ల వద్ద కూర్చుని స్నేహపూర్వకంగా చర్చిస్తుంటాం. వారిపై ద్వేషంలేదు. ఇండియాలో పెరిగిన నాకు హిందూ ముస్లిం స్నేహితులున్నారు. నా క్రికెటు కేప్టను సుల్తాన్ అహ్మద్ ఎంతో మంచి మహమ్మదీయుడు. నాకు మంచి స్నేహితుడు అప్పుడు నేనింకా రక్షణలోకి రాలేదు.

ఐతే, ఆ గ్రంధం పరిపూర్నమైనదని వారు ప్రకటిస్తున్నా అది సత్యానికి దూరంగా ఉన్నదనే సంగతిని వారు తెలుసుకోవాలి. పండితుడు టోబీ లెస్టర్ ఈ విషయాన్ని గురించి అట్లాంటిక్ మంత్లీ అనే పత్రికలో 199లో చాలా వివరంగా రాశాడు. నిజమేమిటంటే, అధికారయుతమైన వ్రాత ప్రతి నిర్ణయించబడిన తర్వాత మూడవ ఖలీఫా అయిన ఉస్మాన్ కాలంలో, వ్యత్యాసంగా కనిపిస్తున్న సిద్ధాంతాల ప్రతులనన్నిటినీ మంటలలో కాల్చివేశాడు.

ఈ అంశాన్ని ముఖ్యంగా గమనించాలి. వ్యత్యాసాలకోసం సువార్తలను పరిశీలిస్తే, ఆదిమ ప్రతుల యొద్దకు వెళ్ళేకొద్దీ, వ్యత్యాసాలనేవి దాదాపు ఒక్కటికూడా ఉండవు. మీరు బైబిలును గమనిస్తే. 40 రచయితలు, 66 పుస్తకాలు, 1500 సంవత్సరాలు వ్రాసిన మొత్తం ఉదంతం యేసు క్రీస్తు పుట్టుక, జీవితం, మరణం, పునరుత్తానాలను గురించే మనకు తెలుపుతున్నది. నాకైతే గొప్ప అద్భుతం వెయ్యి ఐదొందల ఏళ్ళ కాలంలోని ప్రజలు ఒకేరకంగా ఎలా ఆలోచిస్తారు?

ప్రధాన సందేశం ఫిలిప్పీ రెండవ అధ్యాయంలో ఉన్నది. “దేవుని స్వరూపం కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలెదు కాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును దరించుకుని తన్నుతానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుష్యుడుగా కనబడి, సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత …. ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్ధమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును దేవుడాయనను హెచ్చింఛి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను”. ఇది మొట్టమొదటి కీర్తన. ఇది క్రీస్తు సువార్తలోని ప్రాధమిక సూత్రాలను తెలిపింది. ఇది చక్కని కథ. యేసు క్రీస్తు చెప్పిన మాటలను పరిశుద్ధాత్మ గుర్తుచేయగా రచయితలు కచ్చితంగా వ్రాశారు.

గబ్రియేలు దూత దర్శనాన్ని చూశాడని ఖురానులో వ్రాయబడింది. కనుక దీనిలో మనిషి పాత్ర ఉన్నది. ఐతే బైబిలు కథనాన్ని పరిశుద్ధాత్మ వారి మనసులకు తెలుపగా ఆయా రచయితలు వ్రాశారు. సువార్త సందేశమంతా ఈవిధంగానే వ్రాయబడింది. అనేక వ్రాత ప్రతుల ముక్కలు నేడు మనకు లభ్యమౌతున్నాయి. పురాతన వ్రాత ప్రతులలో బైబిలు వాలే వేరొకటి ఇంతగా ప్రసిద్ధి పొందలేదు. యేసు యెవరనే సంగతీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడనే సంగతీ వివరంగా వ్రాయబడింది.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    రవి, మరొక రెండు వ్యత్యాసాలు కూడా దీనిలో ఉన్నాయి వివరించండి.

డాక్టర్. రవి జకరయాస్:    ఔను. మహమ్మదు ప్రవక్తయే స్వయంగా క్రైస్తవులను గ్రంధపు ప్రజలని వ్యాక్యనించాడు. కనుక దీనిలో దేవుని ప్రత్యక్షత ఉన్నదని, వ్రాత ప్రతులున్నాయని గుర్తించాడు. ఐతే, దీనిలో ఉన్న దేవుని అధికారం అ తర్వాత తగ్గిపోయిందని అతడు గుర్తిస్తే నేనొక ప్రశ్న అడుగుతున్నాను. వారి అధికారం కూడా తగ్గదని ఎలా చెప్పగలరు? కనుక సిద్దాంతిక అవకాశం అక్కడ ఉన్నది. ఐతే దీనిని దేవుడిచ్చాడనేదే ముఖ్యాంశం. అవి తప్పిపోయాయంటే నమ్మలేము. నిజానికి, ఖురాను గ్రంధంలోనే ఎక్కువ వ్యత్యాసాలున్నాయని మనం గమనించగలం.

చరిత్రలోని ముఖ్యాంశాలలో యేసు క్రీస్తు సిలువ మరణం ఒకటి. యూదా చరిత్రకారులు అన్యమత చరిత్రకారులు దీన్ని గురించి చెప్పారు. గ్రీకు చరిత్రకారుడు తల్లుసు, రోము చరిత్రకారుడు టాకిటసు అందరూ యేసు సిలువ శిక్షను గురించి వ్రాశారు. ఖురాను, యేసు మరణించలేదు గాని అలా అనిపించింది అని అన్నది. అ తర్వాత సిలువపైన ఉన్నది యేసు క్రీస్తు కాదని విచిత్రమైన సిద్ధాంతాలను కూడా లేవదీసారు. మనకు చెప్పబడిన దాన్ని బట్టి ఖురానులో ఉన్న వ్యత్యాసమైన ఉదంతం చరిత్రకు అనుగుణ్యంగా లేదని కచ్చితముగా తెలుస్తుంది. దేవుడు తన కుమారుని మూలంగా నీకు నాకు క్షమాపణను అందజేస్తున్నాడు. ఇదే క్రీస్తు సువార్తలోని అద్భుతమైన కథ.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    రవి మధ్య ఆసియా దేశాల విద్యార్ధులు మిమ్మల్ని గతంలో అడిగిన కొన్ని క్లిష్టమైన ప్రశ్నలకు జవాబుల్ని గురించి మనం చర్చిస్తున్నాం. వాటిల్లోంచి ఒక ప్రశ్న. మరొక విద్యార్ధి “రవి! క్రైస్తవ సంగాలన్ని బోధిస్తున్న ఒక సిద్ధాంతం నిజంగా నా మనసును ఎంతో బాధిస్తుంది. అందరం పాపంలో జన్మించామంటున్నారు. ఐతే యేసు మొదట పాపం గురించి ఏమీ చెప్పలేదు. ఆయన దేవుడైనా, త్రిత్వం గురించి చెప్పలేదు. రెండిటిని నొక్కి చెప్పాడు. నీ దేవుని ప్రేమించాలి, పొరుగు వాణ్ని ప్రేమించాలి ఈ రెండు సంగతుల్ని మాత్రమే నొక్కి చెప్పాడు. దానికి మీరేమంటారు?” అన్నాడు.

డాక్టర్. రవి జకరయాస్:    ఔను. ఇది చాల మంచి ప్రశ్న. ఈ సంగతులనెంత హాస్యాస్పదం చేస్తారో తెలుస్తున్నది, జాన్. చర్చావేదికలపైనుండి, మసీదులలోనుండి, ఇవే సంగతులను మీరు మళ్ళీ మళ్ళీ చెబుతుంటారు. దీనిని చదివితే సత్యం దీనిలో కుదించబడిందని తెలుసుకుంటారు. ఇక్కడ సత్యమేమిటంటే, బైబిలు వచనాలను గమనిస్తే ఉదాహరణకు, రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రము వలన లభించే నీతిపైన ఆధారపడి ఉన్నానని ఇక్కడ వ్రాస్తున్నాడు. “ధర్మశాస్త్రము వలని నీతివిషయమై అనింద్యుడనైయుంటిని” ఐతే “అందరూ పాపముచేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు” అని అన్నాడు.

ప్రజలకు సరైన అర్ధం తెలియదు. పాపమంటే ఒక పని అంటారు. అదొక పనికాదు. పాపమనగా పనిగా మారక ముందు స్థితి. అందుకోలేకున్నాం. దీని గ్రీకు పదానికి అర్ధం, గురిని తప్పిపోవడం. అందరికంటే అధికంగా ముస్లీములు ఈ సంగతిని గుర్తించాలి. దేవుడు నిర్ణయించిన గురిని తప్పిపోతున్నాము. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో మాట్లాడుతూ యేసు యేమని చెప్పాడో గమనించండి. “మీలో పాపములేనివాడు మొట్ట మొదట ఆమెమీద రాయి వేయండి” అన్నాడు.

పాపము యొక్క నిజ స్వరూపాన్ని చెబుతూ, పక్షవాయువు గల రోగిని ఇంటి కప్పులోనుండి క్రిందికి దించినప్పుడు యేసు అతడిని బాగుచేస్తాడని ప్రజలు ఎదురు చూసారు. కాని యేసు, “కుమారుడా! నీ పాపములు క్షమించబడి యున్నవి” అన్నాడు. తర్వాత “నీ పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళుము” అన్నాడు. యేసు ప్రజలను – “నీ పాపములు క్షమించబడినవని చెప్పుట సులభమా? నీ పరుపెత్తుకుని నడువుమని చెప్పుట సులభమా?” అని అడిగాడు. “పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమిమీద అధికారము కలదనెను”. ఇదే ముఖ్యమైన అవసరము.

ఇండియాలో ఒకాయన నాతో, ‘నాకు మత గురువు అవసరమా’ అని అడిగాడు. మీకు గురువుకంటే ముందుగా మిమ్మల్ని రక్షించే రక్షకుని అవసరమున్నది. గురువుకు కూడా రక్షకుడు కావాలని చెప్పాను. కనుక మానవులందరికీ మొదట రక్షణ చాలా అవసరము.

“నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతో ప్రేమించవలెను…. మరియు నిన్నువలె నీ పోరుగువానిని ప్రేమించవలెను” యేసు క్రీస్తు మనకు చెప్పాడు. నీనిక్కడ ఒక మాట చెబుతున్నాను. క్రీస్తు చెప్పిన మాటలో బలమైన భావమున్నది. యేసు మాటలను పాటించినట్లైతే మధ్య ఆసియా ఎంతో చక్కని ప్రదేశంగా మారిపోతుంది.

 

దీన్లోని సత్యమేమిటంటే, మనం దేవుని స్వరూపంలో సృష్టించబడినాము. అనగా దీని అర్ధమేమిటి? నీతి పరంగా మన శక్తిని మనమే నిర్ణయించు కుంటాం. మన హృదయం ఏసుక్రీస్తు రక్షణ శక్తిని ప్రభావంతోటి పూర్తిగా మారకపోతే, మనకే అధిక శక్తి ఉన్నాడని ప్రకటించుకుని గర్వపడుతుంటాము.

మధ్య ఆసియాలోని నా స్నేహితుణ్ణి అడుగుతున్నాను. మరొకరకం రాజకియ్య విధానాన్ని కోరుతూ, కత్తి చేతపుచ్చుకుని, వీధుల్లో తిరుగుతూ ప్రజల తలలు నరుకుతున్న వ్యక్తి మనసు, యేసు క్రీస్తు చెప్పినట్లు తన దేవుడైన ప్రభువునూ, తన పోరుగువానిని ప్రేమించడం ద్వారా మారితే ఏమౌతుంది? ఏదైనా వ్యత్యాసం కలుగుతుందా, లేదా? నా హృదయం దేవుని ప్రేమించడం మొదలుపెడితే నా జీవితం పూర్తిగా మారిపోతుంది. చూడండి, నేను మునుపే చప్పినట్లు దేవుడు మన పనుల్ని మార్చడుగాని మనం చెయ్యాలనుకునే వాటిని మార్చివేస్తాడు. కనుక మానవుల పరిస్థితిని గురించి యేసు నేర్పించిన బాధల్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి.

మరొక్క సంగతి. అమెరికా దేశంలో మొదట ముద్రించబడిన వాక్యాన్ని మీకు చెబుతున్నాను. ‘ఆదాము పతనంలో అందరం పాపం చేశాము’. మానవునియొక్క పతనం, మానవుని నైతిక పతనాన్ని  అనుభవములో మాత్రమే నిర్నయించగలమని, అదే సమయంలో అది అధికంగా నిరోదించబడుతున్నదని మాల్కోమ్ మగ్గేరిడ్జ్ చెప్పాడు. ప్రజలు పాపం చెయ్యలేదనడమే వారి పాపానికి సాక్ష్యం. ఎందుకంటె పాపానికి కారణం గర్వం.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఔను. హమస్ను ప్రారంభించిన నలుగురు మత గురువులలో ఒకరితో మీరు జరిపిన చర్చను గురించి దేవుడు మీతో చెప్పించిన సంగతులను గురించి చెప్పండి.

డాక్టర్. రవి జకరయాస్:    అది అద్భుతం. అది ఎలా జరిగిందో వివరంగా చెబుతాను. ఎందుకంటె. నేను ఆ సమావేశానికి కొంచం ముందుగానే వచ్చాను. దమస్కులో షేక్ హుస్సైనును కూడికకు ముందే కలిశానో, తర్వాత కలిశానో సరిగా గుర్తులేదు. దీన్ని చెప్పేందుకు అతడు అనుమతి యిచ్చాడు సిరియాలోని సుప్రసిద్ధ షియా మతగురువు షేక్ హుస్సైన్. మేము చర్చిస్తున్నాం. ఆ చర్చ ముగుస్తున్న సమయంలో అతడు నన్ను చూసి సూటిగా ప్రశ్నించాడు. “ప్రొఫెసర్, యేసు సిలువపై మరణించాడా అని అడగడం మాని, ఎందుకు మరణించాడు?” అని అడగాల్సిన సమయం వచ్చిందని అన్నాడు. ఆమాటకు “షేక్ హుస్సైన్ గారు ఈ మాటను నేను ఎక్కడైనా వాడుకోవచ్చా? అని అడిగాను”. అందుకతడు కొంచం ఆలోచించి “సరే, వాడుకోండి” అన్నాడు.

హమాస్ యొక్క నలుగురు స్థాపకులలో ఒకరైన షేక్ తోను, కాంటర్బరి ఆర్చి బిషపు తోను రామల్లాలో ఉన్నప్పుడు దీనిని గురించి మేము చర్చించాము. యూదా, ఇస్లామియా నాయకులతోటి సమావేశం. వారు స్నేహసంబంధాలతోటి మాట్లాడుకోడానికి తగిన వాతావరణాన్ని కల్పించెందుకు ప్రయత్నించాము. అది చివరిదినం. పుగతో నిండిన ఆ గదిలో ఆరుగురు, ఏడుగురు కలిసి కూర్చునియున్నాం. షేక్ శారీరకంగా చాల బలంగా ఉన్నాడు. తాను జైల్లో ఉన్న సంవత్సరాలను గురించి పోగొట్టుకున్న కుటుంబాన్ని గురించి చెప్పాడు.

ముఖ్య అతిధులు కాని మాలాంటి వాళ్ళు అతడిని మనిషికి ఒక్కొక్క ప్రశ్న అడగవచ్చునన్నారు. అది ప్రత్యెక సమావేశం గనుక నా ప్రశ్నను మీకు చెప్పను. ఐతే నా ప్రశ్నకు అతడిచ్చిన సమాదానం నాకు నచ్చలేదు. “షేక్, మీ సమాదానం నాకు నచ్చలేదండి!” అన్నాను. దానికి కారణం కూడా వివరించ సాగాను. “ఈ ప్రాంతానికి దగ్గరలోనే ఒక పార్వత మున్నది. ఐదువేల సంవత్సరాల క్రితం దేవుని యెడల తనకున్న విశ్వాసాన్ని సూచిస్తూ బలిగా అర్పించేందుకు అబ్రహాము తన కుమారుణ్ణి పైకి తీసుకెళ్ళాడు. ఆకధ గుర్తున్నదా?” గుర్తున్నదన్నాడు. “తన కుమారుణ్ణి కొండపైకి తీసుకెళ్లాడనేది అంగీకరిద్దాం” షేక్ సరేనన్నాడు. అతడు కుమారుణ్ణి చంపబోతుండగా దేవుడు ఆగమన్నాడు. తర్వాత దేవుడేమన్నాడు? షేక్ పలకలేదు. దేవుడు నేనే బలిపశువునిస్తానన్నాడు. “షేక్! మనం కూర్చున్న స్థలానికి చాలా దగ్గరలో కలవారి అనబడే ఓక కొండ ఉన్నది. రెండువేల ఏళ్ళ క్రితం దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. తన కుమారుణ్ణి కొండపైకి తీసుకెళ్ళాడు. కత్తి ఆగలేదు కుమారుణ్ణి బాలి యిచ్చాడు. మనం దేవుడిచ్చిన ఆ కుమారుణ్ణి  అంగీకరిస్తేనే గాని అధికారం, భూమి, పరపతికోసం మన కుమారులను, కుమార్తెలను ఈ లోకపు యుద్ధరంగాలకు అర్పించడం ఆగదు”.

అక్కడ నిశబ్ధం. సమావేశం ముగిసిందని ఆర్చి బిషపు ప్రకటించాడు. మేము వెలుపలికి నడిచాం. నేను మెట్లు దిగితుండగా ఆర్చి బిషపు న భుజంపై చేయి వేసి, “రవి! మీరు దేవుని మాటల్ని చెప్పారని” అన్నాడు. అదేనా ఆశ అన్నాను. ఐతే ముఖ్య అతిధి అతడే, నేను కాదు.

మేము కారు ఎక్కబోతుండగా, నా వెనుక ఎవరో వస్తున్న శబ్దం. షేక్ నా వద్దకు నడిచి వస్తున్నాడు. నన్ను వెనక్కి తిప్పాడు. నా శరీరం భయంతోటి వణికిపోతున్నది. ఇంతటితో న పని ముగిసిపోయిందని అనుకున్నాను. ఐతే అతడు నావైపు చూసి, “నీవు చాల మంచివాడివి జకరియాస్, మంచివాడివి అన్నాడు” కళ్ళతో నీళ్ళతో “మళ్ళీ కలుసుకుందాం అన్నాడు”. నా రెండు బుగ్గలపైన ముద్దు పెడుతూ.

జాన్, నేను ఈ విషయాన్ని మలేషియా, కౌలాలంపూరులో ఇస్లామికు యూనివర్సిటీ వారి ముందు కూడా చెప్పాను. పురాతన విద్యాలయం, ఇస్లామియ అధ్యయనాల స్కూలు అధికారియైన ఓక స్త్రీ, ఆమె పేరును నేను చెప్పను, క్రైస్తవ విశ్వాసాన్ని సమర్ధిస్తూ నేను యూనివర్సిటీ విద్యార్ధుల ముందు మాట్లాడిన తర్వాత ఆమె నాతో చెప్పిన మాటలను ఇక్కడ చెబుతున్నాను. అప్పుడు నాతోటి సహోద్యోగులిద్దరు ప్రక్కనే ఉన్నారు. ఇది అయుక్తం కాకపోతే, నేను కూడా మిమ్మల్ని బుగ్గలపై ముద్దుపెట్టుకునేదాన్ని. “మీరు వచ్చి ప్రసంగించినందుకు వందనాలు” అంది.

దీనిని వింటున్న మీకు, ఇప్పుడీ ప్రపంచం భయంకరంగా ఉన్నది. హత్యలు, చంపడం, ద్వేషం, ఎక్కడ చూసినా విధ్వంశం. యేసు ఎందుకు వచ్చాడో తెలుసుకోక పోతే. మన హృదయాలు ఎలా మరతాయనే సంగతిని ఎన్నడూ గ్రహించలేము. భూమి, అధికారం, స్థానం కోసం ఒకర్నొకరం చంపుకుంటుంటాం. ఆతర్వాత? తర్వాతితరం దాన్నంతా పాడు చేస్తుంది. కనుక మీరు యేసు చెప్పినట్లుగా జీవితంలో నడవాలి. అయన తన కృపా కనికరాలను బట్టి మీకు నిత్యజీవాన్ని దయచేస్తానని చెప్పాడు. ప్రార్ధన చేసి విశ్వసించండి. నేను చెబుతున్నాను. మీరు మనఃపూర్తిగా ప్రార్ధిస్తే, మీరొక నూతన పురుషునిగా, నూతన స్త్రీగా మారిపోగలరు. ఆయన ప్రార్ధనలకు జవాబిస్తాడు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    యేసు క్రీస్తుతో మీరు వ్యక్తిగత సంభందంలోకి ఎలా వచ్చారో చెప్పి దీన్ని ముగించాలని కోరుతున్నాను. అ తర్వాత మీరు మన ప్రేక్షకుల కొరకు ప్రార్ధన చెయ్యాలి, మీరు ఆవిధంగా ప్రార్ధించిన వెంటనే నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన మీలోనికి వచ్చాడు. అనుభవ పూర్వకంగా జ్ఞానయుక్తంగా యేసును తెలుసుకోగలిగారు. ప్రజలు అనుభవంలో క్రీస్తును తెలుసుకోవాలని కోరుతున్నారు. అలాంటిది దొరకదనుకుంటున్నారు. మీ సొంత అనుభవాలను వివరించండి.

డాక్టర్. రవి జకరయాస్:    చూడండి, ఇది కేవలం సిద్దాంతంకాదు. కేవలం జ్ఞానంకాదు. యేసు జీవితంలోకి వచ్చినప్పుడు, తలనుండి హృదయానికి ఉన్న పెద్ద వంతెనను దాటగలుగుతారు. పదిహేడేళ్ళ వయసులో క్రుపను పొందాను. నేను ప్రార్ధన చేసి యేసును జీవితంలోకి ఆహ్వానించాను. తేలికైన ప్రార్ధన. పాప క్షమాపణ నిచ్చి నన్ను పూర్తిగా మార్చమన్నాను. యేసు క్రీస్తు వెంటనే నన్ను తర్వాత మా నాన్ననూ మార్చివేశాడు. ఇదేలాంటి మార్పు మా జీవితంలోనూ కలగాలని ఆశిస్తున్నట్లైతే, తలలు వంచి నాతో ప్రార్ధించండి. మిమ్మల్ని మార్చివేయమని హృదయపూర్వకంగా ప్రార్ధించండి. వ్యక్తిగత ప్రార్ధన.

పరలోకమందున్న తండ్రీ, నీ పేరునుబట్టి వందనాలు. నీ క్షమాపణ నాకు కావాలి. నీ రక్షణ నాకు కావాలి. యేసు ప్రభువా! నా హృదయంలోకి వచ్చి నన్ను మార్చి, నీ సన్నిధితో నింపండి. నిన్ను వెంబడించడానికి సహాయము చేయుము. నిన్ను ఈ క్షణమే అంగీకరించి నా జీవితమును నీకర్పిస్తున్నాను. తండ్రీ నీకు వందనములు. యేసు నామములో, ఆమెన్!

డా. జాన్ అంకెర్బెర్గ్ :    రవి ప్రార్ధించినందుకు వందనములు. ప్రియులారా, మీరు ఈ విధంగా మనఃపూర్తిగా ప్రార్ధన చెయ్యాలి. బైబిలు మీకొక వాగ్దానానిస్తున్నది, “ప్రభువు నామమున ప్రార్ధన చేయువాడెవడో” వానికేమౌతుందని దేవుడన్నాడు? “రక్షింపబడును”. ఆయనను మీలో క్రియ జరిగించనివ్వండి. ఆయనను అనుభవ పూర్వకముగా తెలుసుకో గలుగుతారు.

వచ్చేవారం యూరపు కళాశాలలోని విద్యార్ధులు అడిగిన కొన్ని కఠినమైన ప్రశ్నలకు జవాబులను ఇక్కడ చర్చించబోతున్నాము. వచ్చేవారం రవి జవాబులను వినడానికి తప్పక చూడండి.

 

 

మరిన్ని టీవీ ప్రోగ్రామల్ని చుచెందుకు ఉచిత

FREE John Ankerberg Show App download చెసుకొండి

“Pray to Accept Jesus Christ as Your Savior” @  JAshow.org

కాపీరైట్ 2015 ATRI.

 

 

జీసస్ సినిమా

క్రైస్తవుడగుట ఎట్లు?

నీవెలా క్రైస్తవు డవగలవు? యేసును వెంబడించి ఆయన యందు విశ్వాసముంచువాడే క్రైస్తవుడు. దీనిని బైబిలు బహు సరళముగా తెలియజేయుచున్నది, కనుక నీవు క్రైస్తవుడవని తెలుసుకో గలవు. , ఇక్కడ నొక్కండి .

ఆడియో బైబిలు