పరలోకం-అది ఎలా ఉంటుంది? సిరీస్ 2, కార్యక్రమం 3.

పరలోకం-అది ఎలా ఉంటుంది? సిరీస్ 2,

కార్యక్రమం 3.

 

ఈ రోజు John Ankerberg Show లో, Gallup Poll సర్వే ప్రకారం 77 శతం మంది మరణం తర్వాత పరలోకం వెళ్తామని తలిస్తే 6 శతం మంది మాత్రం తాము నరక్ వెళ్తామని తలుస్తునట్లు చెప్పింది.

కానీ పరలోకం వెళ్ళేవారిని గూర్చి యేసు క్రీస్తు బోదిస్తున్నప్పుడు “జీవమునకు పోవు మార్గము ఇరుకు. దాని కనుగొను వారు కొందరే. నాశనమునకు పోవుద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై యున్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు”. అని చెప్పారు.

నాశనమునకు పోవు దారి వెడల్పును, ఆ దారి విశాలమునై యున్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు

పరలోకానికి వెళ్తారని యేసు చెప్పిన కొందరిలో మీరున్నారా? మీరు పరలోకానికి వెళ్ళాక పోయినా, పరలోకానికి తప్పక వెళతామని పొరపాటున తలంచె అవకాశం ఉన్నదా?

జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నకు ఈ రోజు తెలుసుకో బోతున్నారు; చనిపోయి మీరు పరలోకం వెళ్తారా?

ఈ రోజు మన అతిధి, రచయిత Dr. Randy Alcorn, పరలోకం గురించి బోధించే ప్రసిద్ధ పండితులలో ఒకరు. మరణం తర్వాత పరలోకం వెళ్తారా? లేదా అనే దాన్ని మీరెలా తెలుసు కుంటారనే అంశాన్ని చెబుతారు John  Ankerberg Showలో ఈ ప్రత్యెక కార్యక్రమంలో మాతో కలుసు కొండి.

 

***

డా. జాన్ అంకెర్బెర్గ్ :   మా కార్యక్రమానికి స్వాగతం. పరలోకం గురించి బోధించే గొప్ప ప్రసంగీకునితో చర్చిస్తున్నాం. ఇతడి పేరు Dr. Randy Alcorn. దీన్ని వింటున్న మీలో పలువురు, మీరు తప్పక పరలోకం వెళ్తామని తలుస్తున్నారు. మీరు ఎందుకు, అలా తలుస్తున్నారని నేను మిమ్ములను అడుగు తున్నాను. Randy జనాదరణ పొందిన అనేక గ్రంధాలను వ్రాసారు.

మరి Randy  మీరు పరలోకంలోని అద్భుతాల్ని గురించి వ్రాసిన మీ పుస్తకాల్ని ప్రజలు చదివినప్పుడు, ఆ వినోదం, ఆ ఆనందం, మంచి ఆహారం, అక్కడి ప్రజలతో సహవాసం, నిత్యకాలం కొనసాగుతున్న ప్రేమ, సర్వ జగత్తును సందర్శించ గలగడం పరలోకం లోని అద్బుతాల గురించి చదివి తాము పరలోకం వెళ్తా మనుకుంటున్నారని చెప్పారు. ఐతే మీరు, ఈ ప్రజలతో  ఈ సంగతుల్ని చర్చించి నప్పుడు వారు వేల్లరనే సంగతి మీకు అర్ధమౌతుంది. ఎందుకంటే వారు దేవుని ఆహ్వానాన్ని తిరస్కరించారు. దేవుని ఆహ్వానమంటే ఏమిటి?

డా. రాండీ అల్కార్న్,:    గొఱెపిల్ల జీవ గ్రంధములో తమ పేర్లు వ్రాయబడని వారు పరలోకం వెళ్ళారని లేకహనం మనకు చెబుతున్నది. వారు నిత్య నరకానికి వెళతారు. మరి గొఱెపిల్ల జీవ గ్రంధములో మీ పేరు వ్రాయబడాలంటే మీరిప్పుడు ఏంచెయ్యాలి?

మనకు ఒక ఆహ్వానం ఇవ్వబడిందని అందరికీ తెలుసు. “రానిమ్ము, ఇచ్చయించు వానిని జలమును ఉచితముగా పుచ్చుకొన నిమ్ము”

ఇది ఇవ్వబడుతున్నది. నా స్నేహితురాలు Rutanna Metzgar వృత్తి రీత్యా గాయకురాలు. ఆమె తన భర్తతో కలిసి ఒక ధనిక వివాహానికి వెళ్ళింది. అక్కడ ఆమెను పాటలు పాడమన్నారు ఇది నిజంగా గొప్ప ఘనత.

Seattle నగరం లోనే చాలా ఎత్తైన సుందర భవనంలో ఈ పెండ్లి జరిగింది. దాని తర్వాత అతి వైభవంగా వ విందు ఉన్నది. సుప్రసిద్ధ Philharmonic సంగీత బృందం వచ్చి ప్రదర్శన ఇవ్వ బోతున్నది. వివిధ దేశాలనుంచి రుచికరమైన ఆహారం పానియాలు తెప్పించారు.

ఆమెకెంతో సంతోషం. వారు వివాహానికి వెళ్ళారు. వేదిక ఎక్కింది, పాటలు పాడింది. ఏంటో చక్కగా పాడింది. ఎంతో చక్కగా పాడింది. ఆ తరవాత మెట్లు ఎక్కి ఆ భోజన విందు జరగబోతున్న హాలు వద్దకు వెళ్ళారు.

ఖరీదైన దుస్తుల ప్రజలు, Tuxedos ధరించిన సంగీత విద్వాంసులు, ఘుమ ఘుమల భోజనం అద్భుతంగా ఉంది. మీరు వరుసలో నుల్చున్నారు. ఆ ద్వారంలోంచి అవతలికి వెళ్ళాలి.

ఆకదొక పెద్ద వేదిక ఉన్నది. దానిపై తెరచి ఉంచిన పుస్తకం ఉన్నది. ఒక వ్యక్తి అక్కడ నిలుచుని వచ్చిన వారందరి పేర్లు పుస్తకంలో పరిశీలిస్తున్నాడు. వీళ్ళు దగ్గరకు వెళ్ళారు, లోపలి వెళ్లాలని ఆమెకు ఆతృత, ఆమె “నా పేరు  Rutanna Metzgar, ఇతను నా భర్త Roy”అంది.

అతడు పేర్లను పరిశీలిస్తూ ‘M’వరకు వచ్చాడు spelling చెప్పండి అన్నాడు. ఆమె M-E-T-Z-G-A-R అంది , క్షమించండి మీ పేర్లు దీనిలో లేవు.

ఆమె, “చూడండి, నేను గాయకిని. ఈ పెండ్లిలో నేను పాటలు పాడాను”అన్నది. ఐతే అతను, “ఐనా, madam, మీరు గాయని ఐనా కాకున్నా లోనికి అనుమతి లేదు. మీ పేరు దీన్లో ఉండాలి. లేకుంటే లోనికి పంపించము. మీ పెరిక్కడ లేదు క్షమించాలి” అన్నాడు.

అతడు ఒక వ్యక్తిని పిలచాడు. అతడు ఈ పనికోరకే ప్రత్యేకంగా ఇలాంటి వారిని లిఫ్టులో క్రింద గారేజీ వరకు తీసుకెళ్ళి వదిలి పెట్టేందుకు అక్కడ నిల్చుని యున్నాడు. వారు క్రిందికి వెళ్ళారు, ఎంతగా అవమానపు విభ్రాంతికి లోనయ్యారో చెప్పలేను. కారులో కూర్చున్నారు, ఆ తరువాత తిరిగి తమ ఇంటి వైపుకు, Portland ప్రాంతానికి వెళ్తున్నారు. Roy, Ruuthanna ను చూచి, “ఎందుకు ఇలా జరిగింది” అనడిగాడు.

ఆమె, ” ఆహ్వానంలో ‘జవాబివ్వండి’అనే మాట ఉన్నది. ఐతే, దీన్లో నేను గాయకిని. నేను వస్తున్నానని చెప్పాల్సిన పని లేదు, ఔనా?”.

తెలపాల్సిన పనిలేదనుకున్నాను. వారి ఆహ్వానానికి జవాబుగా నేను వస్తున్నానని తెలిపి ఉండ వలసినది.

ఈ అనిభావంలోంచి ఆమే తెలుసుకున్న సంగతి, “చూడండి, ఇక్కడ నాకు కొంచెం ఆదరణ కలిగించిన సంగతి కూడా ఒకటున్నది. ఎందుకంటే జీవితంలో ఎంతమంది యసు క్రీస్తు వద్దనుండి ఇలాంటి ఆహ్వానాన్ని అందుకుంటారు?”.

వేల చెల్లించ బడింది. వారు ఏమీ చేయాల్సిన పనిలేదు- అంగీకరించడమే. అక్కడికి వెళ్లి నేను గాయకినని చెప్పుకుంటే అనుమతి లభించదు. లేక తాము కలిగియున్న వాటిని, తమ తలాంతులను అక్కడ ప్రదర్శిస్తే అనుమతి లభించదు. కాని కేవలము ఔను, అని చెబితే చాలు.

కాని ఆమె, “నేను ఔను అని చెప్పడానికి సమయం కేటాయించలేదు, నాకు తీరిక లేదు. అది అవసరమనుకో లేదు అన్నది”.

డా. జాన్ అంకెర్బెర్గ్ :   ప్రియులారా, వినండి. దేవుని ఆహ్వానాన్ని ఎలా అంగీకరించాలో తెలుసుకోవాలంటే, మీరు దేవుడు చెప్పిన మాటలని వినాలి.

మిమ్మల్ని గూర్చి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని సంగతులున్నాయి. అవి సత్యాలని మీరు గుర్తించాలి. దేవుడు మీకోసం చేసిన పనినీ, తెరుస్తున్న తలుపులను గుర్తించాలి. దీన్ని నెమ్మదిగా, ఒక్కొక్క మెట్టుగా చర్చిద్దాం.

దేవుడు మొదటిగా మనకు చెడు వార్తను తెలుపుతున్నాడు. “అందరును పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు”అని ఈ వచనంలో చెప్పాడు.

బైబిలు అందరు అంటున్నప్పుడు, అందులో నీవు నేను అందరమూ ఉన్నామా? ఔను!

Randy, కష్టం కదూ?

డా. రాండీ అల్కార్న్,:    చూడండి, దేవుని లక్షణములు అప్రిమితములని మన మేరుగుదము, ఎడుకంటే ఆయనకు హద్దులు లేవు. ఆయన అతిపరిశుద్ధుడు, అందుకే “నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని” వ్రాయబడింది.  అలాంటి స్తాయిలోనే జీవించాలి. యాకోబు పత్రికలో ధర్మశాస్త్రములోని ఒక ఆజ్ఞను మీరినను, అన్నిటిలోనూ అపరాదులమే అని యున్నది.

మనము ఏంటో మంచి మనుష్యులమని చెప్పుకుంటాం, మన మంచి తనాన్ని గొప్పగా ప్రకటించుకుంటుంటాం. మనము వాస్తవాన్ని తప్పకుండా గుర్తించాలి. ఒక్కసారైనా తప్పు చేసుంటాం. జాగ్రత్తగా గమనిస్తే ఈ రోజు అనేక తప్పులు చేశామని గుర్తించగలం.

మన మొత్తం జీవితంలో చేసిన తప్పుల్ని లెక్కించి చూస్తే అనేక వేల తప్పుల్ని చేసామని గుర్తించ గలం. మహిమను పొందలేక పోతున్నాము.

ఒక పాత ఉదాహరణ యున్నది, ఐతే చక్కని ఉదాహరణ, అందరు పశ్చిమ సముద్రానికి వెళ్లి, HAWAIకు ఈదుకుంటూ వెళ్లేందుకు తీరాన నిల్చున్నామనుకోండి.

మనలో కొందరు తొమ్మిది మీటర్ల దూరం ఈది ఆ తరువాత మునిగిపోతారు. కొందరికి ఈత కొట్టడమెలాగో కూడా తెలియదు కనుక ఆ కొద్ది దూరం కూడా ఈద లేరు. మరికొందరు ప్రయత్నించి 190 మీటర్లు ఈదగలరేమో, కొందరు ఒకటిన్నర లేక మూడు కిలోమీటర్లు ఈదగలరేమో, 16 కిలోమీటర్లు ఈదటం పలువురికి అసాధ్యం.

ఐతే, సముద్రాలను ఈదుకుంటూ దాటే గజ ఈతగాళ్ళు కూడా ఉన్నారు- ఇంగ్లీషు చానెల్ను కూడా ఈదే గజ ఈతగాళ్ళు మనలో ఉన్నారు. వారెంత దూరం వెళ్తారు? నాకు తెలియదు.

ఎవరైనా 60 లేక 80 కిలోమీటర్లు ఈదగలరేమో నాకు తెలియదు. ఒక సంగతి చెబుతున్నాను. వీరు HAWAI కి కనీసం పొలిమేరల్లో కైనా చేరుకోలేరు. ఒకవేళ మీరు దేవుని మంచితనమును బట్టి పరిశీలించినా మనం లెక్కకు రాము, అందరం పాపం చేసి దేవుని మహిమను పొందలేకున్నాము.

స్వశక్తితో దాన్ని పొందలేము. స్వశక్తితో దేవుని పరిశుద్ధతను చేరుకోలేము. మనల్నిలా వదిలేస్తే నిరీక్షణ లేని వారమౌతాము.

డా. జాన్ అంకెర్బెర్గ్ :   “పాపానికి జీతం మరణ” మని మీరు గుర్తించాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం చేసిన పాపానికి తప్పక శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష మరణమే దేవుని నుండి విడి పోవడమే.

“దేవుని  వారము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవమని” దేవుని వాక్యం చెబుతున్నది. “పాపానికి జీతం మరణము” మరియు ఈ సుందర పరలోకంలో ఉండకుండా దేవునితో నిత్యకాలం వియోగము వంటి విషయాలను గురించి వివరించి చెప్పండి.

డా. రాండీ అల్కార్న్,:    మరణం ఉన్నది, జీవం ఉన్నది. మరణానికి వ్యతిరేకం జీవం. జీవమంటే బ్రతకడమే కాదు పరలోకంలో అందరూ నిత్యకాలం జీవిస్తారని వాక్యం చెబుతుంది.

యోహాను 5 అధ్యాయం జీవపు పునరుత్థానమునకును, తీర్పు పునరుత్థానమునకును కొందరు లేప బడుదురని చెబుతున్నది. నిత్య కాలం నిలిచే మరణానికి వ్యతిరేకంగా నిత్య కాలం జీవం నిలుస్తుంది.

మనకు తగిన ఫలితం రావాలంటే నిత్య మరణం రావాలి. మనం యేసు వైపునకు తిరిగి, ఆయన మనకి చేసిన పనిని నమ్మాలి, దేవుని కృపావరము యేసు క్రీస్తు ప్రభువు నందు నిత్య జీవము. సంతోషంలో, వేడుకలలో, ఆరాధనలో మనము ప్రేమించే దేవునితోను ప్రజలతోను కలిసి అద్భుతమైన లోకంలో నిత్యం నివసించేందుకు ఇది ఒక్కటే మార్గం.

క్రీస్తు ఇచ్చిన కృపా వరం ద్వారానే ఇది సాధించగలము.

డా. జాన్ అంకెర్బెర్గ్ :   ప్రియులారా, ఇది చాలా తీవ్రమైన అంశం. మేము ఇప్పుడొక చిన్న విరామం తీసుకొని ఆ తరువాత మరలా వచ్చి ఆ బహుమానం గురించి మాట్లాడబోతున్నాము. ఇది ఉచితం, ఐతే దేవుడు గొప్ప వేల చెల్లించాడు. దేవుని ఈవిని మనం అంగీకరించడం యెంత ముఖ్యమో వివరిస్తుండగా మీరు వినాలి. చూస్తూనే ఉండండి విరామం తర్వాత వస్తాం.

******

డా. జాన్ అంకెర్బెర్గ్ :   మంచిది, మేము మళ్ళీ వచ్చాము. మనమిక్కడ పరలోకం గురించి Dr. Randy Alcorn తోటి చర్చిస్తున్నాం. ప్రజలు ప్రమాదంలో పడే అవకాశమున్న సందర్భమేమిటంటే, పరలోకం వెళతామని కళలు కనడం, వెళ్లాలని కోరుకోవడం, వారు మంచి పనులు చేశారు గనుక వారు తప్పకుండా పరలోకం వెళతారని అశిస్తూ ఉండటం.

చూడండి ఈ సందేశం నేరుగా సాతాను వద్దనుండే వచ్చిందని బైబిలు చెబుతున్నది. పాతాళం నుండి వచ్చింది. ఔను, దానికి కారణాన్ని మనం చర్చిస్తున్నాం. మనం పాపులమని దేవుడన్నాడు. పాపమునకు జీతముగా దేవునికి దూరమై మనం నరకానికి వెళతాం.

దేవుని కృపావరం మనకు ఉన్నది. దీన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడ బోతున్నాము. బైబిలు ఏమంటున్నాదో చూడండి, “దేవుడు తన ప్రేమను వెల్లడి పరచెను. మన మింకనూ పాపులమై యుండగా క్రీస్తు మన కొరకు చని పోయెను”. రోమా 5:8.

“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను” అనగా నిన్ను, నన్ను- ఆయనను విశ్వసించిన వారు, నశింపక నిత్య జీవము పొందునట్లు తన అధ్వితీయ కుమారుని అనుగ్రహించెను. Randy, కృపావరాన్ని మనకిచ్చేందుకు ఆయన ప్రాణాన్నే అర్పించాడు. దీన్ని వివరించండి.

డా. రాండీ అల్కార్న్,:    చూడండి, ఇంకా ఏమి చేయమని మనం ప్రభువును అడగగలము? పరిపూర్ణ పరిశుద్ధత కావాలని ఆయన  తున్నందున, భళి పశువు ఎలాంటి పాపము లేకుండా,  పరిపూర్ణ పరిశుద్ధత కలిగి యుండాలి.

క్రీస్తు తప్ప మరెవరు ఈ పని చేయగలరు? దాన్ని మనం ఊహించలేము. దేవదూత ఈ వేల చెల్లించలేడు. దూతకు పరిమితులున్నవి. మనిషి కూడా ఆ వేల చెల్లించలేడు, పరిమితులే కాక అతడు పతనమై పోయాడు.

యేసు క్రీస్తు మాత్రమే- ఔను, ఆయన మానవుడు, మానవ రూపంలో ఉన్న దేవుడు- ఆవెల చల్లించ గలడు- ఆయన చెల్లించాడు. ఆ వరానందిస్తున్నాడు.

మనం ఇతరులు ఇవ్వజూపుచున్న బహుమతిని చూసి “నాకు దాన్నందుకునే అర్హత లేదు. దైవ కృపకు అనర్హుడను” అనవచ్చు.

ఔను, నిజమే. నిజంగా, మీరు దానికి అర్హులైతే, దాని అవసరం  ఉండదు. దీన్ని అందుకునే అర్హత మీకు లేదు. ఆయన ఇస్తుండగా మీరు గర్వాన్ని దిగ మ్రింగి దానిని అందుకుంటారా? ఎందుకు అందుకోరు?

మీరు మరొక దేశంలో భందీగా ఉన్నారనుకోండి. మిమ్మల్ని రక్షించేందుకు సైనికులు హెలికాఫ్టర్ లలో వచ్చి చేతినందిస్తూ “ఇదిగో మీరు హెలికాఫ్టర్లోకి ఎక్కితేచాలు మీ చేతినందించండి” అంటారు.

వారు మీవైపు చేయి చస్తుండగా “ఏమో, మీరు నన్నీ చరలోనుంచి భద్రంగా తప్పిస్తారో లేదో అనుమానమే” అని మీరంటే, మీకు మరొక దారి ఉన్నదా? వెళ్ళకుండా అక్కడే నిలిచి పోతారా? మనకు ప్రత్యామ్నాయ మున్నదా? వచ్చిన సైనికుల కంటే దేవుడే మనకు అధిక రక్షణనిస్తాడు.

అంశమేమిటంటే,మీరున్న పరిస్థితిలోని తీవ్రతను మీరు అర్ధం చేసుకుంటే, వెంటనే చేతిని పైకెత్తి ఆ బహుమతి నందుకుంటారు. ఐతే, మీరు అర్హులని సైనికులు మా వద్ద కొచ్చారా? లేదు. వారు ప్రాణాల్ని తెగించి వచ్చారు. వారి ప్రాణాలూ మీ ప్రాణాలంత విలువైనవే. ఐనా నిన్ను రక్షించేందుకు వచ్చారు.

నీయిష్టం. చేతిని పైకెత్తి ఆ బహుమతినందు కుంటావా? ఒక సంగతి తెలుసా? రక్షించే దైవాత్మ యొక్క శక్తి తప్ప మనలో ఇక వేరే ఎలాంటి శక్తీ లేదు.

విశ్వసించేందుకు కూడా మనకు శక్తి లేదు. దేవుడు విశ్వసించమనీ, చేతులు చాప మనీ చెబుతూ, కృపతో అనుమతి నిస్తున్నాడు. కనుక ఇది మన గొప్ప కాదు. ఆయన ఘనతయే. మనకొరకు చేయవలసినదంతా చేసాడు.

మనమిక చేతులు చాపి “మీరిచ్చిన ఈవిని అందుకుంటున్నా మని చెప్పడమే”.

డా. జాన్ అంకెర్బెర్గ్ :   ఔను, ప్రియులారా, మీలో కొందరిప్పుడు దీన్ని గురించి ఆలోచిస్తున్నారు. నీవు పాపివి అని గుర్తించావు. దేవుదిస్తున్న వరాన్ని గుర్తించి Randy చెబుతున్న అంశాన్ని గ్రహించావు. దేవుడు నీతో మాట్లాడు తున్నాడు లేకపొతే నీవు ఈ సంగతినే అర్ధంచేసుకో లేవు. తర్వాతి భాగానికి నీవు సిద్ధపడాలి.

క్రియల వలన కాదు, విశ్వాసం వల్లనే అని బైబిలు పలుమార్లు చెప్తున్నది. సరే, మనకు క్రీస్తు యెడల విశ్వాసముండాలి. క్రీస్తును మనం విశ్వసించాలి. క్రీస్తును మనం నమ్మాలి. విశ్వాసమనే పదానికి అర్ధం ఏమిటి? విశ్వసించానని నాకెలా తెలుస్తుంది?

డా. రాండీ అల్కార్న్,:    విశ్వాసం మన విషయంలో వాస్తవమనుకుంటున్నాను. కొందరు ప్రజలను మనం విశ్వసిస్తాము. కొందరు మన యెడల చేసిన వాగ్దానాలను పూర్తిగా నమ్ముతాము. మీరు చేతులను అందిస్తే ఆ సైనికులు మిమ్మల్ని రక్షిస్తారని మీరు నమ్మాలి.

మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు అది మీ బరువును మోసేటంత దృడంగా ఉన్నదని నమ్మి దానిలో కూర్చోవాలి. ఈ పని చేస్తే ఇంత జీతమిస్తానని చెప్పిన యజమాని మాటల్ని నమ్మి మీరు పనిచెయ్యాలి. నమ్మకం అనేది మనకు క్రొత్త కాదు.

ఐతే మనమొక సంగతి గుర్తించాలి కొన్ని సార్లు, ఈ జీవిత కాలంలో మన నమ్మకాలు తప్పు కావచ్చు. విశ్వసించిన వారు మోసం చేస్తే మన చేతులు కాలవచ్చు. లోకంలో కొన్నిసార్లు ప్రజలు ఇచ్చిన మాటను నిలుపుకోరు. ఐతే దేవుడు వాగ్దానాన్ని తప్పడు.

దేవునికి సమస్తం తెలుసు. ఆయన నిజాయితీగా “ఇదిగో నువ్వు పాపంలో ఉన్నావు. దీన్లోంచి రక్షించేందుకే నా కుమారుని పంపాను. నన్ను విశ్వసించమని అడుగుతున్నానని” చెబుతున్నాడు.

మనం దేవుని వైపు చూసి చెప్పాలి, ఆయనను నమ్మవచ్చునా? ఇది వేలాకోలమా? సృష్టికర్తయా? విమోచకుడా? మనం ఆయన వైపు చూసి నీవు నన్ను రక్షించ గలవని నేనుకోవడం లేదని చెప్పగలమా?

“నీవు నన్ను తగినంతగా ప్రేమించలేదని” యేసు హస్తాలను చూపుతున్నాడు. “చీలల గుర్తులను చూడండి ఇది మిమ్మల్ని ప్రేమించని దేవుని చేతుల్లగున్నాయా?” ఆయన విశ్వాసనియ్యుడు!.

టీనేజీలో ఉన్నప్పుడు నేను క్రీస్తును అంగీకరించాను. బాల్యంలో క్రైస్తవెత్తర కుటుంబంలో సువార్తను ఎన్నడూ వినలేదు.

తర్వాత సువార్తను విన్నాను. బైబిలు పటణం మొదలెట్టాను. క్రొత్త నిబంధనను చదివిన తరువాత, క్రీస్తును గురించి తెలుసుకున్నాను. ఆయనలోని సత్యాన్ని గ్రహించాను.

“ఈయనను నేను విశ్వసిస్తున్నాను” అని చెప్పాను. అప్పుడు నా పాపాలకు పశ్చాత్తాపపడి మోకాళ్ళ పైన వంగి, “నీకు సమర్పించు కుంటున్నాను”అన్నాను. అందుకు ఎన్నడూ పశ్చాత్తాపపడలేదు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :   దీనిని కొంచం లోతుగా చూద్దాం. పలువురు ప్రజలు క్రీస్తును విశ్వసించి నమ్ము తుంటారు. Mutual Funds లో పెట్టుబడి పెట్టడం లాంటిదది. దేవుని నమ్మాను మరొక పని కూడా చేస్తాను. కొన్ని సత్కార్యాలని చేయబోతున్నాను. క్రమంగా చర్చికి వెళతాను. ప్రార్ధన చేస్తాను. రోజూ బైబిలు చదువుతాను, సత్కార్యాలను చేస్తాను, పేదలకు దానం చేస్తాను.

ఇలాంటి సత్కార్యాల నెన్నిటినో చేస్తుంటారు. వీటిలో ఏదో ఒక పని వలన మరణం తరవాత, పరలోకం వెళ్ళగలమని ఆశిస్తుంటారు. మంచిదే, దేవుడు చెప్తున్నది ఇది కాదు. సత్కార్యాలేవీ చేయనటువంటి, తన ప్రక్కన సిలువపై నున్న దొంగతో “నేడు నీవు నాతోకూడా పరదైసులో ఉందువు”అన్నాడు. దానికి ఆధార మేమిటి? మరేదీ వద్దు, క్రీస్తు నందు విశ్వాసమే చాలు ననడమేమిటి?

డా. రాండీ అల్కార్న్,:    యేసుతో మరొక దాన్ని కలిపితే, ఆ మరొక దానిపై మనం ఆధార పడవలసి వస్తుంది. దాని కోసం ఎంతో శ్రమ పడతాం. దానికి విరాలాలనిస్తాం దానికి స్వచ్చందంగా వెళ్లి శ్రమిస్తాం, ఏవేవో సత్క్రియలు చేస్తాం.

మరొక పని, దాన్ని వదల మని యేసు చెబుతున్నాడు. యేసుతో మరొకటి, యేసు దాన్ని వదలమంటున్నాడు. యేసు మాత్రమే, ఎందుకంటే, యేసుతో మరొకటియుంటే అద్నతా మన ఘనతయే అంటాము. ఇతర పనులన్నిటినీ చేసేందుకు మనకు జ్ఞాన మున్నాడని చెబుతాం.

మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింప బడ్డారు. ఇది మీవలన కలుగ లేదు, దేవుని వారమే. క్రియలంటూ ఎవ్వరూ అతిశయించ కూడదు. మనం అతిశయిస్తాం. మనము క్రియలను చేసినట్లయితే అతిశయిస్తాం.

దేవుడు క్రీస్తునందు మనకొరకు చేసిన దాన్ని బట్టి మనం ఆయనను స్తుతించాలి.

డా. జాన్ అంకెర్బెర్గ్ :   క్రీస్తు నందలి విశ్వాసం వల్లనే మనం రక్షించ బడ్డామని బైబిలు చెబుతున్నది. ఐతే పశ్చత్తాప పడాలని కూడా చెబుతున్నది. పశ్చత్తాపాన్ని ఎలా నిర్వచించాలి? ఆ పని చేసానని ఎలా గుర్తించాలి?

డా. రాండీ అల్కార్న్,:    పశ్చత్తాపమనగా మనసు మార్చు కోవడం, ఆలోచనలను మార్చుకోవడం. నీవు చేసిన పనుల్ని బట్టి చింతించడం, ఇలాంటి చెడు కార్యాలను మరలా చేయకుండా సహాయ పాడమని ప్రభువుని వేడుకోవడం.

దీనిలో మరొక వేల మరలా తప్పుచేసి, పశ్చత్తాపపడి, క్షమాపణ కోరితే ఆయన మరలా క్షమిస్తాడనే నమ్మకమూ ఉన్నది. ఐతే నిజంగా క్రీస్తును విశ్వసించడమనగా, గుర్తుకు వచ్చిన పాపాలన్నిటినీ ఒప్పుకుని పశ్చత్తాపపడాలి.

దేవుడు మీ ఇతర పాపాలను తర్వాత గుర్తు చేయవచ్చు. ముఖ్యంగా ” నాకు మీరు కావాలి స్వశక్తితో చెయ్యలేను మీరు లేకుంటే అసమర్దున్డ్ని” అని చెప్పడం.

నీ అసమర్ధతతో పాటు, క్రీస్తులో దేవుని సంపూర్ణత కలిసి నీలో పశ్చత్తాపం వస్తుంది. దీన్నెంతగా గుర్తిస్తే, ఆ మార్పు అంట పరిపూర్ణంగా ఉంటుంది.

డా. జాన్ అంకెర్బెర్గ్ :   Randy, ఇప్పుడు మీరు మాకోరకు ప్రార్ధించాలి. ఎందుకంటే ఇక్కడ మా ప్రేక్షకులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ప్రజలు “దేవుని వారం కావాలి. దేవుని ఆహ్వానాన్ని నేను తిరస్కరించను. ఎందుకంటే నేను పరలోకం వెళ్ళాలి” అనుకుంటున్నారు.

ఒకవేళ దేవుడు, “నిన్ను ప్రేమించి నీకు దీన్ని నీకు ఇవ్వబోతున్నాను నీవు రావాలి” అన్నాడంటే, నేను రానని చెప్పను. వీరికి ప్రార్దించడం తెలియదు. ప్రార్ధనలో మీరు వీరిని నడిపిస్తూ, మీరు చెప్తున్న మాటల్ని వీరు మరలా వల్లిస్తుండగా, యేసు ప్రభువు వీరి జీవితాల్లోకి వచ్చేలా వీరిని పార్దనలో నడిపించండి.

డా. రాండీ అల్కార్న్,:    యేసు క్రీస్తు ప్రభువా నీవే వాస్తవమని నమ్ముతున్నాను. నీవు సిలువను భరించి నా పాపాల కోసం శ్రమ పడ్డావని నమ్ముతున్నాను.

నేను పాపినని నిత్య నరకానికి పాత్రుదానని నమ్ముతున్నాను. ఐనా నిత్య జేవానిస్తానన్న నీ మాటను నమ్ముతున్నాను.

మరి ప్రభువా! నా అవిశ్వాసాన్ని తొలిగించండి. నేనిప్పుడు చెబుతున్న మాటలను మనఃస్పూర్తిగా చ్బుతున్నాననే నమ్మికను కలిగించండి. మీరు నాకిస్తున్న వరాన్ని అంగీకరించా దళిచాను.

క్రీస్తు నాకొరకు చేసిన పని కాక, నేను స్వశక్తితో, క్రియలతో దేనినీ సంపాదించుకోలేనని తెలుసు కున్నాను. ఇది ఆయన వలననే సాధ్యం. యేసే, మార్గం సత్యం జీవమని తండ్రి యొద్దకు ఆయన ద్వారా మాత్రమె వెళ్ళగలమని గుర్తించాను.

ప్రభువా! మీరిచ్చిన వరాన్ని అంగీకరించాను మీరు నా జీవితంలోకి ప్రవేశించి, మీరు నా హృదయంలో నివసించాలని,నీ నామ ఘనత మరియు మహిమ కొరకు,  నేను మారిన జీవితం జీవించేందుకు సహాయ పడాలని పార్దిస్తున్నాను.

నా క్రియల వలన కాక, నా కొరకు మీరు చేసిన త్యాగం వలన, మీ సన్నిధిలో నిత్య జీవాన్ని నేను అనుభవిస్తున్నానని, మీరిచ్చిన వాగ్దానాన్ని నమ్ముతున్నాను. యేసు నామంలో అడుగుతున్నాను. ఆమెన్!.

డా. జాన్ అంకెర్బెర్గ్ :   మరి ప్రియులారా, మీరు ఇలా ప్రార్ధించి యుంటే, Randy , వారు పరలోకం వెళ్తున్నామని గుర్తించాలని దేవుడు ఆశిస్తాడా?

డా. రాండీ అల్కార్న్,:    ఔను, తప్పక ఆశిస్తాడు. “మీకు నిత్యజీవమున్నదని గ్రహ్న్చు నట్లు నేను దీనిని మీకు వ్రాయుచున్నాను”. దేవుడు తప్పక మీ జీవితంలోక్రయ చేసి మీరు బహుగా ఫలిన్చునట్లునూ, మీకు రక్షణ దొరుకునట్లునూ, విశ్వాసంలో మీరు ఎదిగేలా సహాయ పడతాడు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :   Randy, మీరు అంత దూరంలో ఉన్న Oregon నుంచి, ఈ కార్యక్రమాలను నడిపించేందుకు Chattanoogaa వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎన్నో అంశాలను పరిశీలించారు. ఈయన వ్రాసిన పుస్తకాలు మీరు చదవాలని సిఫార్సు చేస్తున్నాను.

ఇంట సమాచారాన్ని మాతో పంచుకునందుకు మీకు కృతజ్ఞతలు.

డా. రాండీ అల్కార్న్,:    నాకిది సంతోషం John , ఇక్కడికి రావడం ఎంతో సంతోషం.

డా. జాన్ అంకెర్బెర్గ్ :   ప్రియులారా! వచ్చే వారం మరలా తప్పక చూడండి.

 

 

 

 

 

మరిన్ని టీవీ ప్రోగ్రామల్ని చుచెందుకు ఉచిత

FREE John Ankerberg Show App download చెసుకొండి

“Pray to Accept Jesus Christ as Your Savior” @  JAshow.org

కాపీరైట్ 2015 ATRI.

 

 

 

இயேசு திரைப்படம்

கிறிஸ்தவராவது எப்படி

நீங்கள் எப்படி கிறிஸ்தவராக முடியும்? கிறிஸ்தவர் என்பவர் இயேசுவை நம்பி அவருடைய பாதையை பின்பற்றுகிறவனாக இருக்கிறான். நீங்கள் கிறிஸ்தவர் என்பதை அறிந்துகொள்ள வேதம் உங்களுக்கு நேர்த்தியான பதில்களை அளிக்கிறது. கிளிக் செய்யவும்.

ஆடியோ பைபிள்

சீர்திருத்த பாடநெறி