పరలోకం-అది ఎలా ఉంటుంది? సిరీస్ 2, కార్యక్రమం 2.
పరలోకం-అది ఎలా ఉంటుంది? సిరీస్ 2,
కార్యక్రమం 2.
ఈ రోజు John Ankerberg Show లో- పరలోకంలోఉన్న విశేష మేమిటి? మీరు Disney Land కు గాని, ASPEN లో మంచు స్కీయింగ్కు గాని, యూరోపేకు గాని వెళ్ళాలని ఆలోచిస్తుంటే వాటి వివరాలు తెలిపే కరపత్రాలను, website లను ముందుగానే పరిశీలిస్తుంటారు, సందర్శక గ్రంధాలు అక్కడికి వెళ్ళాలనే కొరికెను ఎక్కువ చేస్తుంటాయి.
ఐతే పరలోకానికి నడిపించే గ్రంధం బైబిలు. దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశమును మనం చూడబొతున్నామని బైబిలు చెబుతున్నది. ఐతే ఈ పరలోకం లేక బైబిలు చెబుతున్న క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీ సొంతం కాబోతున్నట్లయితే పరలోకం గురించి మీకు ఏమి తెలుసు? మీరు నిత్యత్వాన్ని గడప బోతున్న స్థలంలో మీరు ఏమి చెయ్యాలని, ఏమి చూడాలని, ఎలాంటి అనుభవాలను పొందాలని ఆశిస్తున్నారు?
ఈనాటి మన అతిధి పరలోకం అనే ప్రక్యాత పుస్తకం రచించిన Dr. Randy Alcorn. మన భవిస్యత్ గృహం- పరలోకంలో క్రైస్తవుల కొరకు దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన అంశాల నీయన వివరిస్తారు. John Ankerberg Show లోని ఈ ప్రత్యెక కార్యక్రమములో మాతో కలుసుకోండి.
***
డా. జాన్ అంకెర్బెర్గ్ : మా కార్యక్రమముకు స్వాగతం. పరలోక మనే అంశాన్ని గురించి వివరించే ప్రఖ్యాత బోధకుడు Dr. Randy Alcorn తో ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఈ రోజు మనమొక ఆసక్తి కరమైన అంశాన్ని గురించి చర్చించ బోతున్నాము.- అది పరలోకం గురించి మీ బిడ్డలు గాని, మీ మనుమలు గాని అడిగిన ప్రశ్నలకు మీరు సరైన జవ్వబు ఎలా ఇస్తారు? నిజాయితీగా చూస్తె ఇలాంటి ప్రశ్నలు మీ జీవితంలో ఇంతకూ మునుపే ఇతరులు మిమ్మల్ని అడిగినట్లు గుర్తిస్తారు.
మరి, Randy, దానిని వివరించండి. పరలోకం గురించి మీరు వ్రాసిన బాలల పుస్తకాలు ప్రజాదరణ పొందాయి. వివిధ రకాల సందర్భాలలో పరలోకమనే ఈ అంశం ఎలా చర్చలకు వస్తుంటుందో, మీరు మాకు వివరించాలి.
డా. రాండీ అల్కార్న్,: పిల్లలకు కుతూహలం అధికం. యేసు మనల్ని పిల్లల్లా ఉండమన్నాడు. బాలలు ప్రశ్నలడుగు తుంటారు. తప్పక జవ్వబు చెప్పాలంటారు. ఐతే, కొన్నిసార్లు మనం వారు అడిగిన దాని కంటే ఎక్కువ విషయాలను చెప్పుతుంటాము. వారి వయసునకు తగిన జవాబుల నివ్వాలి. నేనీ బాలునికి ఎంతవరకు వివరించాలని మీరలోచిస్తారు. వారు పరలోకాన్ని గురించి మంచి ప్రశ్నలడుగుతున్నారు. ఎందుకంటే, పరలోక మున్నదిని మనం చెప్పినప్పుడు వారు మన మాట నమ్ముతున్నారు. దేవుని మాటను నమ్ముతున్నారు. పరలోక మున్నాడని బైబిలు చెబుతున్నందువలన, అదేలాగుంటుందో తెలుసు కోవాలంటున్నారు. అక్కడేం జరుగుతున్నదో తమకేమౌతుందో తెలుసుకోవాలనే ఆశ.
డా. జాన్ అంకెర్బెర్గ్ : ఔను, వారి పెంపుడు జంతువు చనిపోతే, తాత, అమ్మమ్మ చనిపోతే, కొన్ని సందర్భములలో తల్లి లేక తండ్రి చనిపోతే, సోదరుడు లేక సోదరి చనిపోతే. నా బంధువుకు కవల పిల్లలు, ఇద్దరు బాలురకు 12 లేక 13 ఏళ్ళ వయసు రాగానే, ఇద్దరిలో ఒక పిల్లాడు చనిపోయాడు. నేను సమాది కార్యక్రమానికి వెళ్లాను. అంశమేమంటే, కొన్నిసార్లు చిన్న పిల్లలు మనల్ని ఈ విధంగా అడుగుతుంటారు. “అమ్మా, నాన్న, తాత, నానమ్మా పరలోకం గురించి చెప్పు”. అప్పుడు వారు ఏమని చెప్పాలి? పరలోకాన్ని ఎలా వివరిస్తారు?
డా. రాండీ అల్కార్న్,: నేను చెప్పాల్సిన మొదటి మాట- పరలోకంలో ఉండటమంటే ఎసులో ఉండటం. దాన్ని ఇంకొంచం భలంగా తండ్రి యగు దేవునితో పరిశుద్ధాత్మ యగు దేవునితో ఉండటం కంటే ఇది అధికమనవచ్చు. ఎందుకంటే యేసు మానవ రూపధారి. యేసు మానవుడయ్యాడు యేసును మనం తాకి చూసి తెలుసుకోగలం. ఆయన తిరిగి లేచిన తరువాత “నేను ఆత్మను కాను ఆత్మకు నాకునట్లు శరీరము, ఎముకలు ఉండవు” . అని చెప్పాడు. యేసు క్రీస్తు తమను ప్రేమిస్తున్నాడని, తమకోసం సిలువపై మరణించాడని వారు గుర్తించారు. ఆ సంగతి గుర్తించకపొతే, క్రీస్తు సువార్తను మనము వారికి వివరించి చెప్పాలి. వారు ఆ సంగతిని గుర్తిస్తే, ఆ సంగతిని నిమ్మితే పరలోకమనేది నిజముగా ఎంత నెమ్మది కరమైన ప్రదేశమో, వివరించి చెప్పాలి; అక్కడ మనం ఎసుతోటి ఉంటాం.
అంటే కాక, వారికంటే ముందు వెళ్ళిన యేసును ప్రేమించిన ప్రజలను వారు అక్కడ కలుసు కుంటారని చెప్పాలి. వారికి ఆ ప్రజలు ఎవరో తెలిసే ఉంటుంది. అనేక సందర్భాలలో ఇక్కడ జీవితంలో, ఎన్నడూ కలుసుకొని తాతనో, ముత్తాతనో అక్కడ పరలోకానికి, మీరు వెళ్ళినప్పుడు వారిని అక్కడ కలుసుకోగలరు. యేసు ప్రేమించే ఇతర ప్రజలను కూడా, ఒకరి నొకరు ఎన్నడూ నొప్పించు కోకుండా ఉండే పరలోకంలో కలుసు కోవడం సంతోషం కదా?
కనుక పరలోకం గురించిన అంశంలో అక్కడ ఏమున్నదని కూడా చెప్పాలనుకుంటున్నాను. పరలోకంలో ఉన్న సంతోషం, ఆనందం, నవ్వుల జీవితం గురించి మనం వారికి చెప్పాలి. ఈ లోకంలో వారు చేస్తున్న చెడు అంశాలు అక్కడ ఉండవని చెప్పాలి. పిల్లలకు ఇక్కడ T.V లో వార్తల్ని చూసే అనుమతి లభించక పోవచ్చు. వారు లోకానికి వెళ్ళగానే, మాటలు ఆ పేసి ఛానల్లు ఎందుకు మారుస్తారో వారికి తెలుసు. పిల్లలకు ఇదంతా ఎలా చెప్పాలి? వీరికి జ్ఞానం అధికం. ఈ లోకంలో అవినీతి అధికంగా యున్నదని వారికి తెలుసు. ఒంటరిగా వీధుల్లోకి వెళ్ళడం మంచిది కాదని వారికి తెలుసు. ఈ అప్పయం మరింతగా పెరిగి పోతున్నది. కనుక మన పిల్లలు మరియు మనవాళ్ళ మనసులలో ఈ ప్రపంచాన్ని గురించి అనుకూల మనస్తత్వాన్ని పెంచడమే మనకున్న సవాలు, ఇప్పుడున్న లోకాన్ని చూసి గాక, దేవుడు భవిష్యత్తులో ఈ లోకాన్నలా మారుస్తాడనే దానిపై మనం నిలబడాలి.
డా. జాన్ అంకెర్బెర్గ్ : బాలుడు, “పరలోకం ఎక్కడుంది నానమ్మా?”, “ఎక్కడుంది, అమ్మా?” అనడిగితే ఏం చెబుతారు?.
డా. రాండీ అల్కార్న్,: చూడండి, లేఖనాల్లో పరలోకం ఎక్కడో మనకు దూరంగా, పైన ఎక్కడో ఉన్నదనీ, మనకు ఏమంత దగ్గరగా లేదనీ చెప్పబడింది. అది ఉన్నది గాని దాన్ని మనం చూడలేము. పరలోకం మనం అనుకునే దాని కంటే చాల దగ్గరగా ఉండవచ్చునని నేను నా బిడ్డలకు మనవాళ్ళకు వివరించి చెబుతుంటాను. అది ఆ వైపున ఉండవచ్చు, అవతలి వైపున ఉన్నాది మనకు కనబడదు.
2 రాజులు గ్రంధంలో ఎలీషా ప్రార్ధన చేయగా సేవకుని కండ్లు ఎరువ బడినప్పుడు అతని చుట్టును అగ్ని గుఱ్ఱముల రధములు, దేవదూతలు ఉండటం చూసాడు. దేవుడు మనలో ఉన్నాడు. దేవుడు ఎక్కడో సుదూర ప్రాంతాలలో లేదు. ఐతే ఇక్కడ దగ్గరలో లేడు. ఈ సంగతిని మనం తెలుసు కోవాలి. ఎందుకంటే, దేవుడు పరలోకంలో ఉన్నా డన్నామంటే, దేవుడు క్రింద మనతో లేదని అర్ధం వస్తుంది. కనుక ఇలా చెప్పాలి, “దేవుడు పైన ఆకాశంలో ప్రత్యెక రూపంలో ఉన్నాడు. ఐతే, దేవుడు ఇక్కడ మనచుట్టూ కూడా ఉన్నాడు. ఆయన నీలో ఒక వ్యక్తిలా ఉన్నాడు”.
డా. జాన్ అంకెర్బెర్గ్ : ఒక చక్కని చిన్న పాప, మా ఉద్యోగులలో ఒకరైన తన తాతను అడిగింది,”మీకంటే ముందు నేను చనిపోయి పరలోకం వెళ్తే నన్నెవరు ఆహ్వానిస్తారు”.
డా. రాండీ అల్కార్న్,: దేవుని ప్రజలమైన మనకు పరలోకంలో లభించబోతున్న ఆహ్వానం గురించి రెండవ పేతురు చెప్తున్నది. ఇక్కడ యేసు క్రీస్తే స్వయంగా మనల్ని పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు. దాసుడు, యజమాని ముందుకు వచ్చినప్పుడు ఈ సంగతిని చూస్తున్నాము. “భళా నమ్మకమైన మంచి దాసుడా! నీ యజమాని సంతోషంలో పాలు పొందుము”. వీరిని యేసు మాత్రమె ఆహ్వానించినా అదెంతో తృప్తికరంగా ఉంటుంది.
ఐతే అక్కడ ఇంకనూ పలువురు ప్రజలుంటారు. కొందరు మనకు తెలిసిన వారు, కొందరు మనకు తెలియని వారు, అందరూ పరిచయమైపోతారు. ఏళ్ళు గడుస్తుండగా ఒకరొకరుగా, భూలోకంలో ఉన్న తాము ప్రేమించిన ప్రియులు, ఒకరొకరుగా పరలోకంలోకి వస్తుండగా వారు వీరిని ఆహ్వానిస్తుంటారు.
ఈ సంగతి పాపకు చెప్పండి. పార్టీకి అందరికంటే ముందుగా ఆ పాప వచ్చినట్లు, కుటుంబంలో అందరికంటే ముందు వచ్చినట్లు, తరువాత మిగతా వారు వస్తారు. మనం ఆలశ్యంగా వెళతాం. ఐతే, మీరు పార్టీకి ఆలస్యంగా వెళ్తారా, ముందే వెళ్తారా? పలువురు ముందుగా అక్కడికి చేరాలని ప్రయత్నిస్తారు. లేదు, వెంటనే చనిపోవాలని మనలో ఎవ్వరం ఆశించము. ముఖ్యంగా, యవ్వనులు అలా ఆశించరు. ఐతే చనిపోయినప్పుడు వారు పార్టీకి మొదట చేరతారు. నేను మరొక సంగతి చెప్పదలచాను, నా స్నేహితుడు Jerry, నాకు భాల్య స్నేహితుడు, మా హైస్కూల్ ఇరవైయవ సాంవత్సరిక సమావేశం తర్వాత చనిపోతుండగా,”నేనక్కడకి వచ్చే లోపల మంచి స్తలాన్ని చూసి, నాకు ఆ ప్రాంత మంతా చూపించ మన్నాను”.
డా. జాన్ అంకెర్బెర్గ్ : ఇంకో సంగతి చెప్తున్నా. మీ పాప వ్యాదిని పది చనిపోతూ ఉన్నదనుకోండి, ఆమె తల్లి రెండు గదులను ఉదాహరణగా చెప్పిన్ద్. ఆ ఉదాహరణను గురించి మరొక సారి చెప్పి అప్పుడొక ప్రశ్న అడగండి. మీరు మొదట చేరుకుంటే మిగతా మాలలు అక్కడ లేకుండా, తల్లి దండ్రులు ఎవ్వరూ అక్కడ లేకుండా, సోదరులు, సోదరీలు లేకపోతే వారికి ఒంటరి తనం కలగదా? భూమిపై తమ బంధువులకేమౌతుందో వీరు చూడగలరా?
డా. రాండీ అల్కార్న్,: ఈ కుటుంబమేంచేసిందంటే, పాప ఉన్న ఆసుపత్రి గదిలోంచి ఆమెను ప్రక్క గదికి తీసుకెళ్ళారు. రెండు గదులకు మధ్య తలుపున్నది. వారు “నువ్వు, ఆ గదిలోకి మొదట వెళ్తున్నావు. ఐతే యేసు అక్కడ నీతో ఉంటాడు, సరేనా?” అని చెప్పారు. చూడండి, యేసు మీతో ఉంటె మీకిక ఒంటరి తనం ఉండదు. తల్లి దండ్రుల్ని మరలా కలిసే దినం కోసం ఎదురు చూడొచ్చా అని మీరు అడగొచ్చు. చూడొచ్చు. నా ఆత్మను ప్రేమించే వ్యక్తితో ఉన్నాను. నా సృష్టి కర్తతో ఉన్నాను. తల్లి దండ్రులకంటే అధికుడైన వ్యక్తితో ఇప్పుడు నేనున్నాను. ఆయన నన్నెంతగానో ప్రేమించి తల్లి దండ్రులను ఇచ్చాడు.
కనుక, లేదు, వారోచ్చేలోపు ఒంటరితనం లేదు. తర్వాత ఒక్కొక్కరుగా వారు గదిలోకి వెళ్ళారు. ఒకరు లోనికి వెళ్లి తలుపును మూస్తారు. అనగా యేసు రెండవ రాకడ దీనికంటే మొదట వస్తే అందరూ ఒకేసారి లోనికి వేల్తారన్న మాట, లేదంటే ఒకరి తర్వాత ఒకరుగా వెళ్లి ఆమెను కలుసు కుంటారు.
సరే, ఆ పాపకు ప్రియులైన వారు ఎవ్వరో పరలోకంలో ఉంది వారికి భూమిలొ ఏంజరుగుతుందో తెలిసి ఉండవచ్చు. అక్కడి ప్రజలకు కొద్దిగా నైనా తెలిసి ఉంటుందనేందుకు ఆధారాలున్నాయి. ప్రకటన ఆరులో హతసాక్షులు “సత్యస్వరూపీ, మమ్ములను చంపిన వారికి ఎందుకు ప్రతిదండన చేయక ఉందువు” అంటున్నారు. వారు ప్రభువా నీవు తీర్పు తీర్చవా అనడంలేదు. ఎందుకు తీర్పు తీర్చక ఉందువని అడుగుతున్నారు. అనగా తీర్పు తీర్చలేదని వారికి తెలుసు. ఇది ఎలా తెలిసింది?
క్రింద భూలొకమ్లొ ఏం జరుగుతుందో వారు చూడగలరు, కనీసం కొంతవరకైనా. అంటే కాక లూకా 15 లో పోయిన నాణెం, తప్పి పోయిన గొఱె, తప్పి పోయిన కుమారుని విషయంలో, మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని వ్రాయబడి యున్నది. ఇక్కడి పదజాలం ఆసక్తికరంగా ఉన్నది. పాప పశ్చాత్తాప పడిన ప్రతీసారి, పరలోకపు దూతలు సంతోషిస్తారని, యేసు ఇక్కడ చెప్పి యుండవచ్చు. ఐతే అలా చెప్పడం లేదు. దేవదూతల యెడల సంతోషం కలుగునని వ్రాయబడింది.
ఐతే, దేవదూతల ఎదుట ఎవరు నివసిస్తారు? దేవుడు. కనుక దేవుడు సంతోషిస్తున్నాడు. దూతల సంతోషిస్తారా? తప్పక సంతోషిస్తారు. దేవుని సన్నిధిలో మరెవరు నివసిస్తారు? దేవుని ప్రజలు. చనిపోయిన మనకుటుంబ సభ్యులు, పలానా వ్యక్తి యేసు క్రీస్తును విశ్వసించాలని ఎంతగానో ప్రార్ధన చేసిన మనకుతుంబ సభ్యుడు. కనుక ఇది బలమైన సూచన. తమ ప్రియుల జీవితాలలో ఏర్పడిన ఈ ఆత్మా సంబందమైన మార్పును వారు చూడలేక పొతే పరలోకంలో వారు ఆ విధంగా సంతోషించరు కదా!.
డా. జాన్ అంకెర్బెర్గ్ : ఇప్పుడొక విరామం తీసుకుందాం. తిరిగి వచ్చిన తరువాత, మేము దయ్యాలౌతామా? దెవదూతలౌతామా? మా శరీరాలు ఎలా ఉంటాయి? పరలోకంలో సంతోషం ఎలా వస్తుంది, నాన్నా? అని పిల్లలు అడుగుతారు. మంచిది, మేము తిరిగి వచ్చిన తరువాత Randy ఈ ప్రశ్నలకు జవాబులు చెబుతారు. చూస్తూనే ఉండండి.
****************
డా. జాన్ అంకెర్బెర్గ్ : మంచిది, మేము మరలా తిరిగి వచ్చాం. మనదేశంలో పరలోకాన్ని గురించి బోధించే వారిలో నిపుణుడు Dr. Randy Alcornతో మాట్లాడుతున్నాం. మరి Randy, పిల్లలు తమ తల్లి దండ్రులను తాతలను అడిగే ప్రశ్నలకు మన మిక్కడ జవాబులను చెబుతున్నాము. మేమందరమూ వాటికి జవాబులిచ్చేందుకు మీరు సహాయ పడుతున్నారు. పిల్లలు మనల్నడిగిన ప్రశ్నలలో ఒకటి రెండి ప్రశ్నలు, “మేము దెయ్యాలుగా మారతామా, నానమ్మా, తాతయ్యా? మేము దెవదూతల మౌతామా అమ్మా, నాన్నా?” అప్పుడు మేము ఎలా గుంటాము? అప్పుడు మేము ఎలాంటి శరీరాలు కలిగి యుంటాము?
డా. రాండీ అల్కార్న్,: మొదటిగా, మనం దెయ్యాలు కాబోమని మనకు తెలుసు. దీన్ని గురించి పరలోకంలో కూడా ఎంతో కశ్చితంగా చెప్పబడింది. ప్రజలు దుస్తులు ధరించారని వ్రాయబడి యుంది. అనేక సంగీత వాయిద్యాలను గురించి కూడా ప్రస్తావించ బడింది. సితారా, వీణ, ఇంకా అనేక వాయిద్యాలు. ఖజ్జూరపు మట్టల్ని గురించి కూడా ప్రస్తావించ బడింది. దేవుని పరలోకంలో జీవ వృక్షం ఉన్నదని చెప్పబడింది. ఐతే పునరుత్థానం తరువాత, అక్కడ మనం నిత్యత్వంలో జీవిస్తాం గనుక చివరగా చేరుకునే పరలోకంలో పునరుత్థానంలో పరిపూర్నులుగా జీవించగలం.
ముఖ్యంగా ఈ విషయాన్ని పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పాలి. కనబడని ప్రేతాత్మగా మారబోతున్నామని బాలలు ఎవ్వరూ సంతోషింప కూడదు. వారు సృష్టించ బడింది అందుకు కాదు. పెద్దైన తర్వాత దెయ్యంగా మారాలని ఎవ్వరూ ఆశించరు. సంతోషంగా పరిగెత్తి, దూకి, తిని త్రాగుతూ, ఆడుకోవాలని పిల్లలు ఆశిస్తుంటారు. ఔను. అది నిజమే. పునరుత్థానం, క్రొత్త భూమి ఇదే ఇక్కడ ముఖ్యం. వారు దయ్యాలు కారు. దెవదూతలు కారు. దేవదూతలు, మనుష్యులు వీరిద్దరూ వేర్వేరు జీవులు.
డా. జాన్ అంకెర్బెర్గ్ : పరలోకంలో ఎందుకు విసుగు అనిపించదు?
డా. రాండీ అల్కార్న్,: పరలోకంలో చేయాల్సిన పనులకు అంతముండదు. పనిలేనందుకు వచ్చే విసుగే శాపానికి కారణం. చేసేందుకు ఏమీ పనిలేదనిపించడం, ఏమీ చేయాలనుకోక పోవడం ఎందువలన? నా మనసులో ఉన్న ఏదో అసంతృప్తి,ఏదో విచారం, నన్ను పరిపూర్నుని చేసే ఏదో పనిని చెయ్యాలనే కోరిక వలన. మనల్నేవారు పరలోకంలో పరిపూర్నులను చేస్తారో తెలుసా? దేవుడు. క్రీస్తు మన ప్రతీ అవసరతల్ని తీరుస్తాడు. ఆయనే మంకు సంతోషాన్ని, ఆనందాన్ని, చైతన్యాన్ని, ఇచ్చే జీవజల ఊట. అర్ధవంతమైన అనేక పనుల్ని చేయించ గలడు.
సేవకులు ఆయనను సేవిస్తారు, ఎన్నో పనులు, వెళ్ళాల్సిన స్థలాలు, చూడాల్సిన ప్రజలు ఎప్పుడూ సంతోషమే. భోజనం బల్ల వద్ద క్రొత్త వారిని కలవడం. ఇది నిజమా? యుగ యుగాలు విందులు. పరలోకంలోని వివిధ రకాల ప్రజల్ని కలుసుకుంటాం. అనగా, ఇతర సంస్కృతులలోనుండి వచ్చిన పలువురిని మనం కలుసు కోవడమే కాక, వారి కధల్ని కూడా వింటాం. వెళ్లేందుకు అది యెంత అద్భుత స్థలమో కదా! ఒక వేల, మనం తిరిగి చూసేందుకు క్రొత్త స్థలాలను, సంబంధం పెంచుకునేందుకు క్రొత్త వారిని దేవుడు సృష్టిస్తాడేమో. మునుపు లేని క్రొత్త జంతువులను సృష్టిస్తాడేమో. గతంలో మన దరిచేరని క్రొత్త జంతువుల్ని తప్పక కలుస్తాం. పరలోకంలో ఎవరి మనసుల్లోను విసుగనేది ఎన్నడు పుట్టదు.
డా. జాన్ అంకెర్బెర్గ్ : సినిమాలో ప్రియులైన వ్యక్తులు మరణించి నప్పుడు తల్లి దండ్రులు గాని, లేక చనిపోయిన వ్యక్తి బిడ్డలు గాని సమాది వద్దకు వెళ్లి మృతునితో మాట్లాడే దృశ్యాలను మనం చూసి ఉంటాం. నిజమే, ప్రజలు, క్రైస్తవులు కూడా, మృతులతో మాట్లాడగలమా అని అడుగు తున్నారు. వారికి ఒక సందేశాన్నివ్వమని యేసును అడిగితె అలా చేస్తాడా?
డా. రాండీ అల్కార్న్,: ఇది నిజంగా చాలా చక్కని ప్రశ్న. నేను, మా పాపకు అమ్మమ్మ చనిపోయి నప్పుడు నా కుమార్తెకు చెప్పాను “యేసుని ద్వారా నీవు అమ్మమ్మకు ఏ సందేశాన్నైనా పంపవచ్చు”. మృతులతోటి మాట్లాడమనీ, ప్రార్ధించమనీ మనం పిల్లల్ని ప్రోత్సహించ కూడదు. ఐతే దేవునికి మానవునికి మధ్య వర్తియైన యేసుతో మనం ఎప్పుడైనా మాట్లాడవచ్చు. ఆయన తప్పకుండా మాట్లాడతాడు. నాకు బదులుగా అమ్మమ్మను కౌగలించుకొమ్మని, ఆమె ప్రార్ధించి నప్పుడు యేసు ఆ ప్రార్ధనకు తప్పక జవాబును ఇచ్చి ఉంటాడు.
ఐతే సమాది ప్రక్కన, మన ప్రియులు సమాధిలో లేరనే సంగతిని పిల్లలకు తప్పకుండా జ్ఞాపకం చెయ్యాలి. సరేనా! ఇహలోక జీవితంలో వారియొక్క శరీరం, మరల పునరుత్తానంలో వారితో కలిసే శరీరం, సమాధిలో ఉన్నది. ఐతే వదిలి వెళ్ళిన వ్యక్తి, చనిపోయిన మీ ప్రియుడు ఆ సమాధిలో లేడు. అతడు లేక ఆమె యేసు హస్తాల్లో ఉన్నారు. ఆ సంగతిని గట్టిగా చెప్పాలి. మృతుడు సమాది లోపల ఉన్నాడని తలంచ కూడదు. ఎందుకంటే, ప్రజలు వచ్చి సమాది రాయితో మాట్లాడుతుంటారు, సమాదితోటి మాట్లాడి బహుమతుల్ని వదిలి వెళ్ళడం కొన్ని సంస్కృతులలో చూడగలం. మృతుడు శారీరకంగా సమాదిలోనే ఉన్నాడను కోవడం ఎంతో దుఃఖకరమైన ఆలోచన. మృతుడు దానిలో లేడు.
డా. జాన్ అంకెర్బెర్గ్ : Randy కొందరు పిల్లలు, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో Disney Land వంటి చక్కని ప్రదేశాలు ఉన్నాయా అని మనల్ని అడుగుతుంటారు. ఉన్నత పర్వత ప్రాంతాలను, సముద్ర తీరాలను, Six Flags ను చూడగలమా? అక్కడ మనకు ఆనందాన్నీ, ఉత్సాహాన్నీ అందించే చక్కని ప్రాంతాలు ఉన్నాయా?
డా. రాండీ అల్కార్న్,: ఉన్నాయి. ఆయన అపరిమిత సృజనాత్మకత కల దేవుడు. ఈ సృష్టిలో గత సౌందర్యంలో మిగిలి ఉన్న కొద్ది పాటి సౌందర్యాన్నే మనం నేడు చూస్తున్నాము. రాబోయే క్రొత్త భూమి ఎలా ఉంటుందో ఇది సూచనగా తెలుపుతున్నది. మరిన్ని అద్భుత అంశాలు ఉంటాయి. ఆనందానికి మరిన్ని అంశాలు. నీళ్ళలో పైనుండి జారుతుంటారు. శరీరానికి ఎలాంటి దెబ్బలు తగలనటువంటి శరీరం మీకు ఉండి, జలపాతంలోనుండి క్రిందికి జారితే ఎలాగుంటుంది? అప్పుడు మనం ఏమేం చేస్తామో ఎవరికి తెలుసు?
ఐతే దేవుని నూతన సృష్టిలో లభించే వినోదాల్ని ఏ Amusement పార్కూ ఇవ్వలేదనుకుంటాను. ఐతే ఇలాంటి సవారీలు ఆనందమే కదా? ప్రజలు, ఇంకనూ దేవుని స్వరూపములొ సృష్టింప బదుతూనె ఉంటారు. ప్రజలు ఇంకనూ తమ చేతులతో నూతన వస్తువులను తయారు చెస్తూనే ఉంటారు. కనుక క్రొత్త భూమిలొ ఇలాంటి అనుభవం కలిగితే నేను ఆశ్చర్య పడను.
డా. జాన్ అంకెర్బెర్గ్ : మనం యేసులో ఎగుర గలమా?
డా. రాండీ అల్కార్న్,: మనకు ఆ సంగతి సరిగా తెలియదు. దేవుడు మనలో దానిని చేయగలదు లేదా మనమే స్వయముగా ఎగిరే యంత్రాలను కనుగొన గలము, లేదా ఇతరులు కనుగోన్నదానిని ఉపయోగించుకోగలము. నేను ఇంజను లేని విమానంలో Gliding చెస్తూ పడ్డాను. అది చక్కని వినోదం, ఇలా, గాల్లో తేలుతూ కొండ కోన చివరనుండి పర్వతం నుండి దూకి, చెరువుపై, జలపాతంపై గాలిలో ఎగరడం. ఇలాంటి పనులన్నీ క్రొత్త భూమిలొ చేయగలం.
డా. జాన్ అంకెర్బెర్గ్ : దేవుడు క్రొత్త ఆకాశాన్నీ క్రొత్త భూమినీ సృష్టిస్తే మనం విశాల ఆకాశాన్నీ, పాలపుంతనూ మొత్తంగా తిరిగి చూసి పరిశీలించగలమా?
డా. రాండీ అల్కార్న్,: ఆకాశములు దేవుని మహిమను ప్రకటించు చున్నవని తన లక్షణములు కనుపించేలా సృష్టిని రూపొందించాడని రోమా ఒకటి చెబుతున్నది. దేవుడు క్రొత్త భూమిలో సృష్టించిన దానిని మనం చూడాలను కుంటున్నాడను కుంటాను. సైన్సు విజ్ఞాన మనేది దేవుడిచ్చిన జ్ఞానమే. చరిత్ర ప్రారంభ దశనుండి ఆకాలంలోని శాస్త్రజ్ఞులు అమితంగా దేవుని ప్రేమిస్తూ సృష్టిలోని సంగతుల ద్వారా ఆయనను గురించి మరింతగా తెలుసుకోడానికి ప్రయత్నించేవారు. ప్రకృతి సందర్శకులం. ప్రకృతి సందర్శన కోరిక మనందరిలో ఉంటుందనుకుంటాను. సైన్సు కల్పనా కదలనే ఆలోచన ఎక్కడినుండి వచ్చింది? ప్రజనేందుకు ఇది ఆకర్షించింది? ప్రయాణాలు చేయాలనీ, నక్షత్రాలనూ, రహాలనూ, పాలపుంతలనూ పరిశీలించాలనే కోరికను సాతాను పుట్టించాడా? కోరిక అనేది ప్రభువు వద్ద నుండే వస్తుందని నేను నమ్ముతున్నాను. ఆయన కుతూహలానిచ్చాడు. మనం ఆయనను గురించి మరింతగా తెలుసుకునే విదంగా సృష్టించాడు భవిష్యత్తులో మనం ఆ పనిని తప్పక చేస్తాం.
డా. జాన్ అంకెర్బెర్గ్ : బాలుడు, “అమ్మా, నాన్నా, నానమ్మా, తాతా యేసును నా జీవితంలోకి ఆహ్వానించాలా? ఆపని ఎలా చెయ్యాలి?”మీరే మంటారు? అని అడుగుతాడు.
డా. రాండీ అల్కార్న్,: చూడండి, మన బిడ్డలు, మనుమలు అర్ధం చేసుకోడానికి మనం సహాయ పడాలి. మీకు లోకంలో అందరికంటే, అన్నిటికంటే ఎక్కువ యేసే. మీరు అమ్మతో, నాన్నతో, సోదరునితో, సోదరితో ఉండవలసిన అవసరం లేదని తలుస్తారేమో. “ఐతే, పిల్లలు వారితోనే ఉండాలని ఆశిస్తారు. యేసుకు మీ సంగతి అధికంగా తెలుసు. మీరంటే అధిక ప్రేమ, ఔను, మాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. మేము మిమల్ని ప్రేమిస్తాం గాని, దానికి పరిమితి ఉంది, ఆయనకు లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కోసం సిలువపై వేల చెల్లించాడు. మీరాయనను తెలుసు కోవాలి. ఎలా తెలుసుకోవాలో చెప్తాను”.
చిన్న వయ్యస్సు బాలుడు, వాడు ఏదో తప్పు చేసాడనీ, పాపం చేసాడనీ అర్ధం చేసుకొనే వయస్సు వచ్చినప్పుడు, ఆ పాపం చేయడమే సమస్యౌతుంది. అది వారిని దేవునికి దూరం చేస్తుంది. ఇలా చెప్పే అవకాశం ఉన్నది. “మీరు పాపాన్ని ఒప్పుకొని యేసుని క్షమాపణ అడగాలి. ఆయనతో సంబంధంలోకి వచ్చిన తరువాత, మరలా పాపాలు చేస్తే మళ్ళీ పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ అడగాలి. ఐతే యేసుతోటి మొదటిసారి సంబంధంలోకి వచ్చే పనిని మీరు వెంటనే చెయ్యాలి. ఆ పనిని చేస్తే మీరికపై జీవితంలో మళ్ళీ మళ్ళీ తప్పులు చేయరు”. కొన్ని సార్లు ఏదైనా తప్పును చెయ్యాలని పించినా, పరవాలేదు, మీరు నిజంగా రక్షణ పొందారని నిరూపితమౌతుంది. ఐతే మనమిలా చెప్పాలి. “మీ పట్ల ఉన్న నిబంధన మా పైన కూడా ఉన్నది. అందరికంటే అధికంగా మాకు యేసు కావాలి”.
డా. జాన్ అంకెర్బెర్గ్ : ఐతే,…. “అమ్మా, నేను నిజంగా పరలోకం వెళ్తానా? కచ్చితంగా ఎలా తెలుస్తుంది?” వారిలా ప్రార్ధిస్తే మనమేం చెయ్యాలి?
డా. రాండీ అల్కార్న్,: ఇక్కడ మనం దేవుని వాగ్దానం చేశాడనాలి. 1 యోహాను 5, “మీకు నిత్య జావమున్నదని గ్రహించు నట్లు ఈ సంగతులను వ్రాయుచున్నాను. కుమారుని నమ్మినందున దీనిని పొందితిరి”. ఇది దైవ వాగ్దానం. బ్యాంకులో ఉంచినట్లే. దాన్ని మీరు పూర్తిగా నమ్మ వచ్చు. అది రక్తముతో కొనబడిన వాగ్దానం. కొన్నిసార్లు ‘నిరీక్షణ’ అనే పదం బైబిలు వాడబడింది. అది మార్గం కాదు. ఆశాభావ మంటే దేన్నో ఆశించడ మనుకుంటాం. ఐతే, లేఖనంలో ఈ నిరీక్షణ యేసు క్రీస్తు రక్తంలో కొనబడింది. ఇది వాస్తవం.
డా. జాన్ అంకెర్బెర్గ్ : వచ్చే వారం ప్రియులారా, మా అమ్మ గాని, నాన్న గానీ, తాత, నానమ్మ గానీ, మీ సహోద్యోగులు కానీ, మీకు పరిచయమైనా వ్యక్తులు గానీ, యేసును ఎన్నడూ జీవితంలోకి ఆహ్వానించని వారు, పరలోకం వేల్తామంటుంటే, వారికి మీరేం జవాబిస్తారు. అనే అంశంతో ఈ దరావాహికను ముగించ బోతున్నాం. పరలోకం వేల్తామనుకుంటున్నారు. వారికేమని చెప్తారు? ప్రజలు తరచుగా ఇలాంటి ప్రమాదకర పరిస్థుతులలో పడుతుంటారు. యేసు దీనికి జవాబు చెబుతున్నారు. వచ్చే వారం దీన్ని వివరించమని Randy ని అడుగుతున్నాను. మీరు మాతో తప్పక కలుసుకోండి.
నిరీక్షణ: దేవుని రక్తము వలన కొనబడినది (వచ్చినది).
మరిన్ని టీవీ ప్రోగ్రామల్ని చుచెందుకు ఉచిత
FREE John Ankerberg Show App download చెసుకొండి
“Pray to Accept Jesus Christ as Your Savior” @ JAshow.org
కాపీరైట్ 2015 ATRI.
இயேசு திரைப்படம்

கிறிஸ்தவராவது எப்படி
நீங்கள் எப்படி கிறிஸ்தவராக முடியும்? கிறிஸ்தவர் என்பவர் இயேசுவை நம்பி அவருடைய பாதையை பின்பற்றுகிறவனாக இருக்கிறான். நீங்கள் கிறிஸ்தவர் என்பதை அறிந்துகொள்ள வேதம் உங்களுக்கு நேர்த்தியான பதில்களை அளிக்கிறது. கிளிக் செய்யவும்.