పరలోకం-అది ఎలా ఉంటుంది? సెరీస్ 2, కార్యక్రమం 1.

పరలోకం: అది ఎలా ఉంటుంది? సెరీస్ 2,

కార్యక్రమం 1.

 

ఈ రోజు John  Ankerberg Show లో- పరలోకంలోఉన్న విశేష మేమిటి? మీరు Disney  Land కు గాని, ASPEN లో మంచు స్కీయింగ్కు గాని, యూరోపేకు గాని వెళ్ళాలని ఆలోచిస్తుంటే వాటి వివరాలు తెలిపే కరపత్రాలను, website లను ముందుగానే పరిశీలిస్తుంటారు, సందర్శక గ్రంధాలు అక్కడికి వెళ్ళాలనే కొరికెను ఎక్కువ చేస్తుంటాయి. ఐతే పరలోకానికి నడిపించే గ్రంధం బైబిలు. దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశమును మనం చూడబొతున్నామని బైబిలు చెబుతున్నది. ఐతే ఈ పరలోకం లేక బైబిలు చెబుతున్న క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీ సొంతం కాబోతున్నట్లయితే పరలోకం గురించి మీకు ఏమి తెలుసు? మీరు నిత్యత్వాన్ని గడప బోతున్న స్థలంలో మీరు ఏమి చెయ్యాలని, ఏమి చూడాలని, ఎలాంటి అనుభవాలను పొందాలని ఆశిస్తున్నారు?

 

ఈనాటి మన అతిధి పరలోకం అనే ప్రక్యాత పుస్తకం రచించిన Dr. Randy Alcorn. మన భవిస్యత్ గృహం- పరలోకంలో క్రైస్తవుల కొరకు దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన అంశాల నీయన వివరిస్తారు. John Ankerberg Show లోని ఈ ప్రత్యెక కార్యక్రమములో మాతో కలుసుకోండి.

***

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఈ కార్యక్రమానికి స్వాగతం. పరలోకాన్ని గురించి వివరించే ప్రక్యాత United States భోదకుడు Dr. Randy Alcornతో ఇప్పుడు మాట్లాడుతున్నాం. మనమందరం వెళ్ళబోతున్న క్రొత్త యెరూషలేము నగరాన్ని గురించి మనం చర్చించబోతున్నాం. శరీరమునందుండ కుండుట అనగా ప్రభువుతో ఆయన సుందర నగరములో ఉండుట. ఈ నగరం ఎంత పెద్దది? ఈ నగరంలో మనం వేటిని చూడబోతున్నాము? Randy, మనం ఇప్పుడొక వచనంతోటి ప్రారంబించుకుందాం. ప్రకటన 21:15-16. “ఆ పట్టణమును, దాని గుమ్మములను, ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వానియొద్ద బంగారు కొల కఱ్ఱ యొండెను. ఆ పట్టణము చచ్చవక మైనది. దాని పొడుగు, దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొల కఱ్ఱతో పట్టణమును కొలవగా, కొలత ఏదొందల ఏబై కోసులు. దాని పొడుగును, ఎత్తును, వెడల్పును, సమానము”అని చెప్తున్నది. ఇప్పుడు, Randy, ఈ వాక్యభాగం ఏమని చెబుతుందో మీరు మాకు వివరించండి.

డా. రాండీ అల్కార్న్,:    చూడండి, ఇదంతా చిహ్నార్దకముగా ఉన్నదని కొందరంటున్నారు. ఇదొక ఘన చతురస్ర మన్నారు. అతి పరిశుద్ద స్థలము వంటిది.  మూడు కొలత పరిమాణములు, త్రిఏక దేవుడైన తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మ దేవుని పరిపూర్ణతను సూచిస్తున్నది. ఈ కోటలన్నీ నిజమే కావచ్చు. ఐతే ఐతే ఇక్కడ మానవుని కొలతలు ఉపయోగించ బడ్డాయని మనకు చెప్పబడుచున్నాయి. ఇది నిజంగానే విశాల అతలమని మనం గుర్తించాలి. కనుక, దీనిని బట్టి దేవుడు మనకు నిత్యత్వంలో ఇవ్వబోతున్నది, దీనంతటి కంటే అత్యధికంగా, ఎంతో, ఎంతో గొప్పదనే సంగతిని ఈ వాక్య భాగం మనకు గుర్తు చేయాలి. ఈ జీవిత మనేది దేవుని ప్రజలకు కేవలం ఒక ప్రారంభమని, అర్ధం చేసుకుంటే, యేసు క్రీస్తుతో మనం సత్సంబందాలు కలిగి ఉంటె, పరీక్షలో జయాన్ని పొందానా అని మనం దిగులు పడవలసిన పని లేదు. నాకు దొరికే అవకాశం ఇదొక్కటే గనుక నేను తీసుకువెళ్ళే వస్తువులు చాల ఎక్కువగా ఉండాలా? సౌందర్యం, అపరిమిత సౌఖ్యాలు నిండిన ఈ లోకంలో సంతోషాన్ని అనుభవించే అవకాశం ఇదొక్కటే ననుకుంటున్నారా?

ఈ వాక్యం పరలోకం గురించి మనం తలంచె ఒక అంశాన్ని వివరిస్తున్నది. మనకు పరలోకాన్ని గురించిన బైబిలు చిత్రం లేదు. ఎందుకనగా, సృష్ట్యాదిలో వాలే, దేవుడు భూమ్యాకాశములను సృజించెను అనేది బైబిలు చిత్రం. కనుక, ప్రకట 21:1 కూడా దేవుడదే పనిని మరలా చేసాడని చెబుతున్నది. ఐతే ఇప్పుడాయన క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృష్టించాడు. పాత దానిని పునరుద్ధరరించాడు. వీటి మధ్య ఒక కొనసాగింపు ఉన్నది. కనుక, మనం నివసించే క్రొత్త భూమి మరింత ఉన్నతముగా ఉంటుంది. యేసు క్రీస్తు యొక్క పాప పరిహారార్ధ రక్తం వలన ఈ జీవితంలో మనం అనుభవించిన ప్రతీ దానికంటే ఇది ఉన్నతంగా ఉంటుంది. కనుక, అ లోకంలోని అద్బుతాలు మనం అనుభవించిన వాటన్నిటి కంటే ఏంటో ఉత్తమ మైనవిగా ఉంటాయి.

క్రొత్త యెరూషలేము వస్తుందని మనకు తెలుసు. అదే విదంగా క్రొత్త Los Angels, క్రొత్త London వస్తాయా? క్రొత్త Chittanooga ఉంటుందా? ఎందుకు ఉండకూడదు? ఒక నగరం నూతనీకరించ బడితే ఇతర నగరములేందుకు నూతనీకరించ బడకూడదు? దేవుడు సంస్కృతిని పునరుద్దరించి, నూతనీకరించడం, ఇతర అంశాలను పునరుద్దరించడం. సంగీతం పునరుద్దరించ బడుతుంది. కలము పునరుద్దరించబడటం, నాటక రంగం పునరుద్దరించబడటం, క్రీడల పునరుద్దరణ, నూతనమైన మానవ అనుభవం, నూతన సందర్శన ప్రాంతాలను దర్శించగలం. మీరు నయగారా జలపాతాన్ని దర్శించగలరు. నేను దర్శించాను. ఐతే అనేక స్థలాలను నేను దర్శించనే లేదు. దేవుడు నయగారా జలపాతాన్నీ, దానికంటే మహోన్నతమైన జలపాతాలను, మన హృదయాలు ఆయనను ఆరాధించేలా నూతనీకరించవచ్చు కదా?

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఔను, సువార్త ప్రకటన పనిలో వివిధ దేశాలను సందర్శించే సదవకాశం నాకు దొరికింది. నేను మొదటి సారి Switzerlandలో శీతల పర్వతాల మధ్య రైల్లో ప్రయాణించిన సందర్బం గుర్తుకు వస్తున్నది. రైలు ప్రక్కన పర్వతాలు వెనక్కు వెళ్ళడం అధ్బుత దృశ్యం. పందొమ్మిదేళ్ళ వయస్సులో ఇతియోఫియకు వెళ్లాను. ఉన్నత పర్వతాల పైన నిల్చుని, ఇప్పటి వరకు నాగరీకతకు నోచుకోని పది స్థలాలలో ఒకటని Life మాగజీన్ చెప్పిన ఒక ప్రదేశాన్ని నేను తిలకించాను. అక్కడి అధ్బుత శబ్దాలను విన్నాను. అక్కడ ప్రకృతి స్వరాలను మాత్రమె వినగలము. కన్యా అరణ్య ప్రాంతాలకు వెళ్లి అక్కడ వివిధ రకాల జంతువులను చూసాను, వాటి అధ్బుత సౌదర్యాన్ని గుర్తించాను. ప్రపంచములోని వివిధ ప్రాంతాలలోని మహా సముద్రాల్ని చూసి, ఇలాంటివి పరలోకంలో లేక పొతే వాటిని పోగొట్టు కున్నట్లుగా అనిపిస్తుందని తలచాను. ఐతే మనం భవిష్యత్తులో అనుభవించ బోతున్న ఈ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని గురించి దేవుడు ఈ వచనాలలోను, ఈ వాక్య భాగాలలోనూ మనకు ఏమని తెలియ జేస్తునాడో వివరంగా చెప్పండి.

డా. రాండీ అల్కార్న్,:    ఈ లోకములో కూడా ఆకాశములు దేవుని మహిమను ప్రకటించుచున్నవి. నాకు బాల్యం నుంచి భూగోళ శాస్త్రం పైన అమితమైన ఆసక్తి ఉన్నది. నేను క్రైస్తవేత్తర కుటుంభంలో పుట్టి పెరిగాను. ఇంటి వెలుపలికి వెళ్లి టెలిస్కోపు గుండా ఆకాశాన్ని పరిశీలిస్తుండే వాడిని. మహాధ్బుత ANDROMEDA పాలపుంతను మొదటిసారి చూసిన రాత్రి నాకు ఇంకా గుర్తున్నది. అది ఎన్ని లైటు సంవత్సరాల దూరంలో ఉన్నదనే సంగతులను, ఎన్ని లక్షల కోట్ల నక్షత్రాలున్నా యనే వివరాలను చదివేవాన్ని. ఆరవ తరగతి చదువుతున్న కాలంలో ఈ విశాల విశ్వపు పరిమాణాన్ని గురించి చదివి ఏడ్చాను. నేను దీనికి వెలుపల ఉన్నా ననే భావం. ఇదంతా ఎలా జరుగు తున్నదో నాకు తెలియదు. నేను ఎన్నడూ సువార్తను వినలేదు. కొంత కాలం తరువాత, హైస్కూలులో చేరాను. టీనేజిలో ఉండగా, నా టెలిస్కోపును చూసాను, అది అనేక సంవత్సరాలుగా వాడకం లేక ఒక మూలన పడి యున్నది దానితో బైటికి వెళ్లాను, మేఘాల్లేని రాత్రి ఆకాశంలోకి చూస్తూ, అదే మహోన్నతమైన ANDROMEDA పాలపుంతను పరిశీలిస్తూ మరలా కన్నీరు కార్చాను. ఐతే మరొక కారణాన్ని బట్టి దుఃఖించాను. ఇప్పుడు ఎందుకు ఏడ్చానంటే, ఔను- ఆ పాలపుంత చాల పెద్దదే, ఐతే దానిని సృష్టించిన దేవుడు నాకిప్పుడు తెలుసు. సమస్త పాలపున్తలను, ఆకాశ వాయు మేఘాలను, చీకటి రంద్రాలను, ఈ విశాల విశ్వంలో మహాధ్బుతమైన సంగతులనన్నిటిని సృష్టించి దేవునితో సంబంధంలో ఉన్నాను. నాకిప్పుదడాయన తెలుసు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    దేవుడు మనల నెంతగానొ ప్రేమించి కొన్ని ప్రత్యేకతలతో సృష్టించిన సత్యాన్ని గురించి చెప్పండి. మనలోని చెడు నంతటిని ఆయన తోలిగిస్తాడు. మనలో ఉన్న మంచిని మరింతగా పెంచుతాడు. అనగా, మనకు నచ్చిన అంశాలను ఆయన నాశనం  జరగదు. ఆయన వాటిని అబివృద్ది చేస్తాడు, సమస్తము అధికంగా  చెందుతుంది. ఎందుకంటె, ఆయన ప్రేమగల దేవుడు గనుక.

కనుక, ఆయన  భూమిని స్థిరపరుస్తున్నందున, మన కోరిక ఆయనకు ముందే తెలుసు. మనం వేటిని కోరుకుంటామో, ఆయనకు ముందుగానే తెలుసు. ఎందుకని? ఎందుకంటే, ఆయన కోరికల్ని మనకిచ్చాడు, మన కోరికలను తీరుస్తాడు. మనం ఉహించుకున్న దానికంటే ఇది అధికంగా ఉంటాయని ఆయన చెబుతున్నాడు.

డా. రాండీ అల్కార్న్,:    సుప్రసిద్ధ, గణిత శాస్త్రజ్ఞుడు PASCAL, ప్రజలు సంతోషాన్ని కోరుకుంటా రన్నాడు. ఇది మన స్వభావంలోనే ఉన్నది, సంతోషాన్ని వెదుకుతాం, సంతోషం దేవుని వద్దనుండి వస్తుంది. సమస్య, మనం సంతోషాని వెతక్క పోవడం కాదు. వేటక రాణి చోట సంతోషాన్ని వెతకడమే సమస్య. పగిలిన తోట్లలో నీరు నిలువదు కదా. దానికి బదులుగా సంతోషం దొరికే చోటునే సంతోషాన్ని మనం వెదుక్కోవాలి- యేసు క్రీస్తులో, జగత్ సృష్టికర్త యొద్ద వెతకాలి. సమస్త సంతోషానికి ఆధారబూతుడాయనే. ఆ తరువాత C.S. Lewis చెబుతున్నట్లు సంతోషంలో పిల్ల కాలువలు కూడా ఉన్నాయి. వాటిని ఇక్కడ అనుభవిస్తుంటాం. మన మిక్కడ ఏం చెయ్యాలంటే, వాటికి కోతవరకు మాత్రమె ప్రాధాన్యత నిచ్చి అనుభవించ గలగాలి. వాటిని విగ్రహాలుగా మార్చ కూడదు. అవి ఎక్కాడు నుండి వచ్చాయో మనం తెలుసుకోవాలి. వాటి నుండి దేవుని చూడగలగాలి సమస్త మేల్లకు ఆధారబూతుడు దేవుడే. మన సంతోషానికి ఆధారబూతుడు దేవుడే. కళలను సాకారం చేసేది ఆయనే. ఆయన ముఖాన్ని చూడటమంటే, జగత్ సృష్టికర్తతో సంభందం కలిగి ఉండటమే. తన సేవకుని ఆహ్వానిస్తున్న యజమాని గురించి లేఖనం ఇలా చెబుతుంది “భళా, నమ్మకమైన మంచి దాసుడా! నీ యజమాని సంతోషంలో పాలు పొందుము.” ఈ సంతోషం సృష్టికి ముందునుంచే ఉన్న సంతోషం. ఈ సంతోషం తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మల యందు నిరంతరం నిలిచి యున్న సంతోష. సంతోశాన్ని ఎక్కడో వెదుక్కో మనడం లేదు కాని నా సృష్టిలోని నా సంతోషంలో, నన్ను గురించిన నా సంతోషంలో, నా బిడ్డలుగా మీలోని నా సంతోషంలో ప్రవేశించమని దేవుడన్నాడు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    క్రొత్త భూమిని గురించే కాక, నగరాన్ని గురించి కూడా చెప్పండి. ఈ నగరం ఎన్ని అంతస్తులతో యెంత పెద్దదిగా ఉంటుంది. ఆ నగరపు కొలతలను గురించి చెప్పండి.

డా. రాండీ అల్కార్న్,:    పట్టణం కొలత ఏడొందల ఏబై కోసులు, పట్టణపు అంతస్తులు పండ్రెండు అడుగుల ఎత్తైతే దీన్లో ఆరు లక్షల అంతస్తులున్నాయి. నా మట్టుకైతే పట్టణం ఈ విదంగా కట్ట బడుతుందని నేననుకోవడంలేదు. కొందరు ప్రజలైతే దీనికి పై భాగాన్ని చూస్తే ఇది పిరమిడులా కనబడుతుందని అభిప్రాయ పడుతున్నారు. అలా కనబడవచ్చు, మనకోక సంగతి తెలుసు ఇది ఎన్ని చదరపు అడుగులనేది మనము ఊహించలేము. క్రొత్త యెరూషలేము పట్టణము ఈ విధంగానే ఉంటుంది. క్రొత్త భూమికూడా మనకు ఉన్నది.

అంత మాత్రమె కాదు, సరికొత్త సూర్య చంద్ర నక్షత్ర వ్యవస్థ, సరికొత్త పాలపుంత ఉన్నది. నూతన యెరూషలేము నూతన భూమి మనకు ఉన్నట్లయితే, క్రొత్త సూర్య చంద్ర నక్షత్ర వ్యవస్థ, క్రొత్త పాలపుంత మనకు ఎందుకు ఉండకూడదు? దేవుడు నూతన ఆకాశము నూతన భూమి సృస్తిస్తాడని చెప్పబడింది కదా? చూడండి, ఆకాశము నక్షత్రములతోటి నీపా బడియున్నది. ఆకాశం మాత్రమె కాదు, సర్వ జగత్తు పునర్నిర్మింప బడుతుంది. భవిష్యత్తులో మన మా పాలపున్తలను పరిశీలిస్తామా? పరిశీలిస్తామనే అనుకుంటున్నాను. మానవులందరూ తమ మెదడులో కేవలం పది శాతాన్ని మాత్రమె ఉపయోగించక, వంద శాతాన్ని ఉపయోగిస్తూ, అందరు కలిసి సాంకేతికంగా పనిచేస్తే ఏం జరుగుతుందో ఆలోచించండి. మన మిప్పటికే చంద్ర మండలంలోకి వెళ్లాం. కావాలనికుంటే మనం అంగారక గ్రహంలోకి కూడా వెళ్ళగలం. మనం పాపం, శ్రమలు, మరణపు బారిన పడకుండా అందరం కలిసి కట్టుగా దేవుని మహిమ పరుస్తూ, జగత్తును పరిశీలిస్తూ ఉంటె ఏపనినైనా చేయగలం కదా!.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మంచిది, ఇది చాలా మంచి అంశం, ప్రియులారా! ఇప్పుడొక విరామం తీసుకుందాం. తొరిగి వచ్చిన తరువాత, నూతన యెరూషలేము గురించి, నూతన భూమిని గురించి మరింత చర్చిద్దాము. మనం సువార్త సేవ కొరకు ఎలా ప్రయాణం చేయాలనే అంశాన్ని కూడా కొంచం చర్చిద్దాం. సువార్త సభలలో మనము ఏవిధంగా కూడుకోవాలి? మనం ప్రభువును ఎలా ఆరాధించాలి? చూస్తూనే ఉండండి వేతనే తిరిగి వస్తాము.

**************

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మంచిది, మనం మరలా వచ్చాం. Dr.  Randy Alcorn తో పరలోకాన్ని గురించి చర్చిస్తున్నాం. ఈ అంశంపై దేశంలో ఉన్న నిపుణులలో ఈయన కూడా ఒకరు. మరి Randy, పరలోక పట్టణపు సువర్ణ మాయమైన వీధులను గురించి చెప్పండి. నూతన యెరూషలేములో నిజంగానే భంగారపు వీధులు ఉంటాయా?.

డా. రాండీ అల్కార్న్,:    ఉంటాయని వ్రాయబడి యున్నది. కొందరు అది కేవలం ఉపమానంగా చెప్పబడిన మాట అంటారు. దీని భావమేమిటంటే, బంగారం నిజంగానే  విలువైన లోహం. బంగారం వీధులపైఉన్నది . ప్రజలు బంగారంపై నడిచి వెళుతున్నారు. మీరు పరలోకంలో నిత్యత్వంలో దేనిపై నడుస్తారనే అంశంపై ఎక్కువ ఆశ పెట్టుకోకూడదని ఈ ప్రజలు అభిప్రాయ పడుతున్నట్లుగా ఉన్నది. ఈ అభిప్రాయంలో కొంచం నిజం కూడా ఉండవచ్చు. ఐతే దేవుడు పరలోకంలో ఉంచబోయే వాటికి విలువ కట్ట లేమని ఈ వాక్యం చెబుతున్నట్లుగా ఉన్నది. అక్కడ విలువైన రాళ్ళు, 12 విలువైన రత్నములు, నూతన యెరూషలేము గోడలలో అలంకరింపబడి ఉన్నాయి. వీటన్నిటి సౌందర్యం మన చుట్టూ  ఉంటుందని నేను అనుకుంటున్నాను.

బంగారం అందమైనది. అందాన్ని మినహాయించి చుస్తే, దానికి విలువ ఉంది గనుక అది అవసరమా? లేదు పరలోకంలో దానికి విలువుందా? ఉండదనుకుంటాను. అంశ మేమంటే, అది అందమైనది. దేవుడు  సృష్టించాడు. నూతన యెరూషలేములో మనం ఈ అంశాన్నిచూస్తా మనుకుంటున్నాను. అక్కడ ఖనిజ అద్భుతాలున్నాయి. పచ్చని వృక్షజాలం, చెట్లు, ఫలాల వంటి సహజమైన అద్భుతాలు కూడా ఉన్నాయి. పర్వతాలు ఉన్నాయి, జంతువులూ ఉన్నాయి. వీటి వలన ఏంతో సంతోషం, వివిధ జంతువుల వలన, ఉదాహరణకు OTTER వంటి వాటి వలన సంతోషం. మనం ఈ లోకంలో ఉన్నప్పుడూ OTTER లు నీటిలో ఆడటం చూసాను. అనేక గంటల పాటు ఆడుతూనే ఉంటాయి. కేవలం తినడం, ఆడుకోవడమే వాటి పని. నిజంగా వాటిది ఆనందమయ జీవితంలాగున్నది. ఐతే,  ఆనందంగా జీవిస్తున్నాయో గమనించండి.

ఔను, దేవుడు తన గుణలక్షణములను తన సృష్టిలో వెల్లడించాడని రోమా ఒకటి చెబుతున్నది. అనగా మనం OTTER సంతోషంగా ఆడుకోవడం చూసినప్పుడు, దేవుడు సరదాల దేవుడని చెప్పాల్సి వస్తుంది. ఇది సాతాను వద్దనుండి రాలేదు. అనగా, వేరుగా చెబితే, దీన్లో మన దేవుణ్ణి చూడాలి. సృష్టిలో అద్భుతమైన జీవులున్నాయి. నా అందమైన కుక్కను చెవుల వద్ద మెల్లగా నిమిరితే, అదెంతో సంతోషిస్తుంది, దాని కనులలోకి చూస్తే, గొప్ప అద్భుతం, ఆ అద్భుతాన్ని సృష్టించిన దేవుడు కనిపిస్తాడు. ప్రపంచం ఇలాంటి, చిన్న చిన్న ముఖ్యమైన అద్భుతాలతో నిండి ఉండటమే కాదు. దీనంతటిని ఎవరు  చేస్తారు, దేవుడు ఆత్మీయ జీవితాన్ని చూస్తాడని కొందరనవచ్చు. లేదు! దేవుడు ఈ శారీరక మరియు ఆత్మీయ జీవాలన్నిటిని సృష్టించిన వాడు. ఎలాంటి సమస్యలు, మరణం లేకుండా, నిత్య కాలం మనం వాటిని హాయిగా అనుభవించగలం- ఆయన మహిమార్దం!

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఇదే అంశం లోపల, ఆరాధనకు, మనం చేస్తున్న ఇతర పనులకూ మధ్య నున్నసంభందాన్ని గమనిద్దాం. సంగంలో మనం ఆరాధన జరపాలని అందరం నమ్ముతున్నాము. వాస్తవ మేమంటే, మన మేదైనా పనిచేస్తున్నప్పుడు, Base Ball లేక Golf ఆడుతున్నప్పుడు, లేదా వేరే ఏదైనా పని చేస్తున్నప్పుడు దాన్ని ఆరాధన అనకూడదు.కనుక, విలాసాలు ఆరాధన కాదు. సరే, దాన్ని బైబిలు ఒప్పుకోదన్నారు వీటి రెండిట్ని కలపండి.

డా. రాండీ అల్కార్న్,:    1 కొరిందీ 10:31, మీరు  చేసినను, పానము చేసినను దేవుని మహిమ కొరకు చేయమంటున్నది. అనగా దేవుని మహిమ కొరకు మాత్రం సంఘమునకు వెళ్ళమని కాదు, దేవుని మహిమార్ధం మాత్రం బైబిలును ధ్యానించడం కాదు, దేవుని మహిమార్ధం మాత్రం పాటలు పాడటం కాదు, లేక ప్రార్ధించడం కాదు. భోంచేయడం, నీళ్ళు త్రాగడం సాధారణమైన పనులే కదా? నడిచి వెళ్ళడం, నిద్ర లేవడం, పైకి లేవడం, రాత్రి పడుకోవడం- మామూలు పనులే. జీవితం పరిపూర్ణం, మన జీవితంలో మొత్తంగా, దేవుని ఆరాధన, స్తుతించడం మాత్రమే ఉండాలి- ఈ జీవితంలో. క్రొత్త భూమిలో దేవుని మహిమార్ధం మన సైకిలు తొక్కుతా మేమోనని నేనన్నప్పుడు అక్కడ ఉన్న ఒక ప్రొఫెసెర్ నన్ను ఈ విషయంలో నిలదీసి సవాలు చేశాడు. అతడు, “Randy, దేవుణ్ణి మనం చూస్తుంటే సైకిలు నెవరు పట్టించుకుంటా రాన్నాడు”. ఐతే నేను “మనం దేవునికి బదులుగా సైకిలును విఘ్రహంగా చేసి ఆరాధించడం లేదు అని చెప్పాను. సైకిలును తొక్కుతూ దేవుని అరాదిస్తున్నామనే సంగతిని వివరించాను”. దాని తరువాత నేను Port Land  వెళ్లి, అనేక మైళ్లు మోటరు సైకిలు మీద ప్రయాణం చేస్తూ దేవుని ఆరాధన చేయబోతున్నాను. నేను కూడా, శాపగ్రస్తమైన ఈ లోకంలో పాపిగా ఉన్న నేను కూడా ఇప్పుడు మోటారు సైకిలుపై దేవుని ఆరాధిస్తున్నాను. చూడండి, మోటారు సైకిలుపై దేవుని అరాధించ లేకుంటే మీరిక దానిని తోలాల్సిన పనే లేదు.

నిత్యత్వంలో మనం అన్ని పనుల్లొనూ దేవుని ఆరాధిస్తా మనుకుంటాను. మనం మోకాళ్ళపై కూర్చుని తదేకంగా ఆయనవైపు చూసే సమయాలు ఉంటాయా? ఉంటాయి. ఐతే ఆయన సేవకులు ఆయనను సేవిస్తారని కూడా చెప్పబడింది. అంటే మనం ఇతర పనుల్ని చేస్తూ ఇతర స్థలాలకు వెళతా మన్న మాట. ఐతే మన మెన్నడూ దేవుని నుండి విడిపోము. ఈ లోకంలో కున్ని సార్లు జరుగుతున్నట్లు, దేవుని సన్నిధి గుర్తింపులోనుండి ఎన్నడూ బైటకు వెళ్ళము. ఆయన ఇక్కడ కూడా ప్రతి చోటను ఉన్నాడు. ఐతే మనమా సంగతిని గుర్తించం. దానెన్నడు మరిచి పోకూడదు. ఈవులన్నిటి వెనుక వాటినిచ్చిన దాతను గుర్తించాలి.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మనం కాలంలో వెనక్కి వెళ్లి, దేవుని దయను గురించి తెలుసుకోడానికి మనల నెలా రక్షిస్తున్నాడో తెలుసుకునే వీలుంటుందా? ఇది నిజంగా జరుగుతుందంటారా?.

డా. రాండీ అల్కార్న్,:    దేవునికి కాల పరిమితులు లేవనే సంగతి మనకు తెలుసు. ఆయన దీనికి వెలుపల నిలిచి యున్నాడు. కొంతకాలం జీవించి మరణించే వాటికోసం ఆయన ఆకాశాన్ని, కాలాన్ని సృష్టించాడు. ఐతే దేవుడు అధ్బుత కరుడు, ఆశ్చర్య కరుడైన దేవుడు, నిజంగా తలంచు కున్నట్లయితే క్రొత్త భూమిలొ భవిష్యత్తులో మనం నివసించే, స్తలాన్ని మార్చి వేస్తాడు. వీడియోలో చూస్తున్నట్లు గతంలో జరిగిన సంగతులను ఆ పాత చరిత్రను, గతంలో ఆయన మన పట్ల చేసిన ఆ దయా పూరిత కార్యాలను చూసేందుకు అనుమతి నిస్తాడు. లేదా ఆయన తలిస్తే, ఆయన మనలను అదృశ్య రూపంలో తీసుకుని వెళ్లి యేసు శిష్యులతో మాట్లాడుతున్న దృశ్యాలను చూపించగలడు. యేసు కొండపైన ప్రసంగం చేస్తున్నప్పుడు, నేను అక్కడుంటే బాగుండేదని మీరు ఎప్పుడైనా తలంచారా? నేను మాత్రం తలంచాను. ఏదో ఒక రోజున ఆయన కొండపైన ప్రసంగిస్తున్నప్పుడు నేను అక్కడ ఉంటానేమో. దేవుడు మనల్ని వెనక్కి తీసుకెళ్లగలడు. ఎఫెస్సీ 2:7 ఇలాంటి సంగతి జరగబోతున్నదని సుచిస్తున్నట్లు నేనను కుంటున్నాను. ఎందుకంటే, రాబోవు యుగములలో ఆయన మనకు చేసిన  ఉపకారము ద్వారా, తన కృపా మహదైస్వర్యమును కనుపరుస్తాడు. ఐతే గతంలోనూ అది మనకివ్వ బడిందని తలుస్తున్నాను. కనుక ఆయన మనల్ని వెనక్కి తీసుకెళతాడు.

మన కాలములో వెనక్కి వెళ్లి, గతంలో జరిగిన ఘోరమైన కారు విపత్తును చూడగలము. దాని వలని వేదనను కూడా గుర్తించ గలము. ఇప్పుడు దాన్ని మనం ప్రభువు కనుల గుండా చూసి, “ప్రభువా! నీవు ఆ పనిని చేస్తూ ఉన్నావన్న మాట. దేవుని సంకల్పము చొప్పున  పిలువ బడినవారికి దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగునని”, నీవు మాతో ఆ మాట చెప్పునప్పుడు, నీవు నా జీవితంలో ఆ పనిని చేస్తున్నావన్న మాట. మనం ఆ మాటను ఇప్పుడు విశ్వసించాలి. ఒక రోజున ఆ విశ్వాసం, నిజమౌతుంది. వెనుదిరిగి మనం మన జీవితాలలో దేవుని దయను, కృపను, ఆయన సంకల్పాన్ని చూడగలమను కుంటున్నాను.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మనకు ప్రియుడైన వ్యక్తి క్రీస్తు లేకుండా నరకానికి వెళితే, అతడు నరకానికి వెళ్ళాడని మనం పరలోకంలో చింతిస్తుంటామా?.

డా. రాండీ అల్కార్న్,:    చూడండి ఈ ప్రశ్నను పలువురు అడుగుతుంటారు. నేను క్రైస్తవేత్తర కుటుంబంలో పుట్టాను, అలాంటి పరిస్తితిలో ఏమి జరుగుతుందో నాకు తెలుసు. నాకు ప్రియుడైన వ్యక్తికి ఇప్పటికీ క్రీస్తును గురించి తెలియదు. నా స్నేహితులు పలువురు ఇప్పటికీ క్రీస్తు నంగీకరించ లేదు. కనుక, ఈ వాదాన్ని నేను అర్ధం చేసుకో గలను. ఐతే దీన్ని జీర్ణించు కోవడం కొంచెం కష్టమే. ఐతే వాక్యాన్ని చూస్తున్నాం. భూమిలోని  అవినీతిని బట్టి దేవుడు ఇచ్చిన తీర్పు విషయంలో దేవదూతలు, ప్రజలు ఆ తీర్పును విని ఎంతో సంతోషించారని ప్రకటన గ్రంధం చెబుతున్నది. దేవుడు భూమిపైకి మరణాన్ని నాశనాన్ని తీసుకుని రాగా దేవుని పరిశుద్దతను బట్టి ప్రజలెంతో సంతోషించారని ప్రకటన గ్రంధంలో వ్రాయబడి ఉన్నది. మరి, మనము ప్రేమించే వారిని గురించి ఆలోచించినపుడు దేవుడు లోకము నెంతో ప్రేమించి నందున వీరి కొరకు సిలువపై మరణించాడని అర్ధం చేసుకోవాలి. ఐతే పరలోకమును నరకం ఎన్నడును జయించలేదు. నరకానికి పరలోకంపై అధికారం లేదు. నరకం ఉన్నందున పరలోకంలోని సంతోషానందాలు ఎన్నడు తరగవు. నేనిలా తలుస్తుంటాను. రాబోయే కాలంలో దేవుడు తన ప్రజల విమోచన కొరకు చేసిన పనిని బట్టి, రాబోయే కాలంలో చేయబోయే పనులను బట్టి, నరకానికి ప్రాధాన్యత తగ్గిపోతుంది. అది మనల్ని భయపెట్టదు. ఔను, అది మన సంతోషాన్ని దొంగిలించలేదు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    క్రీస్తును గురించి తెలుసు కోవాలనుకుంటున్న వారికి, 30 సెకన్ల తరువాత, ప్రజలు తప్పక పరలోకం వెళతారని తెలుసు కోడానికి, క్రీస్తును వ్యక్తిగతంగా ఎలా తెలుసుకోవాలి?

క్రీడా. రాండీ అల్కార్న్,:    స్తు ఎవరని చూసి తెలుసుకోవాలి, నిన్ను నీవు తెలుసుకోవాలి. నీవు దేవుని నుండి వేరు పరచబడినావు. యేసు క్రీస్తు నేనే మార్గమును, జీవమును, సత్యమును నా ద్వారా తప్ప ఎవరును  తండ్రి వద్దకు రాలేరు అన్నారు. దేవునితోటి సంబంధంలోకి రావాలంటే, క్రీస్తు నీ పాపములకు పరిహారం చెల్లించాడని నమ్మి, ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. దేవునితో సంబంధంలోకి రావడానికి ఇది ఒక్కటే మార్గం.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ప్రియులారా, వచ్చే వారం, మీ  పరలోకాన్ని గురించి వివరించేందుకు రచయిత, Randy సహాయ పడతాడు. మీ పిల్లలు, లేక మీ మనవాళ్ళ ప్రశ్నలకు మీరు సహాయ పడడానికి తగినట్లు మీకు సహాయ కరంగా మేము ఒక కార్యక్రమాన్ని చేయ బోతున్నాం. పరలోకాన్ని గురించి పిల్లలు యేమని ప్రశ్నిస్తారు? పరలోకాన్ని గురించి మనం చాలా సార్లు మాట్లాడు తుంటాము. పెద్దలు చాలా సార్లు, క్రైస్తవ పెద్దలు కూడా పలు మార్లు, పిల్లలకు పొరపాటు జవాబులు చెబుతుంటారు. పిల్లలు అడిగే చిక్కు ప్రశ్నల గురించి మాట్లాడబోతున్నాం. మాతోటి తప్పక కలుసుకోండి.

 

 

మరిన్ని టీవీ ప్రోగ్రామల్ని చుచెందుకు ఉచిత

FREE John Ankerberg Show App download చెసుకొండి

“Pray to Accept Jesus Christ as Your Savior” @  JAshow.org

కాపీరైట్ 2015 ATRI.

 

 

இயேசு திரைப்படம்

கிறிஸ்தவராவது எப்படி

நீங்கள் எப்படி கிறிஸ்தவராக முடியும்? கிறிஸ்தவர் என்பவர் இயேசுவை நம்பி அவருடைய பாதையை பின்பற்றுகிறவனாக இருக்கிறான். நீங்கள் கிறிஸ்தவர் என்பதை அறிந்துகொள்ள வேதம் உங்களுக்கு நேர்த்தியான பதில்களை அளிக்கிறது. கிளிக் செய்யவும்.

ஆடியோ பைபிள்

சீர்திருத்த பாடநெறி