పరలోకమలో ఉన్న విశేష మేమిటి? సీరీస్-1, కార్యక్రమం-2.
పరలోకమలో ఉన్న విశేష మేమిటి? సీరీస్-1,
కార్యక్రమం-2.
ఈ రోజు John Ankerberg Show లో- పరలోకంలోఉన్న విశేష మేమిటి? మీరు Disney Land కు గాని, ASPEN లో మంచు స్కీయింగ్కు గాని, యూరోపేకు గాని వెళ్ళాలని ఆలోచిస్తుంటే వాటి వివరాలు తెలిపే కరపత్రాలను, website లను ముందుగానే పరిశీలిస్తుంటారు, సందర్శక గ్రంధాలు అక్కడికి వెళ్ళాలనే కొరికెను ఎక్కువ చేస్తుంటాయి.
ఐతే పరలోకానికి నడిపించే గ్రంధం బైబిలు. దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశమును మనం చూడబొతున్నామని బైబిలు చెబుతున్నది.
ఐతే ఈ పరలోకం లేక బైబిలు చెబుతున్న క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీ సొంతం కాబోతున్నట్లయితే పరలోకం గురించి మీకు ఏమి తెలుసు? మీరు నిత్యత్వాన్ని గడప బోతున్న స్థలంలో మీరు ఏమి చెయ్యాలని, ఏమి చూడాలని, ఎలాంటి అనుభవాలను పొందాలని ఆశిస్తున్నారు?
ఈనాటి మన అతిధి పరలోకం అనే ప్రక్యాత పుస్తకం రచించిన Dr. Randy Alcorn. మన భవిస్యత్ గృహం- పరలోకంలో క్రైస్తవుల కొరకు దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన అంశాల నీయన వివరిస్తారు. John Ankerberg Show లోని ఈ ప్రత్యెక కార్యక్రమములో మాతో కలుసుకోండి.
***
డా. జాన్ అంకెర్బెర్గ్ : ప్రోగ్రాంకు ఆహ్వానిస్తున్నాం. మన మిక్కడ Dr. Randy Alcorn తో పరలోక జీవితమేల గుంటుంది, పరలోకం చేరేప్పుడు మీ వయసెంత ఉంటుంది? అందరికి భావనాలుంటాయా? పరలోకం లో మనం ఎక్కడ జీవిస్తాం? అక్కడ ప్రయానిస్తామా? అక్కడ మనమేలాంటి దుస్తులు ధరిస్తాము? దేవును వాక్యంలో నుండి ఇలాంద్ట్ ప్రశ్నలకు జవాబులు చెప్పమని Randy ని అడగబోతున్నాం. మరి, Randy, గత వారం మనం కొద్దిగా చర్చించు కున్న ప్రశ్నతో ప్రమ్బించుకుందాం. అదేమిటంటే, పలువురు క్రైస్తవులకు పరలోకం అంటే ఉత్సాహం లేదు. పరలోకం అంటే ఉత్సాహం లేనివారు అదేలగుంటుందని తలస్తున్నారు?.
డా. రాండీ అల్కార్న్,: మంచిది, కొందరు పరలోకం చలాసేపు నడుస్తూ విసుగు పుట్టించే చర్చి అరాధనలా ఉంటుందంటున్నారు. అన్ని ఆరాధనలలో విసుగు పుట్టదనుకోండి. ఐతే, ఇరవై లక్షల ఏళ్ళు ఒకే ఆరాధనఐతే అందరికీ విసుగుస్తుంది. ఈ స్నాగాతినే ప్రజలు తలుస్తున్నారు. మగజైన్ కార్టూన్లో ఒకడు మేఘాలపైన కూర్చుని ఉంటాడు. తలచుట్టూ వెలుగు వలయంతో దేవదూతలు రెక్కలతో పరలోకానికి చేరాడు.
పనిలేకుండా మేఘంపై కూర్చుని ఉన్నాడు. ఒక మగజైన్ తెచ్చుకుంటే బాగుండేదని కిందరాసి ఉంది. పలువురు ఈవిధంగానే తలుస్తున్నారు. పనీ పాటా లేదు, ఎవరితోనూ మాటలు లేవు. ఎక్కడికి వెళ్ళము.
డా. జాన్ అంకెర్బెర్గ్ : దేవుడు ఈ విషయంలో ఏమంటున్నాడో చెప్పండి. ఈ వచనాన్ని చదివి వినిపిస్తాను. ఈ విషయాన్ని గురించి మీరు ప్రజలకు వివరిస్తే బాగుంటుంది.
ప్రకటన 21:2. పరలోకం గురించిన వివరం, అప్ప్స్తాలుడు యోహాను ఇలా వ్రాశాడు. క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశం, మొదటి భూమి గతించి పోయను సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింప బడిన పెండ్లికుమార్తెవలే సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.
అప్పుడు ఇదిగో దేవును నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును,
అప్పుడు ఇదిగో దేవును నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తూడైయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.
మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.
దీనిని గురించి గత వారంలో కొద్దిగా మనం చర్చించుకున్నాం. ఇక్కడ ప్రస్తుత పరలోకం, భవిష్యత్ పరలోకం ఉన్నాయి. భవిస్యత్ పరలోకపు సూచన తెలుస్తున్నది. అంతేకాక ప్రస్తుత పరలోకపు సూచన కూడా తెలుస్తున్నది. రెండిటి బేధాన్ని చెప్పండి. ప్రజలంటున్నారు, “ఇదిగో వేలాకోల? పరలోకం మారిపోతుందా? తమాషాలా?.”
డా. రాండీ అల్కార్న్,: దేవుడు మారని వాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండువాడు. పరలోకం ఒక ప్రత్యెక స్థలంలా ఉంది. దేవుడు సర్వతర్యామి, అనగా ఆయన అన్ని చోట్ల ఉంటాడు. ఐతే నివాసానికోక ప్రత్యెక స్థలాన్ని ఎంచుకుంటాడు. అదే పరలోకం అక్కడ ఆయన సింహాసనమున్నది.
దేవుడు పరలోకాన్ని ఇప్పుడున్న స్థలం నుండి, అది ఉన్నాడని మన మనుకుంటున్న స్థలం నుండి మరొక చోటికి మార్చి. క్రొత్త ఆకాశం క్రొత్త భూమికి మార్చి క్రింద నున్న భూమికి తీసుకొని వస్తాడు.
క్రోతా ఆకాశం, క్రొత్త భూమి ఒకే శిరస్సైన క్రీస్తు క్రింద ఎలా కలుస్తాయో చుబుతుంది. క్రీస్తు యొక్క పేరు ఇమానుయెలు అనగా దేవుడు మనకు తోడు.
అనగా దేవుడు నిత్యం మనకు తోడుంటాడు. క్రొత్త యేరుషలేములో దేవుని సింహాసనంపై యేసు కూర్చుని ఉండటం చూడగలం. తండ్రి కూడా సింహాసనంపై ఉన్నాడని వ్రాసి ఉంది. అనగా దేవుడు తానూ మామూలుగా నివసినచే స్థలాన్ని మార్చగా, క్రొత్త భూమికి రాజధానిగా క్రొత్త యెరూషలేము నగరమయ్యింది. అనగా పునఃనిర్మించబడిన, ఆదునీకరించబడిన క్రొత్త విశ్వానికిది రాజధాని గ్రహము.
డా. జాన్ అంకెర్బెర్గ్ : సరే మల్లి మొదటినుంచి ప్రారంబిద్ధాము, మనం చని పోతున్నప్పుడు ఏమౌతుంది?.
డా. రాండీ అల్కార్న్,: మనం క్రీస్తును విశ్వసించి నట్లయితే, వెంటనే మనం దేవును సన్నిధికి వెళతాం. బైబిలులో ధనికుడు లాజారు కధలో, దేవును గురించి తెలియని ధనికుడు చనిపోయిన వెంటనే వేరొక స్థలానికి, అనగా నరకానికి వెళ్ళాడని బైబిలు చెబుతున్నది.
ఐతే నరక మేమంటే అగ్ని గుండంలో వెయ బడటం. అదే విధంగా, ప్రస్తుత పరలోక మనగా- లాజారు చనిపోయిన తరువాత వెళ్ళిన స్థలం- చివరగా ఆ క్రొత్త భూమిలొకి చేర్చబడుతుంది.
మరణం తర్వాత మనం దేవుని సంనిదిలోనికి వెళ్తాం”దేహమును విడచి ప్రభువు నొద్ద ఉండుటకు ఇష్టపడుచున్నామని” పౌలు చెప్పాడు. మరణించిన వెంటనే మనం పరమునకు వెళ్తాము. అరుదైన వ్యాధితో చనిపోతున్న కుమార్తె ఉన్న ఒక కుటుంబమున్నది, ఆ పాప పేరు ఎమిలీ.
పాపకు అర్ధమయ్యేలా వారిలా చెప్పారు, “చూడు, ఎమిలీ, మనమిప్పుడొక పని చెయ్యాలి. నిన్ను ఒక చక్రాల కుర్చీలో కూర్చుండబెట్టి అటువైపునున్న గదికి తీసుకు వెళ్తాం. ఆ గది తలుపుకు అవతలి వైపున మేముంటాం”.
తరువాత ఒకరొకరుగా గదిలోకి వచ్చారు వారన్నారు, “మన కుటుంభంలో దేవును సన్నిధికి వెళ్తున్న మొదటి వ్యక్తివి నీవే తర్వాత ఒకరోకరంగా మేము నీవద్దకు వస్తాం”.
ఐతే ఈ ఉదాహరణ సరిగా కుదరాలంటే, యేసు క్రీస్తు కూడా ఆమెతో పాటు ఆ గదిలో తప్పక ఉండాలి. కనుక ఆమె గదిలో ఒంటరి కాదు. ఆమె క్రీస్తుతో ఉంటుంది, తర్వాత యేసును ప్రేమించే కుటుంభములోనికి వస్తుంది.
నాకిది మంచి ఉదాహరణ అనిపించింది, ఎందుకంటె మరణం తాత్కాలికంగా వేరుచేస్తుందని అది నిరూపిస్తుంది. ఐతే, తరువాత, దేవుని ప్రేమించే వారు ఆయనను కలుసుకుంటారు.
డా. జాన్ అంకెర్బెర్గ్ : దేవుడు ఇవ్వనైయున్న నూతన శరీరాలను గురించి మాట్లాడుకుందాం, పౌలు 1 కొరిందీ 15 లో చెబుతున్నది:
“పాతిపెట్టబడిన శరీరం నశిస్తుంది”. మృతమైన వారికిది నశించి పోయేది- “శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును”. చేనిపోతున్న వారిని మీరు చూచినప్పుదు అది ఎంతో విషాద దృశ్యం. “బలహీనమైనదిగా విత్తబడినది మహిమ కరముగా లేపబడుతుంది”- వృద్ధులమైయ్యే కొద్దీ బలహీనులమౌతున్నామని మనం గుర్తిస్తాము. మరణ కాలం సమీపిస్తే మనమప్పుడు ఏమీ చెయ్యలేము. ఊపిరి కూడా పీల్చలేము.
“కానీ అది బలమైనదిగా లేపబడును” పౌలు చెప్పినట్లుగా “ప్రకృతి సంబంధ శరీరముగా విత్తబడి ఆత్మ సంబందముగా లేప బడును. ప్రకృతి సంబంధ శరీరముంది గనుక ఆత్మ సంబంధ శరీరముండును”మరియు పౌలు యేసు పునరుత్థాన శరీరాన్ని ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఈ నూతన శరీర మేలాగుంటుందో చెప్పండి.
డా. రాండీ అల్కార్న్,: చూడండి, మనం యేసు శరీరాన్ని చూడొచ్చు ఎందుకంటే, ఆయనను మృతులలో ప్రధమ ఫలమన్నాను. ఆయన్ను శరీరంతో చూసినపుడు ఆయన వాలే ఉంటామట. అనగా యేసు పునరుత్థాన శరీరాన్ని చూసినపుడు మన పునరుత్థాన శరీరం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చుఅన్న మాట.
పునరుత్థాన శరీరంతో యేసు శిష్యులతో చెప్పినది, “నన్ను తాకండి నాది మానవ శరీరం, దయ్యాన్ని కాను దయ్యానికి నావలె మాంసము, ఎముకలు ఉండవు”.
దీన్నుంచి ఏమి నేర్చుకుంటున్నాం, పునరుత్థాన శరీరంలో మాంసము, ఎముకలు ఉంటాయి. ఈ శరీరానికి శాపం వలన వచ్చే మరణం, దుఃఖం, ఏడుపు, వేదన వంటివి ఏవీ ఉండవు. శాపమైన దేదీ దానిలో ఉండదని ప్రకటన చెబుతుంది. యేసు మరణాన్ని జయించాడు. ఆయన శాపాన్ని జయించాడు. శాపాన్ని తొక్కివేసాడు.
మన పునరుత్థాన శరీరంలో యెన్నదూ లేనట్లుగా జీవితాన్ని అనుభవించగలం. ఎందుకంటే పునరుత్థాన జీవిత మెలాగుంటుందో మనం ఊహించగలం. ఆదినాన మనం చాలా ఉత్సాహంగా ఉంటాం, అందంగా కనిపిస్తాం, ఎంతో శక్తి కలిగి జీవితంలో ఇది ఉచ్చ ఘట్ట మనుకుంటాం. వెనుదిరిగి చూసి ఉచ్చఘట్టాన్ని దాటేసా మునుకుంటాం. ఐతే, చూడండి, పునరుత్థానంలో ఉచ్చఘట్టం వేచి ఉంటుంది. దాన్ని ఎన్నడూ దాటి వెల్లము.
డా. జాన్ అంకెర్బెర్గ్ : యేసువాలే మనకు అద్భుత శక్తులు వస్తాయా? అనగా యేసు మేఘాలలో పైకి వెళ్ళిపోయాడు కధా? ఈ క్రొత్త శరీరం ఎంతదూరం వెళ్తుంది?
డా. రాండీ అల్కార్న్,: ఈ సంగతి మనకు సరిగా తెలియదు. మనకు మాత్రమె ఇలాంటి ప్రత్యేక శక్తి ఉన్నదా? ఐతే ఈ శరీరాలు పరిపూర్ణ స్థితిలో ఉంటాయనే సంగతి మనకు తెలుసు. మునుఒఅతి కంటే ఈ శరీరాలు మెరుగుగా ఉంటాయి.
వ్యాధులు ఇకపై ఉండవు. ఉదాహరణకు, యెరూశలేములో వీదులుంటాయని మనకు తెలుసు నగరంలోకి ద్వారాలు కూడా ఉన్నాయి.
అనగా, నగరంలోపల నడిచేందుకు వీధులు, లోకినికి వెళ్లేందుకు ద్వారాలు ఉంటాయన్నమాట. కనుక అందరు రెక్కలతోటి సదా ఎగురుతూ ఉండరు, దారులున్నందున వాహనాలు ఉండొచ్చు. గుర్రాలు లాగే వాహనాలు ఉండొచ్చు. రకరకాల వాహనాలుండవచ్చు.
సాంకేతికత ఉండదనడానికి ఎలాంటి ఆధారాలు కనబడటం లేదు. ఇప్పుడు మన శరీరాలు అనుభవిస్తున్న శరీరాలు అనుభవిస్తాయి. ఐతే లోకంలో శాపము, పాపాలనేవి ఉండవు.
డా. జాన్ అంకెర్బెర్గ్ : మనం దేవదూతలంగా మారం, కదా?
డా. రాండీ అల్కార్న్,: లేదు, పలువురిలా పొరపాటుగా తేలుస్తున్నారు:
చనిపోగానే దెవదూతలా మారడం, చనిపోయిన నా స్నేహితుడు, నా తల్లి, నా బిడ్డ, దెవదూతగా మారి నన్ను కాపాడుతున్నారంటారు. లేదు, దేవును స్వరూపంలో సృష్టించబడిన మానవులు మానవులుగానే ఉంటారు. దేవదూతలు దేవదూతలె ఈ ఇద్దరూ వేర్వేరు జీవులు.
డా. జాన్ అంకెర్బెర్గ్ : మంచిది, ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మేము తిరిగి వచ్చిన తర్వాత మీ అందరి మనసుల్లో ఉన్న ప్రశ్నను అడగ బోతున్నాను. పరలోకం వెళ్ళినప్పుడు మన వయస్సు యెంత ఉంటుంది. ఇక్కడ తొంభై ఐదైతే, అక్కడ ముప్పై మూడవుతుందా? లేక పదవుతుందా? మీ వయస్సు ఎంతవుతుంది? ఎంతుండాలని ఆశిస్తున్నారు. నాలుగేళ్ల మీ బిడ్డ వయసు ఎంతవుతుంది? అక్కడ అతడి వయసెంత? చూస్తూనే ఉండండి త్వరగా వచ్చేస్తాం?
*****************
డా. జాన్ అంకెర్బెర్గ్ : మంచిది, మేము వచేసాం. పరలోకం గురించి బోధించే నిపుణుడు Dr. Randy Alcornతో మాట్లాడుతున్నాం. ఈయనను ఒక ప్రశ్న అడగబోతున్నాం. Randy పరలోకం వెళ్ళినప్పుడు మన వయస్సెంత ఉంటుంది? ఐదేళ్ళ బిడ్డగాని, తొంబై ఐదేళ్ళ వ్యక్తిగాని పరలోకం వెళ్ళినప్పుడు వారి వయస్సెంత ఉంటుంది?
డా. రాండీ అల్కార్న్,: మంచిది, మనం ఆదాము హవ్వాలను గమనిస్తే వారికి కూడా ఒక వయసుంటుంది. వారు ఇప్పుడే సృష్టించ బడ్డారు. ఐతే వారికి కూడా ఒక వయసుంది. ఆ వయసెంత? కచ్చితంగా తెలియదు, కాని వారిద్దరి శరీరాలు పూర్తిగా ఎదిగినట్లు కనిపిస్తున్నది. కనుక యవ్వనంలో ఉండవచ్చు. ఐతే పునరుత్తానంలో మనం ఎక్కడ ఉంటాము.
చూడండి మద్య యుగంలో దీనిని గురించి చాలా మంది చర్చించారు. Peter Lombard, St. Thomas Aquinas ఇలాంటి ప్రముఖ వేదాంతులు మద్య యుగంలో దీన్ని పరిశీలించి పుస్తకాలు వ్రాసారు.
Thomas Aquinas, క్రీస్తు మరణ వయస్సు వలెనే, అందరికీ ముప్పైమూడేళ్ళు వయసుంటుందన్నాడు. ఐతే, ఇది మంచి ఆలోచనే గాని, దీనికి తగిన ఆధారాలు లేవు. ఇరవై ఏళ్ళ వయస్సు తర్వాత పరమునకు వెళ్తామనుకున్నాడేమో. లేదా శరీరం అభివృద్ధి చెందిన తర్వాత వెళ్తామేమూ.
సరే, చాల కాలం బ్రతికి, బాగా పెద్ద వయసులో చనిపోయిన వారు వృద్ధులుగా, కృశించి పోయిన శరీరాలతో పైకెత్తబడరు. వయసు మీరడం శాపం క్రిందికి వస్తుంది. అక్కడ శాపం ఇక ఉండదు.
అది జరగదని మనకు తెలుసు. ఇక చిన్న పిల్లలను చూస్తే, నాలుగేళ్ల వయసు బిడ్డ చనిపోతే, పలువురు తల్లిదండ్రులు బిడ్డలా వయసును పెంచుకుని ఆలోచిస్తూ, వీరు బాగా పెద్దవారుగా పరలోకం చేరతారా? అందరూ, అందరిలా ఉంటారా అనుకుంటారు.
ఇది సాధ్యమే ననుకుంటున్నాను, క్రొత్త భూమిలో, బిడ్డ పునరుత్థానంలో క్రొత్త భూమిలో, దేవుడు నాలుగేళ్ల వయసున్న బిడ్డను, నాలుగేళ్ల బిడ్డగా పైకి లేపి, అక్కడ వారిని పరిపూర్నులుగా చేస్తారు. అది నిజమైతే అది సహస్రాబ్ధిలొనొ లేక క్రొత్త భూమిలోనో జరిగితే, అది నిజమైతే, హాయిగా పెరిగి పద్దవాడవ్వ వలసిన తమ బిడ్డ జీవితం నష్టమైపోయిందని తలచే తల్లిదండ్రులకు ఈ సంగతి గొప్ప ఆదరణను అందిస్తుంది.
క్రొత్త భూమిలో తాము ఎదగడం చూసే అవకాసం కూడా వారికున్నది. ఇలా జరిగితే, ఇది వారికి సదవకాశం, ఎందుకంటే బిడ్డకు ఎమౌతుందోననే ఎలాంటి దిగులు లేకుండా, వాడు పెరగడం చూస్తూ వీరు ఆనందంగా గడపగలరు.
డా. జాన్ అంకెర్బెర్గ్ : ఔను, పలువురు వృద్ధులు ఇలా చెప్పడం మీరు విని ఉంటారు. “వృద్ధునిలా ఉన్నాను, వృద్ధునిలా తలంచను కనుక దేవుడు దీన్నెలా నడిపిస్తున్నాడో మీకు అర్ధమౌతుంది. యవ్వనులమనే భావం మీలో ఉందిగాని, శరీరంలో ఆశక్తి లేదు.
ఒక వేళ ఆ సామర్ధ్యముంటే? ఆ కోరిక మనసులో ఉంది. దేవుడు దాన్ని హెచ్చిస్తాడు మనం అనుకునే దానికంటే, ఊహించే దానికంటే దేవుడు అధికంగా చేయగలడనే అంశాన్ని గురించి కొద్దిగా మాట్లాడుకుందాం”.
బలాన్ని గురించి చెప్పండి. ఆదాము హవ్వలతో పోల్చండి. ఇక్కడ ఒక అధ్యాయముంది. ఇక్కడ ఆదాము హవ్వలను, ఇప్పుడున్న మనుష్యులతో పోల్చిచూస్తే నిజంగా ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మీరు దాన్ని గురించి ఏమంటారు?
డా. రాండీ అల్కార్న్,: చూడండీ, మన శరీరా లెంత క్షీణించి పోయాయో గమనించడం లేదు. ఏదేను వనంలో ఉన్న ఆదాము, హవ్వలను మనం గమనిస్తే వారి సౌందర్యాన్ని, వారి బలాన్నీ, సామర్ధ్యాన్నీ చూసి ఆశ్చర్య పోతాం. ఆదికాండం మూడవ అధ్యాయంలో ఏం జరిగిందంటే, పాపం లోకంలోకి వచ్చింది. వెంటనే శాపం మన మీదికొచ్చింది. “దీని తినినచో నిశ్చయముగా చచ్చెదరు” తినినా చావలేదని మనమంటాం. తిన్న తర్వాత, దాదాపు తొమ్మిదొందల ఏండ్లు బ్రతికారు కధా!
నిజమే, ఆ తరవాత జీవిత కాలం తగ్గిపోయింది. ఆ శాపం వలన వచ్చిన ఫలితం తరువాతి కాలంలో మరింత తీవ్రమయ్యింది. పునరుత్థానంలో మనుష్యులేలా ఉంటారంటే, దేవుడు తలంచిన విధంగా అద్భుతంగా ఉంటారు. పునరుత్థానం కనిపించే సుందర దృశ్యం ఇదే.
ఐతే పునరుత్థానంలోనూ, ఆ తరువాత కూడా, మనం గుర్తించుకోవాల్సిన అంశమేమిటంటే, దేవుడు ఏదేనునూ మన శరీరాలనూ పునరుద్ధరించడమే కాక మరింతగా మెరుగు పరుస్తాడు. సిలువ పైన క్రీస్తు యొక్క పాప పరిహారార్ధ బాలి అద్భుతమౌతుంది. ఎందుకంటే, అది మానవాళికి మాత్రమె అన్వయించడం కాక, పాపంలో పతన మైన సృష్టి మొత్తానికి అన్వయిస్తుంది. సృష్టి యావత్తు పునరుత్తానంలో నూతనీకరించ బడుతుంది.
డా. జాన్ అంకెర్బెర్గ్ : ఔను, శాస్త్రజ్ఞుడు, Einstein కు IQ- 361 ఉండేదని కొందరు చెబుతున్నారు. దేవుడు మన IQ ను 1000 కి వచ్చేలా హెచ్చిస్తే అన్నిటినీ మనం అధికంగా అర్ధం చేసుకుంటాం. మన శారీరక సామర్ద్యాలకు, కన్నులతో చూడటం, వాసన పట్టడం వంటి వాటికీ ఇది వర్తిస్తుంది.
దేవుని గురించి చెబితే, ఆయనకు అనేక పరిమాణాలు, వివిధ రకాల గునలక్షనాలు ఉన్నాయి. వాటినిప్పుడు చర్చించడం లేదు, ఎందుకంటే వాటన్నిటిని చర్చించే సామర్ధ్యం మనకు లేదు. ఐతే ఈ క్రొత్త శరీరాలతో దేవుడు మనకు లేదు. ఐతే ఈ క్రొత్త శరీరాలతో దేవుడు మనకు దాన్ని చూపిస్తే అది మన ఊహలకు ఏమాత్రం అందనంత అద్భుతంగా ఉంటుంది. వాక్యం ఈ సంగతుల్ని చూచాయగా చెప్తున్నది. పరలోకంలో మన మెక్కడ ఉంటామనే అంశాన్ని చర్చిద్దాం. అక్కడ మన గృహాలు ఏ విధంగా ఉంటాయి? మనం ఎక్కడ నివసిస్తాము? ఈ గృహంలో మనం సౌకర్యంగా ఉండగలమా?
యేసు యోహాను 14 లో “నా తండ్రి యింత అనేక నివాసములు కలవు”, మరొక అనువాధములో “భావనాలని” ఉన్నది. “మీకు స్థలము సిద్ధ పరుస్తాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినచో నేనుండు స్థలములో మీరునూ ఉన్డులాగున మరలా వచ్చి మిమ్మును తీసుకొని పొవుదును”.
అదేలాంటి స్థలమని ప్రజలు తెలుసుకో దలిచారు. మనం ఎలాంటి ఇంటిలో ఉండబోతున్నాము. అక్కడ ఎక్కువ మంది ఉంటారా? వీటికి జవాబు చెప్పండి.
డా. రాండీ అల్కార్న్,: మొదటిగా పరలోకం అనగా ప్రజలు నివసించేస్థలం. ఆ పదం ‘నివాసం’ అని అనువదించబడి, TOPOS, స్థల వర్ణన దీన్లోనుంచే వచ్చింది. నిజంగా ఇదొక స్థలం. పునరుత్థానంలో మనదరికీ శరీరాలు ఉంటాయి. శరీరాలకు స్థలం కావాలి.
పరలోకం గురించిన ముఖ్యమైన అంశం, మన మందారం యేసుతోటి కలిసి ఉంటాం.
ఐతే యోహాను 14 యొక్క కొన్ని అనువాధాలు, గొప్ప విశాల స్థలంలో గదులుంటాయని చెప్తున్నాయి. మరికొన్ని అనువాదాలు ఈ పెద్ద విశాల స్థలంలో వేర్వేరుగా నివాస స్థలాలు ఉంటాయంటూన్నాయి.
ఐతే లూకా 16 లో మనం దేవుని ఐశ్వర్యాన్ని ఇతరుల జీవితాలలో పెట్టుబడి పెట్టే విధంగా వాడాలని చెప్తున్నది. అప్పుడు దేవుని రాజ్యంలో పరలోకంలో, అక్కడున్న నివాసాలలోకి మనకు ఆహ్వానం వస్తుంది. అనగా ఇవి ఒక్కొక్కరి కోసం ప్రత్యేకంగా నిర్మించబడిన గృహాలు, క్రొత్త భూమిలో ప్రయాణం చేస్తూ ఈ గ్రుహాలలోకి వెళ్తాం.
కనుక ఇది గొప్ప ఆలోచన, దీనిలోని ముఖ్యాంశమేమిటంటే, మనం యేసుతో ఉన్నాం. అంతేకాక ఒకరోకర్తో ఉన్నాం. అంతేకాక మనకు ప్రత్యేకంగా సొంతానికి ఒక స్థలమున్నది.
డా. జాన్ అంకెర్బెర్గ్ : అక్కడ మనం ఎలాంటి దుస్తులు ధరిస్తాము?
ఎలాంటి దుస్తులు ధరిస్తాము?
డా. రాండీ అల్కార్న్,: చూడండి, క్రీస్తు కోసం చనిపోయిన హతసాక్షులు పరలోకం వెళ్లి అంగీలను ధరిస్తారని మాత్రం తెలుసు. కనుక పలువురు మనం పరలోకంలో అంగీలు ధరిస్తా మంటున్నారు. ఐతే ఆకాలంలో ప్రజలు అంగీలను మామూలుగా ప్రతీ దినం ధరించేవారు.
కనుక ఒక విధంగా చూస్తే, మనం మామూలుగా ధరించే దుస్తులనే ధరిస్తామని చెప్పాలి. కనుక వివిధ సంస్కృతులలోంచి వచ్చిన వారు పాత భూమిలొ వారు ధరించిన దుస్తులనే ఈ కొత్త భూమిలొ ధరిస్తారని నేను అనుకుంటున్నాను.
డా. జాన్ అంకెర్బెర్గ్ : మనకు భావలుంటాయా? అక్కడ విందులు ఉంటాయా? కుటుంబంగా కూడా కావడం ఉంటుందా?
డా. రాండీ అల్కార్న్,: చూడండి, మనం దేవుని స్వరూపంలో చేయబడ్డాము. మరి, దానికి ఫలితంగా, మనలో భావాలున్నాయి. ఆలోచనలున్నాయి. ఇతరులను ప్రేమిస్తున్నాము, కలిసి ఉండాలని కోరుతాం. విందు లంటే ఇష్టం.
ఐతే మనలో పలువురు ప్రజలు విందు వినోదాలంటే చెడు కార్యాలు చేయడమని తలుస్తారు. ఐతే నిజానికి, బైబిలు కాలంలో విందులంటే ప్రజలందరూ కూడుకొని ఆనందంగా గడపడం. ఆ విందులని తలంచండి. ఇశ్రాయేలీయుల చరిత్రలో అందరూ కూడుకునే పండుగ విందుల గురించి ఆలోచించండి.
గంటల తరబడి సాగేవిందులు భోజనం బల్లవద్ద కూర్చున్నప్పుడు- దేవుని రాజ్యంలో మనం భోజనం బల్లవద్ద కూర్చుని కలిసి భోంచేస్తూ కధలు చెప్పుకునే కాలాన్ని గురించి తలంచండి.
జరిగిన సంగతుల్ని గురించి ఎలా చెప్పుకుంటామో ఆలోచించండి. “ఆకాశ నక్షత్రాలను చూసి నేను ఈ రోజు ఇది గ్రహించాను. పర్వతాల మధ్య నడుస్తున్నప్పుడు, యేసు కోసం ఈ పని చేస్తుండగా దీన్ని గ్రహించాను. ఈ పని చేసాను, నేనీ సంగతిని కనుగొన్నాను”.
ఒకరికి ఒకరం చెప్పుకుంటాం. గతంలో మనం భూమిపైన నివసించిన కాలంలో దేవుడు మనయెడల జరిగించిన క్రియల్ని మనం అర్ధం చేసుకోలేక పోయామనే అంశాన్ని గురించి చర్చిస్తా మనుకుంటాను.
డా. జాన్ అంకెర్బెర్గ్ : తానూ తప్పక పరలోకం వెళ్తానని మనిషికి ఎలా తెలుస్తుంది?
డా. రాండీ అల్కార్న్,: మొదటి యోహాను 5 లో- మీకు నిత్య జీవమున్నదని తెలుసు కొనునట్లు ఈ సంగతులను వ్రాయుచున్నాను. ఎవరికి వ్రాశాడు? దేవుని కుమారునియందు విశ్వాస ముంచువారికి. మన విశ్వాసాన్ని క్రీస్తు నందుంచితే కలిగే సహవాసం వలన మనకు నిత్యజీవం లభిస్తుంది.
ఇలా నీవు దేవుని బిడ్డలౌతారు. పశ్చాత్తాపంతో జీవితాన్ని యేసుకు అర్పించి క్షమాపణ అడగండి. మన తప్పులకు వెల్లవలసినది పరలోకం కాదు. నరకానికెల్లాలి. కారణం మనం పాపం క్రింద ఉన్నాం.
ఐతే సిలువపై యేసు మన పాపాల్ని భరించాడు. విశ్వాసాన్ని ఎసుపై నిలిపి ఆయన బలియర్పణ రక్తాన్ని అంగీకరిస్తే, మనము నీతిమంతులముగా తీర్చబడి, పరలోకం చేరి క్రీస్తుతో నిత్య కాలం ఉండగలం.
డా. జాన్ అంకెర్బెర్గ్ : మంచిది ప్రియులారా! వచ్చేవారం తప్పక చూడండి. పరలోకంలో జంతువులూ ఉంటాయా అనేది చర్చించబోతున్నాము. పెంపుడు జంతువులను అక్కడ కలుసుకుంటారా? అక్కడ తిని త్రాగుతామా? అక్కడ నిద్ర పోతామా? అక్కడ ఇతరులతో మనకెలాంటి సంబంధాలుంటాయి? ఇలాంటి ప్రశ్న లన్నిటినీ వచ్చేవారం చూద్దాం. తప్పక ప్రోగ్రాంను చూడండి.
మరిన్ని టీవీ ప్రోగ్రామల్ని చుచెందుకు ఉచిత
FREE John Ankerberg Show App download చెసుకొండి
“Pray to Accept Jesus Christ as Your Savior” @ JAshow.org
కాపీరైట్ 2015 ATRI.
இயேசு திரைப்படம்

கிறிஸ்தவராவது எப்படி
நீங்கள் எப்படி கிறிஸ்தவராக முடியும்? கிறிஸ்தவர் என்பவர் இயேசுவை நம்பி அவருடைய பாதையை பின்பற்றுகிறவனாக இருக்கிறான். நீங்கள் கிறிஸ்தவர் என்பதை அறிந்துகொள்ள வேதம் உங்களுக்கு நேர்த்தியான பதில்களை அளிக்கிறது. கிளிக் செய்யவும்.