పరలోకమలో ఉన్న విశేష మేమిటి? సీరీస్-1, కార్యక్రమం-3.

పరలోకమలో ఉన్న విశేష మేమిటి? సీరీస్-1,

కార్యక్రమం-3.

 

ఈ రోజు John  Ankerberg Show లో- పరలోకంలోఉన్న విశేష మేమిటి? మీరు Disney  Land కు గాని, ASPEN లో మంచు స్కీయింగ్కు గాని, యూరోపేకు గాని వెళ్ళాలని ఆలోచిస్తుంటే వాటి వివరాలు తెలిపే కరపత్రాలను, website లను ముందుగానే పరిశీలిస్తుంటారు, సందర్శక గ్రంధాలు అక్కడికి వెళ్ళాలనే కొరికెను ఎక్కువ చేస్తుంటాయి. ఐతే పరలోకానికి నడిపించే గ్రంధం బైబిలు. దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశమును మనం చూడబొతున్నామని బైబిలు చెబుతున్నది. ఐతే ఈ పరలోకం లేక బైబిలు చెబుతున్న క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీ సొంతం కాబోతున్నట్లయితే పరలోకం గురించి మీకు ఏమి తెలుసు? మీరు నిత్యత్వాన్ని గడప బోతున్న స్థలంలో మీరు ఏమి చెయ్యాలని, ఏమి చూడాలని, ఎలాంటి అనుభవాలను పొందాలని ఆశిస్తున్నారు?

ఈనాటి మన అతిధి పరలోకం అనే ప్రక్యాత పుస్తకం రచించిన Dr. Randy Alcorn. మన భవిస్యత్ గృహం- పరలోకంలో క్రైస్తవుల కొరకు దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన అంశాల నీయన వివరిస్తారు. John Ankerberg Show లోని ఈ ప్రత్యెక కార్యక్రమములో మాతో కలుసుకోండి.

 

*****

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మా కార్యక్రమానికి స్వాగతిస్తున్నాము. మహిమ నిండిన పరలోకాన్ని గురించి మనం చర్చిస్తున్నాము. పరలోకంలో మనం ఏమి చెయ్యబోతున్నాము? పరలోకం ఎలాగుంటుంది? ఈ రోజు మన నిపుణుడు Dr. Randy Alcorn తోటి మాట్లాడబోతున్నాము. ఈ దేశంలో పరలోకం అనే అంశంపై అతడు నిపుణుడు. దీనిపై అతడు 47కు మించిన పుస్తకాలు వ్రాశాడు మరి. ప్రియులారా, ఈ రోజు మనం ప్రకటన 21:2,3 తో ప్రారంబించుకుందాం. “అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించి పోయెను సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింప బడిన పెండ్లికుమార్తెవలే సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని అప్పుడు ఇదిగో దేవును నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తూడైయుండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని”.

Randy, మరణము ఇక ఉండదని, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఇక్కడ ఉండదని ప్రకటన గ్రంధం 21వ అధ్యాయం చెబుతున్నది. దేవుడు వీటన్నిటిని, వ్యాధులను, వేదనను మరణాన్ని మన వద్దనుండి తొలగిస్తాడు. ఇక్కడ చెప్పబడిన ఈ స్థలానికి మనం వెళతామని దేవుడు చెబుతున్నాడు. ఈ వారం కొత్తగా కలుసు కుంటున్న ప్రజల కోసం వివరాలను తెలుపుదాం. ఇప్పుడున్న పరలోకం గురించి మాట్లాడుతున్నాం;  మనమిప్పుడు మరణించి నట్లయితే- ఇక్కడ ఒక పరలోకముంది; అదేలాగుంటుంది? ఇది నిజంగానే ప్రజలకు మరొక కొత్త అంశం కనుక భవిష్యత్ పరలోకం ఏమిటి? దీన్ని వివరించండి.

డా. రాండీ అల్కార్న్,:    మీరు ఇప్పుడు చనిపోతే ప్రస్తుతమున్న పరలోకానికి వెళతారు. తత్వశాస్త్రములో దీనిని మధ్యంతర పరలోకం అన్నారు. నాకు ఈపదం నచ్చదు గాని దీన్నే వాడుతున్నారు. ఐతే ప్రస్తుత పరలోకం ఎక్కడున్నా మీరుదాన్లో యేసును కలుసుకుంటారు. మన లోకానికి వెలుపల ఎప్పుడో పరలోకం ఉన్నాడని మనకు తెలుసు దీనిని మనము చూడలేము. ఐతే రెండవ రాజులు ఆరవ అధ్యాయములో దీన్ని గురించిన ప్రశక్తి ఉన్నది. ఎలీషా తన సేవకుని కన్నులు తెరువుమని ప్రార్ధిస్తున్నారు. ఆ సేవకుడు, తన ఎదుట అగ్ని గుర్రములను, రధములను, సైనికులను చూస్తున్నాడు. వారు ఉన్నట్లుంది అకాడకు వచ్చి చేరుకొని ఉండరు కధా! వారు మొదటే అక్కడ ఉన్నారు. ఎలీషా సేవకుడు మొదట వారిని చూడలేక పోయాడు. కనుక పరలోకం అనేది మన ప్రకానే ఉన్నాడని కొన్నిసార్లు మనకు మర్మగర్భితంగా, సూచన ప్రాయంగా తెలియ వచ్చుగాని, అది కనపడక పోయినా, అది ఇక్కడే ఉన్నది. అది శారీరకం, అది వాస్తవం, అది నిస్సంశయం. ఐతే సాధారనముగా కాన పడదు. ఇక భవిష్యత్ పరలోకమనగా క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇది జగత్తుకు ఒక పర్యాయ పదమని చెప్పవచ్చు. విమోచన పొందిన జగత్తు, దీనిలోనే మనం నిత్యకాలం జీవించబోతున్నాము. దేవుడు క్రిందికి దిగివచ్చి తన ప్రజల మధ్యన నివసించబోతున్నాడు. కనుక ప్రస్తుత పరలోకం యేసుతో ఉండటమే భవిష్యత్ పరలోకం యేసుతో ఉండటమే. రెంటికీ వ్యత్యాసమేమంటే, ప్రస్తుత పరలోకం ఇక్కడ క్రింద ఈ లోకంలో లేదు. భవిష్యత్ పరలోకం ఈ భూమిపైన ఉంటుంది. పరలోకం, భూమి క్రీస్తునందు ఏకముగా సమకూర్చ బడతాయని ఎఫెస్సీ పత్రిక మొదటి అధ్యాయం చెబుతున్నది.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    నిజమే మనమందరం వెళ్ళబోతున్న క్రొత్త యేరుషలేమును గురించి చెప్పండి, ఈ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద సుందర నగరంలో నివసించడమంటే ఏమిటి? ఈ నగరం ఎంత పెద్దది? ఈ నగరంలో మనం ఏయే సంగతులను చూడబోతున్నాము? ఇప్పుడు అది ఎలాగున్నదో చెప్పండి.

డా. రాండీ అల్కార్న్,:    ఇది పెద్దదని మనకు తెలుసు. మనుష్యుని కొలత చొప్పున కొలకర్రనుపయోగించి దూతలు కొలవగా అది 1400 కోసులు. చూడండి క్రొత్త యేరుషలేమిప్పుడు పరలోకంలో ఉన్నది, మరియు భూమిపైకి దించబడనైయున్న ఆ నూతన యేరుషలేము యొక్క కొలతలే యివి. ఐతే, ఇది అక్షరాల చెప్పబడలేదు ఉపమేననేవారికి కుడా, ఇది ఉపమానమే ఐతే, అది ఆ నగర పరిమాణము బహు భారీయైనదని తెలియ చేయుచున్నది. దానిలొఉన్న పనులకు కావలసినంత స్థాలమున్నదని తెలుస్తున్నది- అధికమైన స్థల, పనులు చేసేందుకు, వెళ్లేందుకు, ప్రజల్ని చూసేందుకు.  ఆయన దాసులు ఆయనను సేవిస్తారని ప్రకటన 22 చెబుతున్నది. సేవకులకు చేసేందుకు పనులు ఉండవా? దేవుని మహిమార్దం మనం లోకాన్ని ఎలుతామని వాక్యంలో చెప్పబడి యున్నది. ఏలికలకు ఎప్పుడైనా పనులు తక్కువౌతాయా? కనుక మనకు నిజంగానే ఎక్కువ పని ఉంటుంది. దానిలోని ఆనదమైన అంశమేమిటంటే, సమస్త మేళ్లకు, సంతోషానికి కర్తయైన దేవునిలో మనం ఉంటాము.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    నూతన నగరములో ప్రవహించే జీవజల నధిని గురించి వివరించండి. అదేమిటి? అది మనకెందుకు అవసరము?.

డా. రాండీ అల్కార్న్,:    జీవజలముల నధి సింహాసనము ప్రక్క నుండి క్రిందికి ప్రవహిస్తునట్లుగా ఉన్నది, ఎందుకంటె, ఇక్కడ జీవ ఫలముల వృక్షం, నధికి ఇరువైపులను పెరుగుతున్న ఈ జీవ ఫలముల వృక్షం అక్షరాలా ఉన్నది. జీవ వృక్షాన్ని చూస్తున్నాం. చక్కని పండ్లు కాస్తున్న ఈ వృక్షం, ఏదేను వనములో ఉన్నది. వారు ఆ వృక్ష ఫలాలను ఇతర వృక్ష ఫలాలను తింటారు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మాత్రం వారు తిన కూడదు. ఐతే ఏదేను వనం తలుపులు మూయబడినప్పుడు అదృశ్యమైపోయిన జీవవృక్షం, సామెతల గ్రంధములో ఉపమానాలంకార రూపంలో రెండు సార్లు ఉపయోగించ బడింది. ఐతే ప్రకటన రెండులో అక్షరాలా వాద బడి యున్నది. జీవ వృక్షం దేవుని పరదైసులో ఉన్నాడని ఈ అధ్యాయం చెబుతున్నది. ఆ తరువాత చివరగా ప్రకటన 22వ అధ్యాయములో, జీవ వృక్షం నధికి ఇరువైపులా పెరుగుతున్నది. అది నెల నెలకు ఫలించు చున్నట్లు వ్రాయబడింది. కనుక ఈవృక్షం ప్రజలకు పోషణనూ, జీవాన్ని ఇస్తున్నదని మనం గ్రహించాలి. ఐనా మనం అసంపూర్నులమే. మనకు అవసరత ఉంటుంది. రెంటికీ బేధమేమంటే, మన అవసరాలు తీరుతుంటాయి మనము ఎన్నడు తినము అనికాదు, ఎన్నడు ఆకలి వెయ్యదని కాదు, తినడానికి ఆహారం సంవృద్దిగా ఉంటుంది.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మంచిది ఈ అంశాన్ని మరింత లోతుగా చర్చిద్దాం.ఇక్కద ఒక నగరమున్నది, నూతన యేరూషలేము, దాని పొడుగు 1400 మైళ్ళు,  దాని వెడల్పు 1400 మైళ్ళు, ఎత్తు  1400 మైళ్ళు. ఇది కేవలం ఒక్క నగరం, మధ్యన సుందరమైన నధి ప్రవహిస్తున్నది. నగరం మధ్యనుండి ప్రవహిస్తున్నందున పొడవు కనీసం 1400 మైళ్ళు ఉండాలి. ఈ బంగారపు వీధుల గుండా, చిన్న చిన్న కాలువలు ప్రవహిస్తూ ఉండవచ్చునని మీరు చెప్పారు. ఈ నది నీటిని త్రాగడం, వృక్ష ఫలములను తినడం ఊహిస్తే, ప్రకట గ్రంధం చెబుతున్న విషయాల్ని మనం తెలుసుకోగలం. ఇదంతా ఎలాగుంటుందని మీరనవచ్చు. నగరంలో ఇంకా వేటిని చూడగలం?

డా. రాండీ అల్కార్న్,:    దేవుని చూడగలమని వాగ్ధానమున్నది. ఐతే కొంత మందికీ సంగతి భయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే యెవరునూ దేవుని చూడలేరని, చూసి బ్రతకలేరని పాత నిబంధన చెప్తున్నది. ఐతే దీనికి కారణం మనలోని పాపమే. ఏదేను వనములో దేవుడు క్రిందికి దిగివచ్చి ఆదామితో మాట్లాడిన అతడు చనిపోకుండా బ్రతికే ఉన్నాడు. ఐతే పరలోకం లోకి వచ్చినప్పుడు దేవుని చూడటానికి మనము భయపడటం మొదలు పెట్టాము. ఐతే క్రిస్తుయోక్క నీటిలో మనం కప్పబడిన తరువాత, నీతి మంతులముగా మారి దేవుని సన్నిధిలో ఉంటామని చెప్పాబడింది. కనుక యేసు క్రీస్తును ప్రేమించి, ఆయన రక్తంలో కప్పబడిన వ్యక్తి, దేవుని చూడడంలో సమస్త మేళ్లను పొందగలడు అదే అతని ఆనందానికి, సౌందర్యానికి మూలాధారం. ఐతే యేసు క్రిస్తుని  వ్యక్తి, ఆయనతోటి వెంటనే సంబంధంలోకి ప్రవేశించాలి, పశ్చాతాముతో సుదీకరించ బడితే, దేవుని చూసినప్పుడు ఆనందించగలడు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మంచిది, ప్రియులారా ఇది చక్కని అంశం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మనం విరామం తరువాత తిరిగివచ్చిన వెంటనే పరలోకంలో ఏం తిన్తామనే అంశాన్ని చూద్దాము. పరలోకంలో మనం నిద్రపోతామా? అక్కడ పరలోకంలో జంతువులుంటాయా? మీరు ప్రేమించిన పెంపుడు జంతువును అక్కడ కలుసుకుంటారా?. నిజమే, ఆసక్తికరమైన ప్రశ్నలు. విరామం తరువాత వచ్చి రండీని ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పమని అడుగుదాం. చూస్తూ ఉండండి.

*********

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మంచిది, మేము మళ్ళీ వచ్చాం. ఇక్కడ Dr. Randy Alcorn తో చర్చిస్తున్నాం. పరలోకమనే అధ్బుతమైన అంశాన్ని గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశాన్ని గురించి చర్చించ దలచాను. Randy, పరలోకంలో జంతువులున్నాయనేందుకు బైబిలులో ఏమైనా అధారాలున్నాఎమో చెప్పండి. ఆ తరువాత మరొక అంశం, అక్కడ ప్రజలు, క్రైస్తవులు, ఈ లోకంలో పెంపుడు జంతువులను పెంచి ఉంటే పరలోకంలో తమ పెంపుడు జంతువుల్ని కలుసుకుంటారా? మంచిది ఆధారం చూపే వచనంతోటి ప్రారంబిద్దాం. 2 రాజులు 2:11 ప్రాకారమ ఎలియా గుర్రములు లాగుతున్న రధములొ పరలోకానికి వెళ్ళాడని అందరికి తెలుసు. పరలోకంలో అనేక గుర్రాలున్నాయని ప్రకట 6:2,8 వచనాలు చెబుతున్నాయి. నిజానికి, మొత్తం పరలోక సైన్యసమూహము, విమోచించబడిన పరిశుద్దులందరూ క్రీస్తు రెండవ రాకడలో ఆయనతో కలిసి తిరిగి రావడానికి చాలినన్ని గుర్రాలు ఉన్నాయి. కనుక, అక్కడ అధిక సంక్యలో గుర్రలున్నాయి. ఇవి కాక ఇంకా ఏయే జంతువులు పరలోకంలో ఉంటాయి?

డా. రాండీ అల్కార్న్,:    మంచిది,మొదటగా,  పరలోకంలో  గుర్రలున్నట్లయితే, ఇతర  జంతువులూ కూదా  తప్పక ఉండి ఉండాలి  . ఎందుకంటే పరలోకంలో ఒక జంతువు  ఉన్నాడని  చెప్పగానే, ఆ  జంతువును గురించి  ఎందుకన్ని చర్చలు?  చూడండి దీనికొక  ప్రత్యెక కారణముంది, ఎందుకంటే  ఇది ఏలియా వాలే  అక్కడికి వెళ్ళిన  వారితో పాటుగా  మనమును ప్రభువు  రెండవ రాకడలో  ఆయనతో వచ్చునప్పుడు  గుర్రములపై వస్తాము.  అందుకే ఇది  మనకు తెలియ  చేయబడింది.  మరి ఇతర  జంతువుల సంగతేమిటి?  చూడండి ప్రస్తుత  పరలోకంలో ఉన్న  జంతువుల సంగతి మనకు  అంతగా తెలియదు ,     జంతువుల గురించి  ఎక్కువగానే తెలుసు.  దీనికి కారణ  మేమిటంటే క్రొత్త  భూమికి అన్వయించే  యెషయా 60 లోని  వచనాలు రెండు  మార్లు ప్రకటన ప్రకటన 21-22లో ప్రస్తావించ బడ్డాయి. ఆ అధ్యాయంనిండా జంతువులే, ఆ అధ్యాయం  గురించి, గుర్రములను గురించి,  గాడిదలను గురించి రకరకాల జంతువులను గురించి చెబుతున్నది. యెహెజ్కేలు 47, క్రొత్త భూమిని గురించి వివరిస్తున్నది.  అధ్య్యయం, అక్కడ చేపలున్న వన్నది. చేపలు విస్తారముగా ఉన్నవాట. అందుకే ఈ అంశాన్ని చూడగలం.

ఐతే రోమా 8 ఈ విషయాన్ని స్పష్టము చేయు చున్నది. ఆ అధ్యాయములోని అంతరార్ధాన్ని నేనెన్నడు మరిచిపోను, మొదట దానిని చదవడం ప్రారబించినప్పుడు క్రొత్త భూమిలో ఇతర ప్రాణులుంటాయని నాకు తెలియదు. దాన్ని చదివిన తరువాత ఈ అంశాన్ని గురించిన నా అభిప్రాయాలన్నీ మారిపోయాయని గ్రహించాను. నాకు జంతువులంటే ప్రేమ అని తలుస్తుందే వాడిని. క్రొత్త భూమిలొ జంతువులున్నాయని తలచుకుంటే నాకు మనసులో అమితమైన సంతోషం కలుగుతుంది. సృష్టి యావత్తు ప్రసవ వేదన పడుచున్నాడని రోమా 8 చెబుతున్నది. సృష్టి యావత్తు మూలుగు చున్నాదని ఈ వాక్యం చెబుతున్నది. మానవుని మిగతా సృష్టి నుంచి వేరుపరిచి తరువాత, సృష్టి యావత్తు అని చెప్తున్నది. కనుక ఇది కేవలం మానవుల వేదనను గురించి మాత్రమే కాదు.

సరే, యావత్ సృష్టిలో ఇతర ప్రాణులు ఏవి వేదన పడుతున్నాయి. చూడండి, జంతువులూ బాధపడతాయనే సంగతి సుస్పష్టం. ఆ తరువాత, ప్రసవ వేదన పడుతూ మూలుగుతున్న యావత్తు సృష్టిలో ఒక భాగంగా, దేవుని పిల్లలు పునరుత్థాన సమయంలో లభించే విమోచనను అనుభవించ బోతున్నారని ఈ వచనం చెబుతున్నది. మంచిది, కనుక మనుష్యులవాలే జంతువులూ కూడా, పునరుత్థానంలో విమోచన పొందుతాయయని ఈ వచనం చెబుతున్నాట్లున్నది. దేవుడు వాటిని మరలా పునః సృష్టించ గలడని అనిపిస్తున్నది అంతే కాక ఈ వాక్యం, క్రొత్త భూమిలొ ఈ నూతన సృష్టిలో జంతువులు ఉండటం మాత్రమె కాక, ఇప్పుడు వేదన పడుతున్న కొన్ని జంతువులూ, ఆ వేదనలోనుండి విమోచన పొంది ఎలాంటి బాధలు మరణము లేకుండా సంతోషాన్ని అనుభావిస్తా యనిపిస్తున్నది.

మంచిది, ఇప్పుడొక ప్రశ్న వస్తున్నది, మరి నూతన సృష్టిలో భాగంగా ఉండేందుకు దేవుడు ఏయే జంతువుల్ని ఎంపిక చేసుకుంటాడు? మనం జీవితంలో ఎక్కువగా ప్రేమించి, గౌరవించే దైవ జనులను దేవుడు చేర్చుకున్నట్లే, మనం ఇంట్లో ప్రేమగా పెంచుకుంటూ ఉండే జంతువులను కూడా దేవుడు చేర్చుకూడా? నాకు నా భార్యకు కుక్కలంటే ఎంతో ప్రేమ, మా ఇంట్లో చాలా కుక్కలున్నాయి. దేవుడు ఆ జంతువుల మూలమ్గా మా జీవితాలలో గొప్ప పరిచర్య చేసాడు. మనల్ని చూడగానే పైకి యెగిరి దూకి, మనమెలాగున్నా మన ముఖాన్ని ప్రేమగా నాకే కుక్కను ప్రేమించకుండా ఉండటం చాలా కష్టం. అది షరతులు లేని ప్రేమ, దానిలో ఆనందమున్నది. తన సృష్టిలో తానూ ఉన్నానని దేవుడు చెబుతున్నాడు. అదిప్పుడు నిజమైతే, రాబోయే యుగాలలో ప్రజలను వారి పెంపుడు జంతువులతో కలుపుతాడు కదా? – ఈ సంగతి బైబిలులో లేదు గాని- కలపడం నిజమే కావచ్చును. ఎలాంటి బాధలు, ఎలాంటి దుఃఖము, మరణము లేని లోకంలో మనం వాటితో సంతోషంగా గడపగలం. మనం సృష్టిని గమనించినప్పుడు, దైవత్వం సృష్టిలో కనిపిస్తుందని రోమా ఒకటి చెబుతున్నది. ఆ దైవత్వాన్ని జంతువులలో కూడా చూడగలము.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మంచిది, సముద్రమును ఇకను లేదని వాక్యం చెప్పినప్పుడు, క్రొత్త ఆకాశంలోను క్రొత్త భూమిలోను  సముద్రంలేదు. నిజమే, మనకందరకూ సముద్రమంటే ఇష్టమే కదా? ఔనా? కనుక, దీన్లో ఏదైనా గూడార్ధం ఉన్నదా? మీరే మంటారు?

డా. రాండీ అల్కార్న్,:    దీన్లో ఒక అంశాన్ని వదిలేస్తున్నామనిపిస్తున్నది. John, Charles Spurgeon ఈ అంశాన్ని గురించి చెప్పినది నాకు గుర్తున్నది. Spurgeon ఇక్కడ సముద్రాన్ని గురించి కొన్ని సంగతులు చెప్పాడు. చూడండి, సముద్రం, ఆకాలంలోని ప్రజలందరూ దాన్ని అశుభసూచకమ్గా తలచారు సముద్రంపై తప్పి పోవడం, సముద్రంలో మునిగి పోవడం, సముద్ర ప్రయాణంలో మంచి నీరు లేకపోవడం, విధి లేక ఉప్పునీరు   త్రాగి వారికి పిచ్చి పట్టడం. శత్రు సైన్యాలు దండెత్తి రావడం, నావికాదళాల దాడులు, సముద్ర రౌడీలు. సముద్రం మనల్ని ప్రియుల నుండి వేరు చేస్తుంది. కీడును కలిగించే సమస్తానికి సముద్రంతో సంబంధం ఉన్నది.

కనుక, సముద్రం ఇకను లేదంటే, ఇంట విశాల జలాశయాలు ఇక పైన ఉండవా? చూడండి, జీవజలముల నది, ఆమహానది దేవుని యొక్క సింహాసనం వద్దనుండి ప్రవహిస్తూ ఉన్నది. అది ఎక్కడికో ప్రవహించి వెళుతున్నది అదేక్కడికి వెళుతున్నది? లోకాని కంతటికీ నీటి నందించేందుకువెళుతున్న దాని అనుకుంటాను. పెద్ద చెరువులకు మాత్రమె కాదు, మహా సముద్రానికి మాత్రమె కాదు. ఐతే నీటి రుచిని చెరిపివేసే ఉప్పు సముద్రానికి నీటిని అందించదు. యెహెజ్కేలు 47 కూడా క్రొత్త భూమి గురించి చెబుతున్నది. ఈ సంగతి మనకు తెలుసు, ఇది ప్రకటనలో చివరలో ప్రస్తావించ బడింది. ఈ భాగం, పట్టణపు రాజ వీధి మధ్యను వెళ్తున్ననధిని గురించి చెప్తున్నది. ఆ నది సముద్రం లోకి చేరినప్పుడు ఉప్పు నీరు మంచి నీరుగా మారింది ఇది నిజంగా  అధ్బుతమైన వివరణ అనుకుంటున్నాను. సముద్ర మిప్పుడు సముద్రంలా లేదు మంచి నీరుగా మారింది. మనం జంతువులను గురించి ఆలోచిస్తే ఈ లోకంలో జీవించి ఉన్న జంతువు లన్నిటిలో ఉప్పాతిక భాగం జంతువులూ మొత్తం సముద్రాలలోనే జీవిస్తున్నాయి. మహా సముద్ర జలాలన్ని మంచినీటి సముద్రాలుగా మారిపోతాయనుకుంటున్నాను. సముద్ర జీవుల్ని దానికి తగినట్లుగా దేవుడు మార్చివేస్తాడు. ఉదాహరణకు, సింహం, తోడేలు, గొర్రెపిల్ల అన్నీ కలిసి పండుకుంటాయని వాక్యం చెప్తున్నది. సింహం ఎద్దువలె అక్కడ గడ్డి మేస్తుంది. కనుక, క్రొత్త భూమిలొ ఇకపై చంపడము, మరణము లేకుండా దేవుడు ఈ లోకంలో ఉన్న జీవరాసుల జీర్ణ వ్యవస్థా మండలాన్ని మొత్తం మర్చి వేసి ఈ క్రొత్త భూమిని అతి సుందరమైన భూమిగా చేయనున్నాడు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    క్రొత్త భూమిలొ పర్వతాలుంటా  యంటారా?.

డా. రాండీ అల్కార్న్,:    అవును, ఈ సంగతి ప్రకటనలో ఉన్నది. యోహాను పర్వతం పైకి తీసుకు వెళ్ళినప్పుడు అతడు క్రింది ఈ దృశ్యాన్ని చూస్తాదు ఒకే పర్వతం కాదు, ఒక పర్వతం. ఒక పర్వతం అంటే ఇంకా అనేక పర్వతాలు ఉంటాయని మనం పూర్తిగా నమ్మవచ్చు. జీవ వృక్ష మున్నదని వాక్యం చెబుతున్నది, కనుక ఇతర వృక్షాలు కుడా ఉంటాయి. ఒక వృక్షమున్నది. ఒక వృక్ష మున్నది గనుక, మరిన్ని వ్రుక్షాలున్నాయని గట్టిగా చెప్పవచ్చు. ఆ వృక్షం ప్రతీ నెలా కాయలు కాస్తున్నది. వాటిని మనం తినవచ్చు. విందు లుంటాయని వ్రాయ బడింది. కనుక క్రొత్త భూమిలొ సమృద్దిగా ఉత్పత్తి చేయబడు చున్న వాటిని మనం అనుభవించ గలం.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    పరలోకంలో మనం నిద్రిస్తామా?

డా. రాండీ అల్కార్న్,:    మనకు నిజంగా తెలియదు. అది వ్రాయబడి లేదు. ఐతే ఈ ప్రశ్నకు జవాబుగా పరలోకంలో మనం ఎన్నడూ కూడా  చెబుతారు ఎందుకంటే, అక్కడ మనం  శక్తితో ఉంటాం గనుక విశ్రాంతి అక్కర లేదు. లేదు, మనం శాశ్వతంగా జీవిస్తాం, ఐతే మనం  మవడానికి వీల్లేదు.  నిత్యుడు. కనుక మన మెప్పుడూ పరిమితులంగల జీవులమే. ఆదాము, హవ్వలు నిద్రించే వారా? నిద్రపోయే వారనే చెప్పాలి.  వలన ఫలితమే నిద్రయా? కాదనుకుంటాను. శాపం వలన ఫలితంగా మనం నిద్రపోవడం లేదు కదా? ఐతే మనం ఆహారం తినడం, నిద్ర పోవడమనేది  కదా? ఐతే, ఇప్పుడు ఈ లోకంలో మనం అనుభావిస్తునట్లుగా, క్రొత్త భూమిలొ అలసట, ఆయాసం ఉండవనుకుంటాను.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    Mormon సంగం వారు మనం పరలోకంలో పెండ్లి చేసుకుంటామని చెప్తున్నారు. ఐతే యేసు ఏమంటున్నాడు?

డా. రాండీ అల్కార్న్,:    పరలోకంలో మనం పెండ్లడమనీ,   చెప్పాడు దీనిని చుసిన కొందరు, ఇదేమిటి? నాకు నాభాగస్వామి అంటే ప్రేమ, నా జీవిత భాగస్వామితో శాశ్వత కాలం అక్కడ కలిసి జీవించాలనుకుంటున్నా నంటారు. ఐతే నేను దీన్ని వేరుగా చూస్తున్నాను. Nancy, నేను – Nancy నా భార్యా, నాకు మంచి స్నేహితురాలు. మేము జీవితంలో సంవత్సరాలు గడిచే కొద్ది ఎంతో స్నేహితుల మయ్యాము. ఆమె నాకు  మిత్రురాలు. నాకొక సంగతి తెలుసు మేము ఇద్దరం  బంధంలో నిత్యకాలం కలిసి ఉంటాము. ఎందుకని? ఎందుకంటే, పరలోకంలో వివాహముండదని  చెప్పడం లేదు,  జరుగుతుందన్నది. మనం క్రీస్తును వివాహ మాడతాం. క్రీస్తుకు సంఘం వదువు. Nancy మరియు నేను ఇద్దరం క్రీస్తు వదువైన సంఘంతోటి కలిసి ఆయనను పెండ్లాడతాం. మేమిద్దరం క్రీస్తుకు వధువుగా, ఆయనతోటి అత్యంత సన్నిహితంగా, ప్రేమగా కలిసి ఉంటుండగా,  భర్తగా ఆయన మమ్ములను విడువడు. ఆయన నిత్య దేవుడు, ఆయనతో గొప్ప సంబంధాన్ని ఈ లోకంలో అనుభవించాం కాని అంతకంటే మరింత సన్నిహిత సంబంధాన్నిపరలోకంలో ఆయనతోటి అనుభవించగలం.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    దీన్ని చూస్తున్న మీలో కొందరు తాము పరలోకం వెళతా మని తలుస్తున్నారు. ఐతే వెళ్ళలేరు. దీన్ని గురించి కొంచంసేపు ఆలోచించుకొనండి. మనకిక రెండు నిముషాలే ఉన్నాయి. తాము పరలోకం వేలతామనే విషయంలో ప్రజలు మోసగించబడడాన్ని తప్పించుకొని, దేవుడు చేయనున్న పనిని చేసినందున తాము తప్పక పరలోకం వెళతామని నమ్మెందు కేమి చెయ్యాలో చెప్పండి.

డా. రాండీ అల్కార్న్,:    మన మందరం సమాది కార్యక్రమాలలో ఫలాని వ్యక్తిని గురించి విని ఉంటాం. అతడు చనిపోయాడు, Golf అంటే అతనికి చాలా ఇష్టం, పైన ఎక్కడో Golf ఆడుతూనే ఉంటాడు. కొన్ని సార్లు మనం తీరికగా ఇలా చెబుతుంటాం. నాకు అతడు తెలుసు, అతడు యేసు క్రీస్తును ప్రేమించ లేదు, పాపాలకు పశ్చాత్తాప పడలేదు, పరిశుద్దాత్మతో నివసించ నందున ప్రభువును ఘన పరిచే విధంగా అతడు జీవించలేదు, అతడు ప్రభువును గుర్తించలేదు, అతడికి రక్షకుని గురించి తెలియదు. కనుక అది అబధం. పాపం చేస్తే వెళ్ళే స్థలం నరక మని వాక్యం చెబుతుంది. మన జీవితం మారకుంటే మనమందరం నరకానికే వెళతాం. మనం పాపులము. మనకు దేవునిక్రుప అత్యవసరమై యున్నది. దానిని మనం సత్ క్రియలతో సంపాదించుకోలేము. “క్రీస్తు యొక్క చేతనే మీరు రక్షింప బడి యున్నారు- విశ్వాసము ద్వారా కృపచేత రక్షింప బడినారు. ఈ రక్షణ క్రియ మీ వలన జరిగినది కాదు గాని ఇది దేవుని వారమే. క్రియల వలన కలుగ నందున ఎవడును అతిశయ పడరాదు” సత్ క్రియలు చేసినందున పరలోకము వెళ్ళలేము. చేసన పని ఫలితము కావాలని ఎవరన్నా కోరితే, జాగ్రత్త! చేసిన పనికి ఫలితం కోరొద్దు . మీరు చేసిన పనికి ఏందొరుకుతుందంటే నరకం. నేను దానిక్ అర్హుడను. ఐతే, మనం మొకాల్లూని యేసు క్రీస్తు ఇచ్చిన వరాన్ని పుచ్చుకుంటే, ఆయన నిత్య కాలం మనకు పరలోకాన్ని దయచేస్తాడు.

ప్రడా. జాన్ అంకెర్బెర్గ్ :    భువుకు ఈ పార్ధన చేయదలచిన వారితో ఒక ప్రార్ధన చేయండి. ప్రజలూ మీతోటి ప్రార్ధిస్తారు. మీరున్న చోటనే ప్రార్ధించవచ్చు. ప్రజలేమని ప్రార్ధించాలి? మరి, ప్రియులారా! మీరు నిజంగా యేసును తెలుసుకోవాలంటే, Randy  ప్రర్దిస్తుండగా ఆయనతో కలిసి పర్ధించండి.

డా. రాండీ అల్కార్న్,:    యేసు ప్రభువా! నేను పాపినని, నరకానికి పాత్రుడనని గుర్తిస్తున్నాను. పరమునకు పాత్రుడను కాను.  ప్రభువా! నా హృదయపు పరిస్థితిని నాకు చూపించండి. మీ వాక్యానేలా దిక్కరించానో తెలపండి. నా మనసులోని ద్వేషం, మనసులోని అసూయ. చేసిన అవినీతి పనులు, దొంగతనం, అంటే కాక ప్రభువా, మీతోను ఇతర ప్రజలతోను అనైక్యతతో ఉంటూ, మిమ్మల్ని ప్రేమించని హృదయం, ఇతరులను ప్రేమించని హృదయం. ప్రభువా! నాలోని పాపాన్ని గుర్తించాను. అడినన్ను మీనుండి వేరు చేస్తున్నాదని గుర్తించాను. ప్రార్ధిస్తున్నాను, యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా, ఆయన చిందించిన రక్తంలో నన్ను కడిగి, నేను మీరు దయచేసే పరిపూర్ణ క్షమాపణను అందుకొని నేను మీ కృప ద్వారా పరలోకంలో నిత్యకాలము గడిపేలా దయచూపండి. యేసు నామంలో అడుగుతున్నాము. ఆమెన్!.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ప్రియులారా! మీరు ఈ విధంగా ప్రార్ధిస్తే “ఎవరైనను” అని బైబిలులో ఉన్నది. మీ పెరునక్కడ చేర్చండి. ప్రభువు నామమున ప్రార్దిన్చినచో, మీరు ఈ విధంగా ప్రార్ధన చేసిన యెడల, ఈ వచనంలోని మూడు పనులను దేవుడు తప్పక చేస్తాడు, మనల్ని రక్షిస్తాడు. హృదయ పూర్వకంగా మీరు ప్రార్ధించినచో ఆయన రక్షిస్తాడు. ఆయన మీజీవితంలో గొప్ప క్రియ జరిగిస్తాడు. మీ పాపాలను క్షమించాడు, ఇప్పుడు మీతోటి కలిసి జీవిస్తూ, కలిసి నడుస్తూ మీ జీవితాన్ని మారుస్తాడు.

తరువాతి వారం మనం వెల్లనైయున్న అద్భుత నగరం గురించి చర్చించ బోతున్నాం. నూతన యెరూషలేములో, మనము అనుభవించబోయే అంశాలు, కొంత కాలానికి నూతన యెరూషలేము ఈలోకానికి దిగివచ్చే సంగతి, దేవుడు ఈ భూమిని పునఃనిర్మించే సంగతిని చర్చిద్దాం. వచ్చేవారం తప్పక దీన్ని చూడండి.

ప్రియులారా, తర్వాతి వారం దీన్ని చూస్తారని ఆశిస్తున్నాను.

 

 

మరిన్ని టీవీ ప్రోగ్రామల్ని చుచెందుకు ఉచిత

FREE John Ankerberg Show App download చెసుకొండి

“Pray to Accept Jesus Christ as Your Savior” @  JAshow.org

కాపీరైట్ 2015 ATRI.

 

 

இயேசு திரைப்படம்

கிறிஸ்தவராவது எப்படி

நீங்கள் எப்படி கிறிஸ்தவராக முடியும்? கிறிஸ்தவர் என்பவர் இயேசுவை நம்பி அவருடைய பாதையை பின்பற்றுகிறவனாக இருக்கிறான். நீங்கள் கிறிஸ்தவர் என்பதை அறிந்துகொள்ள வேதம் உங்களுக்கு நேர்த்தியான பதில்களை அளிக்கிறது. கிளிக் செய்யவும்.

ஆடியோ பைபிள்

சீர்திருத்த பாடநெறி