పరలోకమలో ఉన్న విశేష మేమిటి? సీరీస్-1, కార్యక్రమం-1.

పరలోకమలో ఉన్న విశేష మేమిటి? సీరీస్-1,

 కార్యక్రమం-1.

 

 

ఈ రోజు John  Ankerberg Show లో- పరలోకంలోఉన్న విశేష మేమిటి? మీరు Disney  Land కు గాని, ASPEN లో మంచు స్కీయింగ్కు గాని, యూరోపేకు గాని వెళ్ళాలని ఆలోచిస్తుంటే వాటి వివరాలు తెలిపే కరపత్రాలను, website లను ముందుగానే పరిశీలిస్తుంటారు, సందర్శక గ్రంధాలు అక్కడికి వెళ్ళాలనే కొరికెను ఎక్కువ చేస్తుంటాయి. ఐతే పరలోకానికి నడిపించే గ్రంధం బైబిలు. దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశమును మనం చూడబొతున్నామని బైబిలు చెబుతున్నది. ఐతే ఈ పరలోకం లేక బైబిలు చెబుతున్న క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీ సొంతం కాబోతున్నట్లయితే పరలోకం గురించి మీకు ఏమి తెలుసు? మీరు నిత్యత్వాన్ని గడప బోతున్న స్థలంలో మీరు ఏమి చెయ్యాలని, ఏమి చూడాలని, ఎలాంటి అనుభవాలను పొందాలని ఆశిస్తున్నారు?

ఈనాటి మన అతిధి పరలోకం అనే ప్రక్యాత పుస్తకం రచించిన Dr. Randy Alcorn. మన భవిస్యత్ గృహం- పరలోకంలో క్రైస్తవుల కొరకు దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన అంశాల నీయన వివరిస్తారు. John Ankerberg Show లోని ఈ ప్రత్యెక కార్యక్రమములో మాతో కలుసుకోండి.

 

***

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మా ప్రోగ్రాంకు ఆహ్వానిస్తున్నాం. అద్బుతమైన అంశం పరలోకాన్ని గురించి చర్చిస్తున్నాం. ఈ అంశాన్ని చర్చించగల నిపుణుల్లో ఒకరైన Dr. Randy Alcorn మన మధ్య ఉన్నారు. చాలా కాలంగా ఆయనను పిలుస్తున్నాను, ఆయన వివరించే సంగతులు మీకు త్రుప్తినిస్తాయి. మీకు పరలోకం వెళ్ళాలనే ఆశ ఉందా? Randy నేను కలుసుకున్న వారిలో పలువురు పరలోకాన్ని ఇష్ట పడతున్నారని చెప్పలేను. ఎందుకంటే వారికి పరలోకం గురించి ఏమీ తెలియదు. యేసును జీవితంలోకి ఆహ్వానించి నందున తప్పకుండా పరలోకం వెళ్తామని అనుకుంటున్నారు. సభలలో, సంఘాలలో, పాఠశాలల్లో మీరు ప్రసంగిస్తున్నందున, సంఘాలలోని ప్రజలు ఏమని తలుస్తున్నారో చెప్పండి. మీరేం గమనించారు?.

డా. రాండీ అల్కార్న్,:    చూడండి, నాకు మంచి స్నేహితుడొకాయన, బైబిలును విశ్వసించే పాస్టరు తన మనసులోని మాట చెప్పాడు. అతడిలా అన్నాడు, “నేను నిత్యత్వంలో కలకాలం కొనసాగి పోవడంకన్నా, మరణం తర్వాత న కధ అంతటితో ముగిసిపోతే మంచిదనుకుంటున్నాను. ఎందుకలా అంటున్నారని అడిగాను.నిత్యత్వంలోకలకాలం ఏ పనీ లేకుండా ఉండటం చాలా విసుగన్నాడు. పనే ఉండదు. అక్కడ మనం దేవుని ఆరాదిస్తా మనుకోండి. నాకు ప్రభువంటే పేమే. ఐతే నేనక్కడ ఇతర పనులు కూడా చేస్తే బాగుంటుంది”. నేను ఆలోచించాను, ఇతడొక పాస్టరు బైబిలు కాలేజిలో చదివిన పట్టాదారు, ఐతే పరలోకం అంటే సంతోషంలేదు కనుక పరలోకం గురించి బోదించి ప్రజలను ఉత్తేజ పరచడు. దీన్ని గురించి పలువురు తటస్థంగా ఉండిపోతారనుకుంటున్నాను. ఔను, ఇది గొప్పదే. ఔను, సంతోషం, పరలోకం వెళ్ళడం నరకానికి కంటే మేలేకదా!. నా ఉద్దేశంలో నరకంకంటే పరలోకం మేలు కదా? ఐతే దీన్ని గురించి పెద్దగా సంతోషించరు.

మనం క్రొత్త ప్రదేశాలకు వెల్ల దలిస్తే ఎంత సంతోషమో చూడండి. Disney Worldకు వెళ్తున్నారనుకొండి లేదా గొప్ప Canyonకు వెళ్తున్నారనుకొండి – మీరేం చేస్తారు ? దాని గురించిన వివరాలన్నిటిని సేకరిస్తారు. ఆ స్తలం గురించి తెలిసిన వారిని వివరాలు అడుగుతారు. క్రైస్తవులంగా, మనం బైబిలులో దీన్ని గురించి ఏం చెప్పబడిందో గమనించాలి. దేవును వాక్యం పరలోకం గురించి చెప్తున్నా సంగతులు. ఈ స్థలానికి యేసు, నజరేతు నుండి వచ్చిన వడ్రంగి. వెళ్లి రెండు వేల యేండ్ల నుండి మనకై స్థలాన్ని సిద్ధ పరుస్తున్నాడు. ఆయన నిర్మానకుడు, ఆయన వడ్రంగి, గృహ నిర్మాణం ఆయనకు తెలుసు, బాగు చేయడం ఆయనకు తెలుసు ఆయన లోకాన్ని నిర్మించాడు లోకం పాపంతో చెడింది ఇప్పుడు దాన్ని బాగు చేస్తున్నాడు. మనమిక క్రొత్త భూమిలొ నిత్య కాలం జీవిస్తాము మీరీ విషయాన్ని అర్ధం చేసుకుంటే తప్పక దీన్ని గురించి సంతోషం పొందుతారు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఊ. మరి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అన్నారు. ఈ విషయం గురించి క్లుప్తంగా చెప్పండి.

డా. రాండీ అల్కార్న్,:    పరలోకం అనేది అల్పకాలానికి అని మనం తలుస్తాము. మనం తలుస్తాము, మనలో ఒకరు చనిపోయారు వారు యేసును ప్రేమించారు. వారు పరలోకంవేల్తాఋ. దేహాన్ని విడిచి ప్రభువు యొద్ధ నివసించాలానే ఆశ, అది నిజం చనిపోయి పరలోకం వెళ్తారు. ఐతే పరలోకం ఇప్పుడు మునుపు ఉండిన చోటలేదు. దేవుడు పరలోకాన్ని క్రిందికి తీసుకు వచ్చి క్రొత్త భూమిలొ నూతన సృష్టిలో నిలుపుతాడని వాక్యం చెబుతుంది. ఈ సంగతి ప్రకటన 21:3, యెషయా 60, 65 అధ్యాయాల్లో ఉన్నది. ఆ తరువాత దేవుడు క్రొత్త భూమికి దిగివచ్చిన తరువాత, ఆయన సింహాసనం కూడా ఇక్కడి కొస్తుందని, ఆయన మన మధ్య నివసిస్తాడని చెప్పబడింది. మనకు పునరుత్థానం వస్తుంది. నూతన శరీరాలోస్తాయి. క్రొత్త భూమి మన నూతన శరీరాలవలె ఉంటుంది. పాత శరీరం మరణిస్తుంది. శరీరం కొంత కాలం తర్వాత కుళ్ళుతుంది. దేవుడు పునరుత్థానంలో వాటిని లేపుతాడు. అదేవిధంగా, మనం నివసిస్తున్న భూమి, ఔను, అది నాశనం చేయ బడుతుంది. ఆతర్వాత పునఃనిర్మించబడుతుంది. తరువాతి క్రొత్త భూమిలొ కూడా, ఇప్పుడు మనమున్న భూమిలొని అనేక అంశాలు ఉంటాయి. మామూలు శరీరాలతో హాయిగా తింటూ, తాగుతూ, బోజనపు బల్ల యొద్ధ విందుల నారగిస్తూ కధలు చెప్పుకుంటుంటాo. అబ్రహాము, ఇస్సకులు తూర్పు, పడమరల నుండి వచ్చి వారితో భోజనం బల్ల వద్ద కూర్చుంటారు. ఈ సందర్భం కోసమే మనం ఎదురు చూడాలి.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మరి, ప్రియులారా మనం పరలోకంలో  అనుభావిస్తా మనే అంశాన్ని ఆరు ప్రోగ్రాంలలో చూద్దాం,  తప్పకుండా చూడండి. కార్యక్రమం మరింత మెరుగౌతుంది, నిత్యత్వంలో పరలోకం మన కోసం మరింత మేరుగావబోతున్నట్లుగా.

ఇక, మొదటిగా పరలోక మనేది నిజంగానే ఉన్నదనే సంగతిని మీరు వీరికి చెప్పాలి. మీరు వ్రాసిన ఒక పుస్తకములో మా అమ్మ చనిపోయినప్పుడు ఆమెతో ఎప్పుడూ సన్నిహితముగా ఉండే మా రెండున్నర సంవత్సరాల కుమార్తెతో దీనిని గురించి ఏమని చెప్పారో మాకు వివరించండి. ఆ సందర్భం గురించి చెప్పండి పరలోకం వాస్తవమని దీన్లో తెలుస్తుంది కధా!

డా. రాండీ అల్కార్న్,:    మా కుమార్తె కరీనాకు, మా పెద్ద కుమార్తెకు బన నానమ్మ అంటే చాలా ప్రేమ. ప్రతి సూమవారం ఆమె వద్దకు వెళ్లి ఆమెతో రోజంతా గడిపేది. నానమ్మ బైబిలు కధలు చదివి వినిపించేది, బైట స్థలాలకు తీసుకు వెళ్లి ఆనందంగా గడిపేది. మా అమ్మ కాన్సర్తో చనిపోతున్నప్పుడు, మా అమ్మకు ఒక నర్సు ఇంటిలో సహాయ పడుతున్న కాలంలో, కరీనాను అక్కడికి తీసుకెళ్ళే వాళ్ళం. నానమ్మ కృశించి పోవడం ఆమె చూసింది. ఆమెకెంతో బాధ మాకూ ఎంతో బాధ. ఐతే అందరం కలిసున్నా ప్రత్యెక కాలం. ఒక రోజు అర్ధరాత్రి మా అమ్మ చనిపొఇన్దని ఫోన్ వచ్చింది. అక్కడికి వెళ్లి చేయాల్సిన దంతా చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత కరీనాను లేపి ఈ సంగతిని ఆమెకు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే, ఆమెకు నానంమంటే చాలా ప్రేమ. ఆమెకు చెప్పాలనిపించింది, కనుక ఆ అర్ధరాత్రి ఆమెను నిద్ర లేపాను. ఆ సందర్భాన్ని మర్చిపోలేను. ఇప్పుడు నేను అక్కడ ఉన్నట్లుగా ఉన్నది.

నేను పాప కళ్ళలోకి చూసాను. ఆమె అలసటగా ఉన్నది. నేను ఆమెతో చెప్పను, “కరీనా, నానమ్మ ఎక్కడుందో నీకు తెలుసా?” నేను అడిగి ముగించాక ముందే జవాబొచ్చింది. “తెలుసు, దాడి, పరలోకంలో ఉంది”. కొద్ది నిమిషాల తర్వాత అన్నది, “ఆమె ఆసుపత్రి పడకపై లేదు యేసు ఒడిలో ఉన్నది”.నా కుమార్తె ఇలా అంటుండగా, జాన్, నాకు అప్పుడు ఏమనిపించిందంటే, పరలోకం గురించి మేము చెప్పినదాన్ని ఈమె నమ్ముతున్నది. పరలోకం గురించి బైబిలులో ఉన్న సంగతులను అన్నిటిని పూర్తిగా నమ్ము తున్నది. చిన్న పిల్లల విశ్వాస మది. మనం చిన్నపిల్లల్లా కావాలి. నానమ్మకిక ఏ సమస్యా లేదనే అంశాన్ని ఆమె గుర్తించింది. నానమ్మ వ్యాదితో కష్టపడుతున్నదని తెలుసు. ఇప్పుడు పాపకు సంతోషంగా ఉంది. తల్లిని పోగొట్టుకొని మేము బాధ పడుతున్నాం. ఐతే ఆమె దేవునితో ఉన్నాడని పాప సంతోషంతో పొంగిపోతున్నది. నానమ్మ దేవునితో ఉన్నందున కుమార్తె గురించి ఇక చింతించవలసిన పని లేదు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మన శాక్ష్యలను పరిశీలిద్దాం. ఈ వచనాన్ని తెరపై చూపిస్థాను. మరణం తర్వాత ఏమౌతుందో పౌలు భక్తుడు చెప్పాడు. ఫిలిప్పి 1:21 లో వ్రాశాడు, ” నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము”. ఇప్పుడు అదెందుకు లాభమో గమనిద్దాం. “రెండిటి మధ్యనలుగు తున్నా” నన్నాడు. “నేను వేదలిపోయి క్రీస్తుతో ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు”. పౌలు ఏం చెబుతున్నాడంటే, ఈ లోకంలో మీరు కన్నులు మూసిన వెంటనే, ఇంకొక లోకంలో మీరు కండ్లు తెరుస్తారు. ధనికుడు లాజరు కధలోలాగా. నిజమేమి టంటే, ఇక్కడ లోకంలో శ్రమలను అనుభవిస్తున్న ప్రజలు, వీరికి నిరీక్షణ, నిజంగా పరలోకం ఉన్నదని బైబిలు లేఖనం చెబుతున్నది. మీరు చనిపోగానే వెంటనే మీరు ఎక్కడుంటారు, యేసు క్రీస్తు సన్నిధిలో ఉంటారు.

ఇప్పుడు మరొక వచనాన్ని పరిశీలిద్దాం. ఎందుకంటె మన సమయం తరిగిపోతుంది. ప్రకటన గ్రంధంలో అపోస్తలుడైన యోహాను వ్రాశాడు, “నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమినీ చూసితిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించి పోయెను, సముద్రమును ఇకను లేదు. నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము భర్త కొరకు అల్లంకరింపబడిన వధువు వాలే దిగి వచ్చుట చూచితిని. ఇదిగో దేవును నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలై యుందురు, దేవుడు తానె వారి దేవుడి యుండి వారి కన్నులలోని ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును. మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించి పోయెను”. ఈ వచనాల భావం చెప్పండి, Randy?

డా. రాండీ అల్కార్న్,:    సమస్త సృష్టి సరిదిద్ద బడుతుందనే వాగ్దానం దీనిలో ఉన్నది. ప్రకటనలోని చివరి అధ్యాయాలు, ఆదికాండం మొదటి అద్యాయాలతో అనుగుణ్యంగా ఉన్నాయనే సంగతిని మనం మర్చి పోతుంటాం. కధ మొదలౌతుంది – ఇది నిజమైన కధ – నీతిమంతులైన స్త్రీ పురుషులిద్దరూ దేవుని మహిమార్ధం భూమిని ఏలడమనే అంశంతో కధ మొదలౌతుంది. సాతాను సమస్తాన్నీ ఇక్కడ చెడగోడుతున్నాడని మనం తలుస్తాం. ఆ తర్వాత క్రీస్తు దానినంతటిని బాగుచేసి విమోచిస్తాడు. ఇది మీరు చదివినట్లు ప్రకటన గ్రంధం చివరి రెండు అధ్యాయాలలో జరుగుతుంది. ఇక్కడ దేవుడు సమస్తాన్ని విమోచించడం, సమాధాన పరచడం, ఇలాంటి పనులన్నిటిని చూస్తున్నము. మునుపటి కంటే లోకాన్ని ఎంతో మెరుగు పరుస్తాడు. పోయిన దాన్ని తిరిగి సమకూరుస్తాడు. పరలోకం తప్పిపోయింది. పరలోకం మరలా లభిస్తుంది. పాపం ఉండదు వేదన ఇక లేదు. భాదలు లేవు. ఎంత ఆనందం. మనమేక్కడనుండి వచ్చి ఎక్కడికి వెళ్తున్నామో గుర్తించగలిగితే, సరిగా ఆలోచించి ఆనందించేందుకు అది సహాయ పడుతుంది. ఎందుకంటే దేవుడు మేలు కొరకు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు. సమస్తం సరిగా ఉండే లోకంలో మీరొక రోజున ఉండ బోతున్నారు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మంచిది, మన మొక విరామం తీసుకుందాం మేము తిరిగి వచ్చిన తర్వాత నేను Randyని క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో మీరు దేనిని చూడాలని ఆశిస్తున్నరనే ప్రశ్నను అడగాలను కుంటున్నాను. చూస్తూనే ఉండండి. వెంటనే వచ్చేస్తాం.

 

*********

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మంచిది, మేము తిరిగి వచ్చాం. మేము Dr. Randy Alcornతో మాట్లాడుతున్నాం. పరలోకమనే అద్భుత అంశాన్ని ఇప్పుడు చర్చిస్తున్నాం. మనం దేన్ని ఆశించాలి? పరలోకంలో, భవిష్యత్తులో మనకు దేనినిస్తానని దేవుడు వాగ్దానం చేసాడు. ఆయన దేనిని సమకూర్చుతాడు. యేసు శిలువపైన వ్రేలాడుతున్న సమయంలో తనను విశ్వసించిన దొంగ తన ప్రక్క సిలువపై వ్రేలాడుతున్నప్పుడు, నేడు నీవు నాతొ ఎక్కడ ఉంటావన్నాడు? పరదైసులో. దానిని తోటతో పోల్చాడు. పరదైసు అంటే ఏమిటి? అది ఏదేను వనం. ఇతర సందర్భములలో హేబ్రీయుల పత్రికలో దీన్ని చూస్తాం. మంచి దేశం కోసం, పరలోక దేశం కోసం వారు ఆశించారు. ఇక్కడా దేశమని చెప్పబడింది. స్థల మనగా ఆయన వారికొరకు ఒక పట్టణం సిద్ధ  యున్నాడని వాక్యం చెబుతున్నది. మనాకు ఒక తోట, పరలోకం, దేశం, నగరం ఉన్నాయి. దేవుడు పరలోకాన్ని ఇలా వివరిస్తున్నాడు. Randy, మీరు చెప్పండి.

డా. రాండీ అల్కార్న్,:    చూడండి, మనము ప్రభువు తోనూ మన ఆత్మీయ కుటుంబం తోనూ నిత్య కాలం నివసిస్తామో ఆ క్రొత్త భూమికున్న వివిధ లక్షణాలను గురించి ఇక్కడ వాక్యం చెబుతుంది. ప్రకటన 22 లో, దేవుని సింహాసనం వద్దనుండి ఒక నది ప్రవహిస్తున్నట్లు వ్రాసి ఉంది. ఆ నిధికి ఇరువైపులా జీవవృక్షం పెరుగుతున్నది. అదిప్పుడు జీవారణ్యంలా ఉన్నది. ఆదికాండం 1-2 లా గున్నది కానీ మరింత పెద్దది. అక్కడ సంస్కృతి పరమైన అభివృద్ధి కూడా ఉన్నది. అక్కడ భావన నిర్మాణ మున్నది ఎత్తైన గోడలు ఉన్నాయి. అందమైన రత్నములు, అద్భుత సౌందర్య నిర్మాణ కౌశల్యం అక్కడ ప్రవహిస్తున్న నది వలన సహజ వనరులు అధికంగా లభిస్తున్నాయి. జీవ వృక్షపు ఫలాన్ని గురించి చెప్పబడింది.

ఇది నగరం క్రొత్త యేరుషలేము ఇది దేశం భూలొకపు రాజులు తమ సంపదల్ని క్రొత్త యేరుషలేములోకి తీసుకు వస్తారని ఇక్కడి వాక్యం తెలిపింది. వారు తాము ప్రేమించు దేవునికి కానుకగా తాము తీసుకు వచ్చిన వస్తువులను, తమ పనుల ఫలితాన్ని ఆయన పాదాల ముందుంచుతారు. కనుక పరలోకమంటే ఇదే. ఇది పరడైసు, ఇది నగరం, ఇది దేశం ఆ లోకపు పౌరులంగా ఉంటాం. మనం దేవున్ను ప్రజలముగా గొర్రె పిల్ల రక్తముతో విమోచన పొంది భూమిని పరిపాలిస్తాం. ఆయన రాజాధి రాజు అందరికంటే పైవాడు. ఆయన రాజులకు రాజు. ఆయన రారాజు. మనము చిన్న రాజులం. బిడ్డలంగా ఆయనకు లోబడి సేవిస్తూ, ఆదికండంలోని ప్రధమ సంకల్పం నిత్యత్వానికి పరిపూర్ణమయ్యేలా, దేవును మహిమ కోసం లోకాన్ని ఏలుతున్నాం. ఇదెంత అద్భుతావకాషమే కధా!

డా. జాన్ అంకెర్బెర్గ్ :    నిజమే, యేసుకు తీర్పు తీర్చుతున్నప్పుడు, “నీవు యూదుల రాజువా?” అని పిలాతు అడిగిన సందర్భాన్ని బైబిలులో చదివాను. నేను రాజునే అన్నాడు. నేనే రాజును అని యేసు చెప్తున్నట్లు గమనించాను. నా రాజ్యం ఇహ సంబంధ మైనది కాదన్నాడు. ఔను, ఇప్పుడు పాలిస్తున్నాడు. పరలోకం, భూమి, ఇప్పుడు ఎందుకు కలపబడలేదంటే, భూమి ఇప్పుడు పాపంతో నిండి ఉన్నది. ఔను, సత్యమేమిటంటే, దేవుడొక రోజున పరలోక నగరాన్ని తీసుకు వచ్చి, భూమితొ కలుపుతాడు. ఆ పని చేయడానికి ముందు ఈ భూమిపైని సమస్త పాపాన్ని ఆయన తొలగించాలి. ఆ తరువాత మనకు అలవాటైన విధంగా భూమిని పునఃనిర్మిస్తాడు. ఐతే దీన్ని మరింత అద్భుతంగా మార్చి వేస్తాడు. పరలోక నగరం యేరుషలేము ఎంత పెద్దదిగా ఉంటుంది?

డా. రాండీ అల్కార్న్,:    అది 12000 ఫర్లాంగులని చెప్పబడింది. అనగా దాదాపు 1400 మైళ్ళని చెప్పవచ్చు. 1400 మైళ్ళ ఘన చతురస్రం పొడుగు, వెడల్పు సమానం. దీని అడుగు భాగం కెనడా నుండి మెక్సికోకు వేల్లెటంతదూర ముంటుందనవచ్చు., పశ్చిమ తీరం నుంచి Appalachian పర్వతాల వరకు, కనుక బ్రహ్మాండమైన పట్టణాన్ని గురిన్వ్హి మాట్లాడుతున్నాం. ఇది కేవలం కొత్త యేరుషలేము మాత్రమే. దాని గుమ్మములకు వెలుపల భూలొకపు రాజ్యములున్నాయని చెప్పబడింది. భూరాజులు తమ ఇశ్వర్యమును దానిలోనికి తీసుకొని వత్తురు దేవుడు మన కోసం సిద్ధం చేసిన బ్రహ్మాండమైన స్థలాన్ని గురించి మాట్లాడుతున్నాం.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఔను, ఎత్తు కూడా 1400 మైళ్ళు. మంచిది, అనగా అది నిజంగా ఎంత ఎత్తు అనేది మనం ఊహించలేము. అది చాలా ఎత్తు అది ఆకాశావిశాలం వంటిది. సరే, కొత్త యేరుషలేము ఇలాగుంటే, ప్రవచనం చెప్పే పండితుడు ఒకాయన, ఇక్కడ కొత్త యేరుషలేమురావాలంటే, దేవుడు భూమిని పెద్దది చేయాలన్నాడు. అక్కడ ఉన్న ఇతర రాజ్యాల పరిమాణాన్ని ఊహించుకోగలము. భూమియొక్క పరిమాణాన్ని తప్పక పెంచుతాడు. దాన్ని గురించి మనం త్వరత్వరగా చర్చను ముగించాం. ప్రజలు అడుగుతారు, “ఒక్క నిమిషం ఆగండి. అంటే పరలోకం ఇప్పుడున్న దాని కంటే మరింత వేరుగా మారి, మరింత మెరుగ్గా మారుతుందా? పరలోక మిప్పుడెలా గున్నది? నేను చనిపోతే, మీరిప్పుడు చనిపోతే వెంటనే ప్రభువు సన్నిధికి చేరుకుంటాం, వెంటనే వెళ్లి పరలోకానికి చేరుతాం. ఔను, అక్కడేముందో చెప్పండి ప్రస్తుత పరలోకం ఎలాగుంది?”

డా. రాండీ అల్కార్న్,:    అనేక వచనాలలో దీని వివరణను చూడగలం. ఒకటి ప్రకటన ఆరు, మరణించిన హతసాక్షులు గురించిన వివరం. వారు ప్రభువు ఎదుట ఆయనతో మాట్లాడు తున్నారు. బిగ్గరగా కేకలు వేస్తున్నారు. వారు, “ఎందాక మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందు వంటున్నారు?” పరలోకం లోని అనేక వివరాలు తెలుస్తున్నాయి. ఒక వివరం, ప్రజలు దేవును సన్నిధిలో ఉన్నారు. ఐతే మాట్లాడు తున్నారు గనుక వారికి ఆలోచనలున్నాయి. స్పుహ కలిగి ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడే సహవాసమున్నది. భూమిపై నివసిన్చినట్టి జ్ఞాపకాలున్నాయి. పలువురు, ” మనం కొన్నిసంగతుల్ని జ్ఞాపకముంచుకో గలమనుకుంటాను. ఐతే చెడ్డ సంగతులు జ్ఞాపక ముండవని” చెబుతారు. తాము హత్యకు గురైన సంగతి జ్ఞాపక మున్నది కధా? పరిస్థితి ఇంతకంటే క్షీణించి పోతుందా?.

ఐతే ఇక్కడ మీకు జ్ఞాపక శక్తి తగ్గిపోవడం ముక్యంశం కాదు, ఎందుకంటే భూలొకములో మీకు జరిగినదాన్ని మీరు భరించలేరు. ఐతే దేవును యొక్క ప్రణాళికను మీరు తెలుసుకోగలుగు తున్నారు. తాము హత్యకు గురయ్యామని వారికి గుర్తున్నది. దేవును ప్రార్ధిస్తున్నారు.  పరలోకంలో ప్రజలు దేవునితో  మాట్లాడుతున్నారు. ఆయన్ను ప్రార్ధిస్తున్నారు. ఎంత కాలం నీవు ఊరక ఉందువని అడుగుతున్నారు. ఇక్కడ మరొక ముక్యంశ మున్నది. ప్రస్తుత పరలోకానికి సమయ మున్నది. ‘ఎందాక’ అనే ప్రశ్నలో దీన్ని గమనించ గలం. ఇంకా కొంచం కాలం ఉండాలని ప్రభువు చెబుతున్నాడు. కనుక అక్కడ సమయ మనేది ఉంది. ప్రకటన 8:1, పరలోకంలో అరగంట నిశబ్దంగా ఉన్నదని మనకు చెప్తున్నది కనుక మనం పరలోకంలో స్థలాన్ని, కాలాన్ని అనుభవించే పరిమితులు గల వ్యక్తులం.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    మంచిది, మరి వారుకూడా ప్రభువు రాక కొరకు కాచుకొని ఉన్నారు, ఎందుకు?

డా. రాండీ అల్కార్న్,:    ఎందుకంటే క్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు వెయ్యేండ్ల రాజ్య పరిపాలనకు వారు ఆయనతో కూడ కలిసి వస్తారు. ఆయన వచ్చిన తరువాత కొత్త ఆకాశం, కొత్త భూమి, అంతిమ తీర్పు దినాన వారు ఇంట కాలంగా కోరుతున్న న్యాయాన్ని దేవుడు వారికి జరిగిస్తాడు.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    ఆకాలంలో దేవుడు లూకంలోని పాపాన్నంతటిని తొలగించి, సృష్టిని పునఃనిర్మిస్తాడు. మనం అనుభవించ బోతున్న కొత్త భూమిని గురించి మీరిక్కడ కొన్ని వివరాల్ని చెప్పాలి, దేవుడు దీనిని మనకు ఇస్తున్నాడు. మనకేం కావాలో తెలిసి, మనల్నొక పద్దతిలో సృష్టించాడు. చాలామంది అడుగుతున్నా ఈ ప్రశ్నకు మీరు ఇక్కడ జవాబివ్వండి. కొత్త భూమి అనేది ఎలాగుంటుంది?

డా. రాండీ అల్కార్న్,:    వీటన్నిటికి కీలకంగా మనం పునరుత్థానాన్ని గురించి మొదట తెలుసుకోవాలి. లేఖనం లోని వాగ్దానం ఇది. 1 కొరిందీ 15 చెప్తున్నది, మృతులు లేపబడనిచో, అందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. ఇదంతా పునరుత్థానం గురించి. మన ఆత్మ శరీరంలోంచి బైట పడాలనే సిద్ధాంతం- బైబిలు దాన్నంగీకరించడు. దేవుడు మనల్ని ఆత్మా సంబంధులుగా సృష్టించాడు. పునరుత్థానపు వాగ్ధానమేమిటంటే, విమోచన స్థితిలో మనం నిత్య కాలం జీవిస్తాము. ఐతే పరిపూర్నమ్ చేయబడిన నిజమైన శరీరాన్ని ధరించి ఉంటాము. నిజమైన భూమిపై నివసిస్తాము. మొదటి భూమి పరిపూర్నమ్ చేయబడి బాగు చేయబడి, నాశనం నుండి వెన్నక్కి తీసుకు రాబడి నిత్యత్వానికి లేపబడింది. ఆతరువాత అన్ని వాగ్దానాలు, జీవిత శుభాలు, మానవ సంబంధాలు, ఈలోకంలో ఉన్న అద్భుతాలు- ఇవన్నీ మనకు లభిస్తాయి. సమస్త సృష్టి  ఉన్నదని రోమా 8 చెబుతున్నది. విమోచన కొరకు కనిపెట్టుచున్నది. మానవాళి దాస్యంలోంచి విడిపింప బడుతుందని వాక్య మున్నది. కనుక మానవాళి పునరుత్థానంలో విడిపింప బడినప్పుడు మరణించిన వారు మనతో పాటు మరలా వస్తారు. ఇది గొప్ప అద్భుతం.

నా స్నేహితుడు David O’Brien గుర్తుకు వస్తున్నాడు. పక్షవాతపు వ్యాధి. అతనికిప్పుడు అరవై ఐదేళ్ళు. అతడు వ్యాధి వలన కష్ట పడుతున్న ఏళ్ళలో, ఆరోగ్యం క్షీణించి పోతుండగా, భవిష్యత్తులో ఏదో ఒక రోజున విమోచన వస్తుందనేవాడు. దేవుని ఎదుట కొత్త శరీరంతో నిలుస్తాడు. కొత్త భూమిలొ నడుస్తూ, వనాలలో పరుగులు, ఈత కొట్టడం, కొత్త భూమిలొ ఆనందించడం. దేవునుతో ఉండటం, ముఖ్యంగా అన్ని మేళ్లను అందించేది దేవుడే. విమోచన పొందిన భక్తులనిత్యత్వం ఈ విదంగా ఉంటుంది.

డా. జాన్ అంకెర్బెర్గ్ :    అది అద్భుత అనుభవం. అంశాన్ని ఇప్పుడే ప్రారంబించాము ప్రియులారా! వచ్చే వారం పరలోకం ఎలా ఉంటుందనే అంశాన్ని చర్చించబోతున్నాం. అక్కడికి ఎంత వయసులో వెళ్తాము. ఔనా? నీవు తొంబై ఐదేళ్ళ వయసులో “పరలోకానికి కెంత వయసులో వెళ్తానని”అడగొచ్చు. లేదా నాలుగు, ఐదేళ్ళ వయసులో “నేను నాలుగైదేళ్ళ వయసులో పరలోకం వెళ్తానా” అని అడగొచ్చు. మనం Randy ని ఈ ప్రశ్న అడగబోతున్నాం. అక్కడ భవనంలో ఉంటామా? పరలోకంలో ఎక్కడ నివసిస్తాము? అందరూ జవాబులు తెలుసు కోవాలని ఆశిస్తున్న సాధారణమైన ప్రశ్నలివి. వీటిని గురించి వచ్చేవారం చర్చిస్తాం. తప్పక ప్రోగ్రాంని చూడండి.

 

 

 

 

 

మరిన్ని టీవీ ప్రోగ్రామల్ని చుచెందుకు ఉచిత

FREE John Ankerberg Show App download చెసుకొండి

“Pray to Accept Jesus Christ as Your Savior” @  JAshow.org

కాపీరైట్ 2015 ATRI.

 

 

 

இயேசு திரைப்படம்

கிறிஸ்தவராவது எப்படி

நீங்கள் எப்படி கிறிஸ்தவராக முடியும்? கிறிஸ்தவர் என்பவர் இயேசுவை நம்பி அவருடைய பாதையை பின்பற்றுகிறவனாக இருக்கிறான். நீங்கள் கிறிஸ்தவர் என்பதை அறிந்துகொள்ள வேதம் உங்களுக்கு நேர்த்தியான பதில்களை அளிக்கிறது. கிளிக் செய்யவும்.

ஆடியோ பைபிள்

சீர்திருத்த பாடநெறி